Updated : 28/08/2020 19:48 IST

సరికొత్త ఫీచర్లతో క్రోమ్.. మీ పనులు సులువు

ఇంటర్నెట్ డెస్క్‌: మారిన సాంకేతికయుగంలో ఏ పని చేయాలన్నా ఇంటర్నెట్ ఉండాల్సిందే. కరోనా విసిరిన పంజా కారణంగా ప్రపంచం మొత్తం ఆన్‌లైన్‌ సేవలపైనే ముఖ్యంగా ఆధారపడాల్సిన పరిస్థితి. ఆన్‌లైన్‌ పాఠాలు, వీడియో కాన్ఫరెన్స్‌లు, వీడియో కాలింగ్స్‌.. ఇలా కమ్యూనికేషన్‌ అంతా ఆన్‌లైన్‌లోనే జరిగిపోతోంది. మరి అలాంటప్పుడు ఇంటర్నెట్‌ను వేగంగా యాక్సెస్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియలో బ్రౌజర్ పాత్ర ఎంతో కీలకం. ఈ నేపథ్యంలో బ్రౌజింగ్‌ పనితనాన్ని గూగుల్‌ మెరుగుపరిచి, కొత్త ఫీచర్లతో ‘గూగుల్ క్రోమ్’ బ్రౌజర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం కొత్తగా చేర్చిన సరికొత్త ఫీచర్లు ఏంటో తెలుసుకోండి.. 

పెరిగిన ట్యాబ్‌ల వేగం
ఏదైనా బ్రౌజర్‌లో ఒకేసారి పదుల సంఖ్యలో వెబ్‌సైట్లు ఓపెన్ చేసి పని చేయాలంటే ట్యాబ్‌లు సరిగా పని చేయాలి. కొన్నిసార్లు ఇంటర్నెట్ వేగం తక్కువ ఉన్నా.. లేదా బ్రౌజర్‌ వేగంగా స్పందించకపోయినా కావాల్సిన వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయడం కష్టతరమవుతుంది. బ్రౌజర్‌లో కొత్త ట్యాబ్‌లు ఓపెన్ చేయాలన్నా ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇలాంటి సమస్యలను పరిష్కరించి గూగుల్ తన బ్రౌజర్‌లో కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. మునపటి ట్యాబ్‌ల వేగం కంటే దాదాపు పదిశాతం ఎక్కువ వేగంతో కొత్త ట్యాబ్‌లు పనిచేయనున్నాయి. దీంతో మీ ఇంటర్నెట్ బ్రౌజింగ్ వేగం పెరిగి పనులు చకచకా అయిపోతాయి. అంతేకాకుండా ట్యాబ్‌ గ్రూప్‌లను సులభంగా తీసేయవచ్చు. యాడ్ చేయవచ్చు.

యాఆర్‌ఎల్ షేరింగ్‌లో ఇంప్రూవ్‌మెంట్
క్రోమ్‌లో కొత్తగా తీసుకొచ్చిన మరో మార్పు యూఆర్‌ఎల్‌ షేరింగ్‌. అప్‌డేట్ చేసిన క్రోమ్‌ బ్రౌజర్‌లో అత్యంత వేగంగా యూఆర్‌ఎల్ లింక్‌ను కాపీ చేసి మీ ఇతర డివైజ్‌లకు పంపొచ్చు. దీనివల్ల మీ బ్రౌజింగ్ సమయం ఆదా అవుతుంది.

క్రోమ్‌లో క్యూఆర్ కోడ్

ఇప్పటి వరకు మనం డబ్బులు చెల్లించేటప్పుడో.. ఏదైనా వస్తువు గురించి సమాచారం కావాల్సినప్పుడో.. కొన్ని వెబ్‌సైట్లను యాక్సెస్ చేయడానికో మనం క్యూఆర్ కోడ్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నాం. ఇప్పుడు క్రోమ్‌ తన బ్రౌజర్‌లో క్యూఆర్ కోడ్‌ను పరిచయం చేసింది. కొత్త క్రోమ్‌ బ్రౌజర్‌లో సులభంగా క్యూఆర్ కోడ్‌ను జనరేట్ చేసుకోవచ్చు. క్రోమ్‌లోని అడ్రస్ బార్‌లో ఈ క్యూఆర్ కోడ్ ఆప్షన్‌ను గూగుల్ పొందుపరిచింది. అంతేకాకుండా పీడీఎఫ్‌ ఫైల్‌ల విషయంలో కూడా క్రోమ్‌ బ్రౌజర్‌ వేగంగా పనిచేసే విధంగా మార్పులు తీసుకువచ్చినట్లు గూగుల్ తెలిపింది.

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని