Netflix: నెట్‌ఫ్లిక్స్‌ నుంచి కొత్త సర్వీస్‌

ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ మరో కొత్త సర్వీస్‌తో యూజర్స్‌ని అలరించేందుకు సిద్ధమవుతుంది. త్వరలోనే గేమ్ స్ట్రీమింగ్ సేవలను ప్రారంభించనున్నట్లు సమాచారం. అయితే గేమింగ్ సేవలను నెట్‌ఫ్లిక్స్ యాప్‌ ద్వారా కాకుండా వేరుగా అందివ్వనున్నారు. గూగుల్ స్టాడియా, ఎక్స్‌బాక్స్‌ క్లౌడ్ తరహాలోనే ఈ సర్వీస్‌ ఉంటుందని సమాచారం...

Published : 16 Jul 2021 23:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్స్ మరో కొత్త సర్వీస్‌తో యూజర్స్‌ని అలరించేందుకు సిద్ధమవుతోంది. త్వరలోనే గేమ్ స్ట్రీమింగ్ సేవలను ప్రారంభించనున్నట్లు సమాచారం. అయితే గేమింగ్ సేవలను నెట్‌ఫ్లిక్స్ యాప్‌ ద్వారా కాకుండా వేరుగా అందివ్వనున్నారు. గూగుల్ స్టాడియా, ఎక్స్‌బాక్స్‌ క్లౌడ్ తరహాలోనే ఈ సర్వీస్‌ ఉంటుందని సమాచారం. అలానే నెట్‌ఫ్లిక్స్ గేమింగ్ సేవలను పొందేందుకు ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ కూడా అవసరం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

డాక్యుమెంటరీస్‌, స్టాండ్‌-అప్‌ స్పెషల్స్‌ తరహాలోనే గేమింగ్ సేవలు కూడా ప్రత్యేక కేటగిరీలో అందివ్వనున్నారు. గేమింగ్‌కు అనుకూలమైన హార్డ్‌వేర్‌ ఫీచర్స్‌తో కంప్యూటర్ లేకున్నా క్లౌడ్ ఆధారిత సేవల ద్వారా యూజర్స్ ఆన్‌లైన్‌లో నెట్‌ఫ్లిక్స్ సేవలు పొందొచ్చు. ప్రస్తుతం అందిస్తున్న వీడియో కంటెంట్‌ సేవలకు అదనంగా వీటిని అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే దీని సంబంధించి ప్రత్యేకంగా మైక్ వెర్డూ అనే గేమ్‌ డెవలప్‌మెంట్ నిపుణుడిని నెట్‌ఫ్లిక్స్‌ నియమించికున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది కల్లా నెట్‌ఫ్లిక్స్ గేమింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని