
Motorola: 200 ఎంపీ కెమెరాతో మోటోరోలా కొత్త ఫోన్.. విడుదల ఎప్పుడంటే?
ఇంటర్నెట్‌డెస్క్: గత కొంతకాలంగా స్మార్ట్‌ఫోన్ ఫీచర్లలో ఎన్నో మార్పులు జరుగుతున్నాయి. వీటిలో ముఖ్యంగా కెమెరా గురించి చెప్పుకోవాలి. సాధారణ డీఎస్ఎల్ఆర్ కెమెరాలకు ధీటుగా అధిక మెగాపిక్సెల్ సామర్థ్యంతో స్మార్ట్‌ఫోన్ కెమెరాలను తీసుకొస్తున్నాయి మొబైల్ తయారీ కంపెనీలు. ఇప్పటికే శాంసంగ్, రియల్మీ, షావోమి, మోటోరోలా కంపెనీలు 108 మెగాపిక్సెల్ కెమెరాలతో ఫోన్లను విడుదల చేశాయి. కొద్దిరోజుల క్రితం షావోమి, శాంసంగ్ కంపెనీలు 200 మెగాపిక్సెల్ సామర్థ్యం కలిగిన కెమెరాతో ఫోన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించాయి. ఇప్పుడు ఈ జాబితాలో మోటోరోలా కూడా చేరనుంది. త్వరలోనే మోటోరోలా కంపెనీ 200 ఎంపీ కెమెరాతో ఫోన్ విడుదల చేయనున్నట్లు సమాచారం.
మోటోరోలా ఈ కెమెరాలో ఐఎస్ఓఎల్ఈఎల్ఎల్ హెచ్‌పీ1 అనే శాంసంగ్ లెన్స్‌ను ఉపయోగించింది. ఈ లెన్స్‌తో 30fps రేట్‌తో 8K వీడియోలను, 120fps రేట్‌తో 4k వీడియోలను రికార్డ్ చేయొచ్చు. తక్కువ కాంతి ఉన్నప్పుడు ఈ కెమెరా 2x2, 4x4 పిక్సెల్ మోడ్స్‌ను సపోర్ట్ చేస్తుంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ ఫోన్‌ను విడుదలచేయాలని మోటోరోలా కంపెనీ భావిస్తోంది. మోటోరోలా ఇప్పటికే 108 ఎంపీ కెమెరా సామర్థ్యంతో మోటో జీ60, మోటో ఎడ్జ్ 20, మోటో ఎడ్జ్ 20 ఫ్యూజన్, మోటో ఎడ్జ్ 20 ప్రో మోడల్ ఫోన్లను విడుదల చేసింది. ఈ క్రమంలోనే 200 ఎంపీ కెమెరాతో ఫోన్‌ను విడుదల చేయనుంది. షావోమి కూడా 200 ఎంపీ కెమెరాతో ఫోన్‌ను వచ్చే ఏడాదిలో విడుదల చేయనుందట. అయితే శాంసంగ్ మాత్రం 2023 నాటికి విడుదల చేయాలని భావిస్తోందని టెక్ వర్గాలు తెలిపాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా మోడల్లో ఈ 200 ఎంపీ కెమెరాను అమర్చనున్నట్లు సమాచారం.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.