Noise Smartwatch: ఫోన్‌ కాలింగ్, హెల్త్‌ సూట్‌ ఫీచర్లతో నాయిస్‌ కొత్త స్మార్ట్‌వాచ్‌

నాయిస్‌ కంపెనీ మరో కొత్త స్మార్ట్‌వాచ్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. నాయిస్‌ కలర్‌ఫిట్‌ అల్ట్రా 2 బజ్‌ (Noise ColorFit Ultra 2 Buzz)గా తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్‌తోపాటు మరికొన్ని కొత్త ఫీచర్లు ఉన్నాయి... 

Published : 19 Aug 2022 02:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాయిస్‌ కంపెనీ మరో కొత్త స్మార్ట్‌వాచ్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. నాయిస్‌ కలర్‌ఫిట్‌ అల్ట్రా 2 బజ్‌ (Noise ColorFit Ultra 2 Buzz)గా తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్‌తోపాటు మరికొన్ని కొత్త ఫీచర్లు ఉన్నాయి. మరి ఈ వాచ్‌ ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దామా..

నాయిస్‌ కలర్‌ఫిట్ అల్ట్రా 2 బజ్‌లో 1.78 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే ఉంది. ఆల్వేస్‌ ఆన్‌ డిస్‌ప్లేతో యూజర్లు వాచ్‌ స్క్రీన్‌ లేదా పవర్‌ బటన్ టచ్‌ చేయకుండా టైమ్‌, డేట్‌, స్టెప్స్‌ కౌంట్‌ చెక్ చేసుకోవచ్చు. బ్లూటూత్‌ వీ5.3 సాంకేతికతను ఉపయోగించారు. దీంతో స్మార్ట్‌వాచ్‌ను ఫోన్‌కు కనెక్ట్ చేసి ఫోన్‌కాల్స్‌ రిసీవ్‌, రిజెక్ట్‌ చేయడంతోపాటు కాల్స్‌ వచ్చినప్పుడు సైలెంట్‌ మోడ్‌లో పెట్టుకోవచ్చు. ఫోన్‌ మాట్లాడేందుకు వీలుగా స్మార్ట్‌వాచ్‌లో స్పీకర్‌, మైక్రోఫోన్‌ ఉన్నాయి. డయల్‌పాడ్ సాయంతో స్మార్ట్‌వాచ్‌ నుంచే ఫోన్‌ చేయడం, రీసెంట్ కాల్‌ లిస్ట్‌ను చూడొచ్చు.

ఈ వాచ్‌లో 290 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే వారంపాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. స్మార్ట్‌వాచ్‌ ఫుల్‌ ఛార్జ్‌ అయ్యేందుకు రెండు గంటల సమయం పడుతుంది. వంద రకాల వాచ్‌ ఫేస్‌లు, వంద స్పోర్ట్స్‌ మోడ్స్‌, ఐపీ68 రేటింగ్‌తోపాటు నాయిస్‌ హెల్త్‌ సూట్ ఉన్నాయి. ఈ హెల్త్‌ సూట్‌లో హార్ట్‌రేట్ సెన్సర్‌, బ్లడ్‌ ఆక్సిజన్‌ సెన్సర్‌, మెన్‌స్ట్రువల్ సైకిల్ ట్రాకింగ్‌, స్ట్రెస్‌ మానిటర్‌, స్లీప్‌ మానిటర్‌ వంటి ఫీచర్లు ఇస్తున్నారు. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్ డివైజ్‌లను సపోర్ట్ చేస్తుంది. ఈ వాచ్‌ ధర ₹ 6,999. ప్రారంభ ఆఫర్‌ కింద ₹ 3,499కే విక్రయిస్తున్నారు. అమెజాన్‌, గోనాయిస్‌ వెబ్‌సైట్‌ల నుంచి కొనుగోలు చేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని