Nothing Earbuds: 29 గంటల ప్లే టైమ్‌తో నథింగ్‌ కొత్త ఇయర్‌బడ్స్‌.. బడ్జెట్‌ కాస్త ఎక్కువే!

నథింగ్‌ ఇయర్‌ (స్టిక్‌) పేరిట కొత్త ట్రూ వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌ను నథింగ్‌ బ్రాండ్‌ భారత మార్కెట్లో విడుదల చేసింది.

Updated : 27 Oct 2022 16:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నథింగ్‌ ఇయర్‌ (1), నథింగ్‌ ఫోన్‌ (1) పేరిట గడిచిన రెండేళ్లలో తీసుకొచ్చింది రెండు ఉత్పత్తులే అయినా తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్‌ సంపాదించుకుంది నథింగ్‌ బ్రాండ్‌. దీంతో ఆ కంపెనీ తీసుకొచ్చే ఏ ఉత్పత్తి అయినా కుర్రకారులో కాస్త ఆసక్తే. తాజాగా ఆ కంపెనీ ట్రూ వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌తో (TWS) ముందుకొచ్చింది. నథింగ్‌ ఇయర్‌ (స్టిక్‌) (Nothing Ear (stick)) పేరిట దీన్ని లాంచ్‌ చేసింది. 29 గంటల ప్లేటైమ్‌తో వస్తున్న ఈ ఇయర్‌బడ్స్‌ ధరను భారత్‌లో రూ.8,499గా కంపెనీ నిర్ణయించింది. నవంబర్‌ 17 నుంచి ఫ్లిప్‌కార్ట్‌, మింత్రాలో వీటి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. భారత్‌ సహా దాదాపు 40 దేశాల్లో అదే రోజున విక్రయాలు ప్రారంభవుతాయి. యూఎస్‌, యూకే, యూరప్‌ మార్కెట్లలో నవంబర్‌ 4 నుంచే విక్రయాలు జరుగుతాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

ఇక నథింగ్‌ ఇయర్‌ (స్టిక్) ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 12.6 ఎంఎం డ్రైవర్స్‌ అమర్చారు. దీని ద్వారా అద్భుతమైన సౌండ్‌ క్వాలిటీ యూజర్లు ఆస్వాదించొచ్చని కంపెనీ చెబుతోంది. వీటి బరువు కేవలం 4.4 గ్రాములు మాత్రమే. బేస్‌ లాక్‌ టెక్నాలజీ, క్లియర్‌ వాయిస్‌ టెక్నాలజీని ఇందులో అందిస్తున్నారు. రెండు ఇయర్‌బడ్స్‌పైనా కంట్రోల్‌ బటన్స్‌ ఇస్తున్నారు. దీని ద్వారా మ్యూజిక్‌ను ప్లే, పాజ్‌, స్కిప్‌ చేయొచ్చని, యాక్టివ్ కంపెనీ తెలిపింది. దీంతో పాటు వాయిస్‌ అసిస్టెంట్‌ సదుపాయం, వాల్యూమ్‌ చేంజ్‌ చేసుకునే సదుపాయం కూడా ఉన్నాయని పేర్కొంది. కేవలం ఇయర్‌బడ్స్‌ ద్వారా ఏడు గంటల పాటు మ్యూజిక్‌ను ఆస్వాదించొచ్చని, 3 గంటల పాటు టాక్‌టైమ్‌ వస్తుందని కంపెనీ తెలిపింది. దీంతో పాటు వచ్చే కేస్‌ ద్వారా మరో 22 గంటల అదనపు ఛార్జింగ్‌ సదుపాయాన్ని పొందొచ్చని కంపెనీ వెల్లడించింది. ఈ కేస్‌ను కేవలం 10 నిమిషాలు ఛార్జ్‌ చేయడం ద్వారా రెండు గంటల మ్యూజిక్‌ను ఆనందించొచ్చని కంపెనీ పేర్కొంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని