Nothing Ear 1: ఈ ఇయర్‌బడ్స్‌ డిజైన్‌ వేరే లెవలబ్బా!

స్మార్ట్‌ఫోన్లతోపాటు వాటికి అనుసంధానంగా ఉపయోగించే ఇయర్‌బడ్స్‌కు క్రమంగా మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. అందుకే ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో కొత్త ఇయర్‌బడ్స్‌ వస్తున్నాయి. తాజాగా నథింగ్ కంపెనీ తన తొలి ఇయర్‌బడ్స్‌ ఇయర్‌ 1ను జులై 27న భారత మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది...

Published : 13 Jul 2021 23:57 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: స్మార్ట్‌ ఫోన్లతోపాటు వాటికి అనుసంధానంగా ఉపయోగించే ఇయర్‌బడ్స్‌కు క్రమంగా మార్కెట్లో డిమాండ్ పెరుగుతోంది. అందుకే ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో కొత్త ఇయర్‌బడ్స్‌ వస్తున్నాయి. తాజాగా నథింగ్ కంపెనీ తన తొలి ఇయర్‌బడ్స్‌ ఇయర్‌ 1ను జులై 27న భారత మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఒప్పో, రియల్‌మీ, వన్‌ప్లస్ ఇయర్‌బడ్స్‌కు పోటీగా ఇయర్‌ 1ను తీసుకొస్తున్నట్లు సమాచారం. నథింగ్‌ ఇయర్‌ 1 ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.

ఇందులో యాక్టివ్ నాయిస్‌ క్యాన్సిలేషన్ ఫీచర్‌తోపాటు మూడు హై డెఫినిషన్ మైక్‌లు ఉన్నాయి. భారత మార్కెట్లో వీటి ధర రూ.5,999గా కంపెనీ నిర్ణయించింది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా ఇయర్‌ 1 అమ్మకాలు జరగనున్నట్లు కంపెనీ తెలిపింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే విడుదల వరకు  వేచి చూడాల్సిందే. ‘‘ఫ్లిప్‌కార్ట్‌తో కలిసి మా ఉత్పత్తులను భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి ఇయర్‌ 1ను విడుదల చేస్తున్నాం. సులభంగా ఉపయోగించేలా నథింగ్ ఇయర్‌ 1ను డిజైన్ చేశాం’’ అని నథింగ్ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్ మనుశర్మ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని