మ్యూజిక్‌ మస్తీ!

జేబీఎల్‌ సరికొత్త ఉత్పత్తుల్ని మార్కెట్‌లోకి తెచ్చింది. ముచ్చటగా మూడు రకాల స్పీకర్లు ఉన్నాయి. వాటి విశేషాలేంటో తెలుసుకుందాం!

Published : 17 Mar 2021 15:23 IST

కుర్రకారు జోరుకి మ్యూజిక్‌ మస్తీ తోడైతే.. ఆ సందడే వేరు. మరైతే.. వీకెండ్‌ పార్టీల్లోనో.. కుటుంబ ఫంక్షన్లలోనో.. నచ్చిన ట్రాక్స్‌ని ప్లే చేసుకుంటూ ఎంజాయ్‌ చేయాలంటే? ఇవిగోండి.. జేబీఎల్‌ సరికొత్త ఉత్పత్తుల్ని మార్కెట్‌లోకి తెచ్చింది. ముచ్చటగా మూడు రకాల స్పీకర్లు ఉన్నాయి. వాటి విశేషాలేంటో తెలుసుకుందాం!


‘బేస్‌’ బజాయించండి..

* జూమ్‌బాక్స్‌2

ఫుల్‌ సౌండ్‌తో నచ్చిన ట్రాక్స్‌ని ప్లే చేసుకునేందుకు అనువైంది. అదిరే బాస్‌ దీంట్లోని ప్రత్యేకత. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 24 గంటల పాటు పాటల్ని ప్లే చేస్తుంది. బీచ్‌ లేదా ఈత కొలనుల్లో పార్టీ చేసుకున్నా.. స్పీకర్‌ని వెంట తీసుకెళ్లొచ్చు. ఎందుకంటే.. దీనికి వాటర్‌ప్రూఫ్‌ రక్షణ ఉంది. బ్లూటూత్‌తో పలు డివైజ్‌లకు కనెక్ట్‌ అవుతుంది. 3.5ఎంఎం ఆడియో కేబుల్‌తోనూ స్పీకర్‌కి అనుసంధానం అవ్వొచ్చు. దీంట్లోని బ్యాటరీ సామర్థ్యం 10,000ఎంఏహెచ్‌. 6.5 గంటల్లో ఫుల్‌ ఛార్జ్‌ అవుతుంది. స్పీకర్‌తో కావాలంటే మీ ఫోన్‌లను కూడా ఛార్జ్‌ చేసుకోవచ్చు. అంటే.. పవర్‌బ్యాంకులానూ వాడుకోవచ్చు. స్పీకర్‌ బరువు 5.9 కేజీలు. * ధర రూ.33,999


‘ఆల్ట్రా-పోర్టబుల్‌’ స్పీకర్‌..

* జేబీఎల్‌ గో3

ఎక్కడికైనా వెళ్లేటప్పుడు ఫోన్‌ జేబులో వేసుకుని వెళ్తాం. ఇదే మాదిరిగా ఓ స్పీకర్‌ని కూడా పాకెట్‌లో పెట్టుకుని వెళ్తే! అలాంటిదే ఈ స్పీకర్‌. అందుకే దీన్ని అల్ట్రా-పోర్టబుల్‌ స్పీకర్‌గా జేబీఎల్‌ పరిచయం చేసింది. పిట్ట కొంచెం.. కూత ఘనం అన్నట్టుగా దీని ఆడియో క్వాలిటీ అదిరిపోతుంది. వాటర్‌ప్రూఫ్, డస్ట్‌ప్రూఫ్‌ రక్షణ కవచాలు ఉన్నాయి. దీంతో ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. మూడు రకాల రంగుల్లో దీన్ని రూపొందించారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే.. 5 గంటల పాటు పాటలు వినొచ్చు. 2.5 గంటల్లో ఫుల్‌ ఛార్జ్‌ అవుతుంది. యూఎస్‌బీ టైప్‌-సీ పోర్టు ఉంది. ఫోన్, ట్యాబ్లెట్‌ లేదా మరేదైనా బ్లూటూత్‌ నెట్‌వర్క్‌ పరికరాలకు కనెక్ట్‌ చేసుకుని స్పీకర్‌ని వాడుకోవచ్చు. * ధర రూ.2,999


తగిలించుకోండి..

* జేబీఎల్‌ క్లిప్‌ 4

భిన్నమైన డిజైన్‌తో దీన్ని తీర్చిదిద్దారు. కొక్కెంతో స్పీకర్‌ని ఎక్కడైనా తగిలించుకోవచ్చు. తక్కువ బరువుతో ఈ బుజ్జి పోర్టబుల్‌ స్పీకర్‌ ట్రెండీగా డిజైన్‌ చేశారు. పలు రంగులతో కూడిన ఫ్యాబ్రిక్స్‌తో స్పీకర్‌ని రూపొందించడంతో, అది మీ   స్టైల్‌లో భాగం అయిపోతుంది. వాటర్‌ప్రూఫ్, డస్ట్‌ప్రూఫ్‌ రక్షణ ఉంది. బ్లూటూత్‌ నెట్‌వర్క్‌తో ఫోన్, ట్యాబ్‌లకు కనెక్ట్‌ చేసుకుని మ్యూజిక్‌ ట్రాక్స్‌ని వినొచ్చు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే.. పది గంటలు పని చేస్తుంది. బ్యాటరీ ఫుల్‌ ఛార్జ్‌ అయ్యేందుకు పట్టే సమయం 3 గంటలు. దీని బరువు పావు కిలో కంటే తక్కువే. * ధర రూ.3,999

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని