కొత్త ప్రాసెసర్లతో ‘ఆసుస్‌’

ఒక పక్క కరోనా విజృంభణతో ఎక్కువ శాతం కంపెనీలు ఇంటి నుంచే పని చేసేలా చర్యలు చేపడుతున్నాయి. అలాగే, విద్యార్థుల చదువులు కూడా ఇంటికే పరిమితం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో టెక్నాలజీ వేదికల్ని ఆసరాగా చేసుకుని ఉద్యోగులు, విద్యార్థులు నెట్టింట్లోనే గడిసేస్తున్నారు. ..

Updated : 14 Apr 2021 17:10 IST

హైఎండ్‌ ల్యాపీల సందడి

ఒక పక్క కరోనా విజృంభణతో ఎక్కువ శాతం కంపెనీలు ఇంటి నుంచే పని చేసేలా చర్యలు చేపడుతున్నాయి. అలాగే, విద్యార్థుల చదువులు కూడా ఇంటికే పరిమితం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో టెక్నాలజీ వేదికల్ని ఆసరాగా చేసుకుని ఉద్యోగులు, విద్యార్థులు నెట్టింట్లోనే గడిసేస్తున్నారు. అందుకు ఎక్కువగా ల్యాప్‌టాప్‌లనే వాడుతున్నారు. అంతేనా.. మార్కెట్‌లో ఎలాంటి మోడళ్లు పరిచయం అవుతున్నాయా అని వెతుకులాడుతున్నారు. అలాంటి వారు కొత్తగా మార్కెట్‌లో పరిచయం చేసిన ఆసుస్‌ ల్యాపీలను చూడాల్సిందే. AMD Ryzen 5000-Series ప్రాసెసర్‌లతో అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ‘జెన్‌బుక్‌’, ‘వివోబుక’ పేర్లతో విడుదలైన ఈ కొత్త సిరిస్‌ ల్యాపీ కబుర్లు మీ కోసం..

నాజూకు లుక్‌తో..  జెన్‌బుక్‌ 13 ఓఎల్‌ఈడీ

టెక్నాలజీ ప్రియుల మనసు దోచుకున్న కొత్త సిరీస్‌లో ఇదే హైఎండ్‌. తెర పరిమాణం 13.3 అంగుళాలు. స్కీన్‌ ప్యానల్‌లో 88 శాతం తెరే కనిపిస్తుంది. అంటే.. అంచుల వరకూ తెరతో ఆకట్టుకుంటుంది. ర్యామ్‌ 8జీబీ. ఇంటర్నల్‌ ఎస్‌ఎస్‌డీ సామర్థ్యం 512జీబీ. మరో వేరియంట్‌గా 16జీబీ ర్యామ్‌, 1టీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ అందిస్తున్నారు. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 16 గంటలు వాడుకోవచ్చు. ఇంటెల్‌ వై-ఫై6, వై-ఫై మాస్టర్‌ టెక్నాలజీలతో వైర్‌లెస్‌ కనెక్టివిటీని వాడుకోవచ్చు. బరువు 1.11 కేజీలు.
♦ ధర రూ.79,990

పరిమాణం ఎక్కువగా..  వివోబుక్‌ 15, 17

ల్యాపీ తెర పరిమాణం పెద్దదిగా ఉండాలనుకునేవారికి ఇదో చక్కని ఎంపిక. 15.6 అంగుళాల సైజులో తెర కనిపిస్తుంది. ర్యామ్‌ 8జీబీ. ఇంటర్నల్‌ మెమొరీ 1టీబీ. AMD Ryzen 55500 ప్రాసెసర్‌ని వాడారు. రెండో ల్యాపీ విషయానికొస్తే.. తెర పరిమాణం ఇంకాస్త పెద్దది. 17 అంగుళాలు. అంచుల వరకూ తెరతో ఆకట్టుకుంటుంది. మిగతా స్పెసిఫికేషన్స్‌ అన్నీ వివోబుక్‌ 15లో ఉన్నట్టుగానే ఉన్నాయి. 
ధర రూ.54,990 (వివోబుక్‌ 15)
ధర రూ.62,990 (వివోబుక్‌ 17)

వంచుకుని వాడేయొచ్చు..

వివోబుక్‌ ఫ్లిప్‌ 14 .. అవసరం మేరకు ఎటైనా తిప్పుకుని వాడుకునేలా దీన్ని తీర్చిదిద్దారు. తాకేతెర పరిమాణం 14 అంగుళాలు. స్టైలస్‌, డిజిటల్‌ పెన్నులను సపోర్టు చేస్తుంది. 360 డిగ్రీల కోణంలో ఎటైనా తిప్పుకుని వాడుకోవచ్చు. పూర్తిగా మడతపెడితే ట్యాబ్లెట్‌లా మారిపోతుంది. స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే.. AMD Ryzen 7 5700 ప్రాసెసర్‌ని వాడారు. ర్యామ్‌ 8జీబీ. ఇంటర్నల్‌ ఎస్‌ఎస్‌డీ స్టోరేజ్‌ సామర్థ్యం 512జీబీ. 
ధర రూ.59,990

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని