Updated : 17/11/2021 10:25 IST

Data Privacy: ఆ డివైజ్‌లు వాడుతున్నారా.. మొజిల్లా ఏం చెబుతోందంటే?

ఇంటర్నెట్‌డెస్క్‌: అల్లాద్దీన్‌ అద్భుత దీపం మీద చేతితో తడమగానే జీ హుజూర్‌.. ఆజ్ఞ అంటూ భూతం ప్రత్యక్షమవుతుంది. అల్లాద్దీన్ ఇచ్చిన ఆదేశాలను పాటిస్తూ పనులన్నీ చక్కబెట్టేస్తుంది. ప్రస్తతం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో పనిచేస్తే స్మార్ట్‌ డివైజ్‌లు కూడా ఇదే పనిచేస్తున్నాయి. అందులో ఉన్న వాయిస్‌ అసిస్టెంట్‌కు కమాండ్ ఇవ్వగానే డివైజ్‌ పని ప్రారంభిస్తుంది. దీంతో ఇంటర్నెట్‌ కనెక్టివిటీ, వాయిస్‌ అసిస్టెంట్ ఫీచర్స్‌ ఉండే స్మార్ట్‌ డివైజ్‌లకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. అయితే వీటి వినియోగం సురక్షితం కాదంటున్నారు టెక్ నిపుణులు. వీటిలో కొన్ని కంపెనీలు అభివృద్ధి చేసిన డివైజ్‌లు యూజర్‌ డేటాను సేకరించి వాటిని ఇతరులకు అమ్మేస్తున్నట్లుగా గుర్తించినట్లు ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ తెలిపింది. తాజాగా మొజిల్లా విడుదల చేసిన ‘ప్రైవసీ నాట్ ఇన్‌క్లూడెడ్’ (గోప్యత పాటించని) ఐదో వార్షిక గైడ్‌లో ఈ విషయాన్ని ప్రస్తావించింది. అలానే  కెమెరా, మైక్రోఫోన్‌, జీపీఎస్‌ ద్వారా యూజర్‌ డేటా సేకరిస్తున్న కొన్ని కంపెనీల స్మార్ట్‌  ఉత్పత్తుల గురించిన వివరాలు కూడా వెల్లడించింది.

‘‘మనలో చాలా మంది కుటుంబసభ్యులకు ఉపయోగకరంగా ఉంటాయనే ఉద్దేశంతో స్మార్ట్‌ డివైజ్‌లను బహూకరిస్తుంటాం. అయితే అవి సురక్షితమైనవి కావనేది చాలా మందికి తెలియని విషయం. ప్రస్తుతం అందుబాటులో ఉన్నవాటితోపాటు భవిష్యత్తులో రాబోయే గ్యాడ్జెట్స్‌ ఎంతో అడ్వాన్స్‌డ్ ఫీచర్స్‌తో రావచ్చు. కానీ, భద్రత, గోప్యత, డేటా లీక్‌ పరంగా ఇవి ఏమాత్రం సురక్షితం కావు. దిగ్గజ సంస్థలైన మైక్రోసాఫ్ట్, అమెజాన్‌, మెటా (ఫేస్‌బుక్‌)లు  సైతం యూజర్‌ డేటాను సేకరిస్తున్నాయి. దాంతో ఏదైనా కంపెనీ సేవలను వినియోగించే ముందు ఆయా సంస్థలు సేకరించే డేటా గురించి యూజర్స్‌ పూర్తి అవగాహనతో ఉండటం మంచిది’’ అని మెజిల్లా పరిశోధనకు నేతృత్వం వహించిన జెన్‌ కాల్టెడర్‌ సూచించారు.

సుమారు 950 గంటలకుపైగా 151 కనెక్టెడ్‌ డివైజ్‌లపై ఈ పరిశోధన కొనసాగించినట్లు జెన్ తెలిపారు. వాటిని ఆరు కేటగిరీలుగా విభజించారు. అందులో గృహోపకరణాలు‌, టాయ్స్‌&గేమ్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్, ధరించేవి (వేరబుల్స్‌)‌, ఆరోగ్యం (హెల్త్‌) , వ్యాయామం (ఎక్సర్‌సైజ్)‌, పెంపుడు జంతువులకు సంబంధించిన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిలో  47 ఉత్పత్తులు ఎలాంటి ప్రైవసీ నిబంధనలను పాటించడంలేదని మొజిల్లా గైడ్‌లో పేర్కొంది. వాటిలో ముఖ్యంగా ఫేస్‌బుక్‌ పోర్టల్‌, అమెజాన్‌ ఈకో, నార్డిక్‌ట్రాక్‌ ట్రెడ్‌మిల్‌ డివైజ్‌లు నిబంధనలకు విరుద్ధంగా యూజర్‌ డేటాను సేకరిస్తున్నాయని తెలిపారు.

మెటా సంస్థ ఫేస్‌బుక్‌ పోర్టల్‌లోని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ సాయంతో మైక్రోఫోన్‌, స్మార్ట్ కెమెరా సాయంతో యూజర్‌ ప్రమేయం లేకుండా వారి డేటాను సేకరిస్తోందని తెలిపారు. అమెజాన్‌ ఈకో డాట్ పిల్లలకు కథలు వినిపిస్తూ వారికి సాయపడుతుందని చాలా మంది భావిస్తుంటారు. కానీ ఈ డివైజ్‌ ద్వారా అమెజాన్‌ చిన్నారులకు సంబంధించిన సమాచారం సేకరిస్తున్నట్లు వెల్లడించారు. ఇందులోని ఓనిక్స్‌ బూక్స్‌ ఈ-రీడర్‌ ఎలాంటి గోప్యత ప్రమాణాలను పాటించడంలేదని మొజిల్లా తన గైడ్‌లో పేర్కొంది. అలానే నార్డిక్‌ట్రాక్ ట్రెడ్‌మిల్ యూజర్‌ నుంచి సేకరించిన డేటాను ప్రకటనలు పంపే సంస్థలకు అమ్మేస్తుందని నివేదికలో వెల్లడించింది.

అమెజాన్‌ అలెక్సా ఉన్న డివైజ్‌లలో చాలా ఉత్పత్తులు ఆ సంస్థ తయారుచేయడంలేదని తెలిపింది. ఒకవేళ డేటా సేకరించవద్దని యూజర్‌ అమెజాన్‌ను కోరినప్పటికీ కొంతైనా డేటా సేకరిస్తున్నట్లు గుర్తించామని మొజిల్లా వెల్లడించింది. యూజర్‌ ప్రమేయం లేకుండా క్విక్‌సెట్, అమేజ్‌ఫిట్‌, యూబీటెక్‌, ఓనిక్స్‌ బూక్స్‌, ఎఫ్‌ఐ సిరీస్‌2, విజిల్ పెట్ ట్రాకర్స్‌ వంటి డివైజ్‌లు ఎలాంటి గోప్యత నిబంధనలు పాటించకుండా.. నిబంధనలకు విరుద్ధంగా డేటా సేకరిస్తున్నాయని మొజిల్లా తెలిపింది.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని