Updated : 05 Nov 2021 09:24 IST

New PC Installation: కొత్త కంప్యూటర్‌లో తప్పక ఉండాల్సినవి ఏంటి?

ఇంటర్నెట్‌డెస్క్‌: ఏదైనా కొత్త పీసీ (పర్సనల్‌ కంప్యూటర్‌) తీసుకున్నా.. లేదా విండోస్‌ రీ ఇన్‌స్టాల్‌ చేయాలన్నా.. యాప్‌ల ఇన్‌స్టలేషన్‌ అనేది మొట్టమొదటి టాస్క్‌. అయితే, పీసీలో తప్పనిసరిగా ఉండాల్సిన కొన్ని యాప్‌లు, సాఫ్ట్‌వేర్లు, వాటి ప్రత్యామ్నాయాల జాబితా ప్రత్యేకంగా మీ కోసం..

బ్రౌజింగ్‌కో యాప్‌.. 

ఇంటర్నెట్‌ బ్రౌజ్‌ చేయకుండా రోజు గడవాలంటే ప్రస్తుత ఆధునిక జీవితంలో ఒక విధంగా అసాధ్యమే. కాబట్టి పీసీలో ఏదైనా ఒక ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌ యాప్‌ కచ్చితంగా ఉండాల్సిందే. ఇందులో ‘గూగుల్‌ క్రోమ్ (Google Chrome) ‌’ ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. చిత్రాలు వంటి ఇన్‌స్టంట్‌ సెర్చింగ్‌కు మొబైల్స్‌, ట్యాబ్‌, పీసీల్లో ‘గూగుల్‌ క్రోమ్‌’ అద్భుతంగా పనిచేస్తుంది. అయినప్పటికీ ‘గూగుల్ క్రోమ్‌’లో కొన్ని లోపాలున్నాయన్నది నిపుణులు మాట. విస్తృత ట్రాకింగ్‌, అధిక ర్యామ్‌ వినియోగాన్ని క్రోమ్‌ నియంత్రించాలని సూచిస్తున్నారు. దీనికి ప్రత్యామ్నయంగా ‘ఫైర్‌ఫాక్స్ (Firefox)’‌, ‘ఒపెరా (Opera)’ ఎంపిక చేసుకోవచ్చు. పైవన్నీ పూర్తి ఉచితమే.

మడత‘పెట్టి’ పంపించండి!

నవయుగంలో భుజాన బండెడు ఫైల్స్‌ పెట్టుకొని ఇతరుల వద్దకు తీసుకువెళ్లే దానికంటే వాటిని మడత‘పెట్టి’ పంపించడమే ఉత్తమం. ఇందుకు ఒకటే క్లౌడ్‌ యాప్‌ సర్వీసు కావాలనుకుంటే ‘గూగుల్‌ డ్రైవ్‌ (Google Drive )’ ప్రత్యేకంగా మీకు కోసమే. 15 జీబీ ఫ్రీ స్టోరెజీతో ‘గూగుల్‌ డ్రైవ్‌’ వస్తుంది. ‘గూగుల్‌ ఫొటో’, ‘జీ-మెయిల్‌’ అకౌంట్స్‌తో దీనిని యాక్సిస్‌ చేయడం చాలా సులభం. తద్వారా చిటికెలో ఫైల్‌ షేరింగ్‌ చేయొచ్చు. ఇక చెల్లింపుల విషయానికొస్తే ‘గూగుల్‌ డ్రైవ్‌’ సబ్‌స్క్రిప్షన్‌తోపాటు ఉచితంగా లభిస్తుంది.

సంగీత ప్రియులకు ప్రత్యేకం

ఉరుకులపరుగుల జీవితంలో కాసేపు మంచి సంగీతం వింటే మనసుకు కలిగే ప్రశాంతతే వేరు. సంగీత ప్రియులకు మార్కెట్లో చాలా యాప్‌లు అందుబాటులో ఉన్నా.. మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ గొప్పవాటిల్లో ‘స్పాటిఫై (Spotify)’, ‘యాపిల్‌ మ్యూజిక్ (Apple Music) ’, ‘యూట్యూబ్‌ మ్యూజిక్ (YouTube Music) ‌’ ఉన్నాయి. వీటిల్లో పాడ్‌కాస్ట్‌లూ ఉన్నాయి. ఇక ‘స్పాటిఫై’, ‘యూట్యుబ్‌’ ఫ్రీగా లభించడంతో పాటు సబ్‌స్క్రిప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి.

ఆఫీస్‌ వర్క్‌ కోసం..

విద్యార్థులు, ఉద్యోగుల ఆఫీస్‌ వర్క్‌ కోసం ‘మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ (Microsoft Office)’ మంచి ఎంపికే. కానీ.. డబ్బులు చెల్లించాలని వారి కోసం ‘లిబ్రెఆఫీస్‌ (LibreOffice)’, ‘ఫ్రీ ఆఫీస్‌ (FreeOffice) అందుబాటులో ఉన్నాయి. ఎంఎస్‌ వర్డ్‌ (Microsoft Word), ఎక్సెల్‌ (Excel), పవర్‌పాయింట్‌ (PowerPoint) ప్రజంటేషన్లకు వీటిలో ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. 

ఇమెజ్‌లకు న్యూ టచ్‌

ఓ ఇమెజ్‌ను అందంగా తీర్చిదిద్దాలంటే పీసీల్లో ఇమెజ్‌ ఎడిటింగ్‌ కోసం ఏదో ఒక ప్లాట్‌ఫామ్‌ ఉండాలి. ఓల్డ్‌ ఇమేజ్‌లకు న్యూ టచ్‌ ఇచ్చి వినూత్నంగా మార్చాడానికి ఇవి మనకు సహకరిస్తాయి. ఇందుకు ‘పెయింట్‌.నెట్‌ (Paint.NET)’, ‘జీఐఎంపీ (GIMP)’ పూర్తి ఉచితంగా లభిస్తున్నాయి. ‘ఎంఎస్‌ పెయింట్ (Microsoft Paint)’ ఇవి ఏ మాత్రం తగ్గకుండా ఇంకా మెరుగ్గా పనిచేస్తాయి. స్ర్కీన్‌షాట్‌ తీయడానికి ‘షేర్‌ఎక్స్ (ShareX) ‌’, ‘పిక్‌పిక్ (PicPick)’ ట్రై చేయండి. పైవన్నీ పూర్తి ఉచితమే.

భద్రతకు భరోసా

ప్రస్తుత రోజుల్లో భద్రతకు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పీసీల్లో సెకండరీ సెక్యూరిటీ ప్రొగ్రామ్‌ ఇన్‌స్టాల్‌ చేయడం ఒక విధంగా మంచిదేనని నిపుణలు సూచిస్తున్నారు. ఇందుకు ‘మాల్‌వెర్‌బైట్స్‌ (Malwarebytes)’ ట్రై చేయొచ్చు.

మరిన్ని..

ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్‌లపై కాకుండా ఆఫ్‌లైన్‌లో మన ఫైల్స్‌లోని వీడియో చూడాలంటే.. పీసీలో తప్పనిసరిగా ఓ వీడియో ప్లేయర్‌ ఉండాలి. ఇందుకు ‘వీఎల్‌సీ (VLC)’ పూర్తి ఉచితంగా లభిస్తుంది. ఫైల్ కంప్రెషన్‌, ఎక్స్‌ట్రాక్షన్‌ కోసం ‘7-జిప్ (7-Zip)‌’ , ‘పీ-జిప్ (PeaZip)‌’ ఉచితంగా వాడొచ్చు. ఇక క్లిప్‌బోర్టు మెనేజింగ్‌కు ‘క్లిప్‌క్లిప్ (ClipClip)’, పాస్‌వర్డ్‌ మెనేజింగ్‌కు ‘బిట్‌వార్డెన్ (Bitwarden) ’‌.., బ్యాకప్‌కు ‘బ్యాక్‌బ్లెజ్ (Backblaze)’, స్టోరేజ్‌ మెనేజింగ్‌కు ‘ట్రీసైజ్‌ఫ్రీ (TreeSize Free)’ అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఉచితంగా లభించడంతో పాటు సబ్‌స్క్రిప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. 

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని