Motorola Rolling Display: బటన్‌ నొక్కితే ఒకసారి పైకి, మరోసారి కిందకు.. మోటోరోలా కొత్త డిస్‌ప్లే!

ఇటీవల జరిగిన లెనోవా టెక్‌ వరల్డ్‌ కార్యక్రమంలో కంపెనీ నుంచి భవిష్యత్తులో రాబోయే పలు కొత్త ఉత్పత్తులను ప్రదర్శించింది. మరి, ఆ కొత్త ఉత్పత్తులు ఏంటి? వాటిలో ఎలాంటి ఫీచర్లు ఇస్తున్నారు? వంటి వివరాలపై ఓ లుక్కేద్దాం. 

Published : 24 Oct 2022 19:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మోటోరోలా.. ప్రపంచంలో తొలి మొబైల్‌ ఫోన్‌ను అందించిన సంస్థ. 90వ దశకంలో ఫోన్ మార్కెట్లో నోకియా తర్వాతి స్థానం మోటోరోలాదే. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సరికొత్త ఆవిష్కరణలతో అగ్రస్థానంలో ఉన్న శాంసంగ్, షావోమి కంపెనీలతో పోటీ పడుతోంది. ఇటీవలే 200 ఎంపీ సామర్థ్యంతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. త్వరలో రోలింగ్ డిస్‌ప్లేతో ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎల్‌జీ, శాంసంగ్ కంపెనీలు రోలింగ్‌ డిస్‌ప్లేతో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించాయి. తాజాగా ఈ జాబితాలో మోటోరోలా కూడా చేరిపోయింది. ఈ మేరకు గత వారం జరిగిన లెనోవా టెక్‌ వరల్డ్‌లో రోలింగ్ డిస్‌ప్లేను ప్రదర్శించింది. 

మోటోరోలా రోలింగ్ డిస్‌ప్లే సైజు 5 అంగుళాలు. డిస్‌ప్లే పైకి జరిపితే 6.5 అంగుళాలు. స్క్రీన్‌ పైకి, కిందకు జరిగేందుకు ఫోన్‌ సైడ్‌లో బటన్ ఉంటుంది. దానిని ప్రెస్ చేయగానే స్క్రీన్‌ పెద్దగా మారిపోతుంది. వీడియోలు చూసేప్పుడు, గేమ్స్‌ ఆడేప్పుడు ఈ ఫీచర్‌ ఎంతో ఉపయోగపడుతుందని లెనోవా భావిస్తోంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫోన్‌ను త్వరలోనే సాధారణ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతోపాటు లెనోవా రోలింగ్‌ డిస్‌ప్లేతో ల్యాప్‌టాప్‌ను పరిచయం చేయనుంది. ఈ ల్యాప్‌టాప్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవలే ఆసుస్ కంపెనీ ఫోల్డింగ్ డిస్‌స్లేతో ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని ధర ₹ 3 లక్షలు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని