Nothing Smartphone: ఫోన్‌ పేరు నథింగ్‌.. డిజైన్‌ అమేజింగ్‌!

నథింగ్ కంపెనీ త్వరలో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. యూజర్లకు మెరుగై ఆండ్రాయిడ్ డివైజ్ అనుభూతిని అందించడం కోసం ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. 

Published : 26 Mar 2022 02:24 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ట్రాన్సపరెంట్ డిజైన్‌ ఇయర్‌బడ్స్‌తో వినియోగదారులను ఆకర్షించిన నథింగ్‌ (Nothing) కంపెనీ.. కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. నథింగ్ ఫోన్‌ 1 (Nothing Phone 1) పేరిట తీసుకొస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ను కూడా ట్రాన్సపరెంట్‌గా తీర్చిదిద్దారు. ఈ  ఫోన్‌ను యాపిల్‌ ఐఫోన్‌కు ప్రత్యామ్నాయంగా తీసుకొస్తున్నట్లు నథింగ్‌ కంపెనీ వ్యవస్థాపకుడు కార్ల్‌ పై తెలిపారు. ఇందులో క్వాల్‌కామ్‌ ప్రాసెసర్‌ను ఉపయోగించినట్లు వెల్లడించారు. అలానే ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ ఆధారిత నథింగ్ ఓఎస్‌తో పనిచేస్తుందని చెప్పారు. నథింగ్ ఓఎస్‌ ఇతర ఆండ్రాయిడ్ ఓఎస్‌ల కంటే వేగంగా, మెరుగ్గా ఉంటుందని తెలిపారు.

ఈ ఫోన్‌లో ప్రకటనలు కూడా ఉండవని సమాచారం. అయితే నథింగ్‌ స్మార్ట్‌ఫోన్‌ను 2022 వేసవిలో విడుదల చేస్తామన్న కార్ల్‌.. కచ్చితమైన విడుదల తేదీని మాత్రం ప్రకటించలేదు. నథింగ్ ఫోన్‌ 1ను ఫ్లిప్‌కార్ట్‌ ఈ-కామర్స్‌ సంస్థ ద్వారా మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు సమాచారం. ఈ ఫోన్‌ ధరపై కూడా కంపెనీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. యూజర్లకు అత్యాధునిక సాంకేతికత, మెరుగైన పనితీరు, విభిన్నమైన డిజైన్‌, కచ్చితమైన ఆండ్రాయిడ్ వినియోగాన్ని అందిచడమే లక్ష్యంగా ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఐఫోన్‌కు ప్రత్యామ్నాయంగా తీసుకొస్తున్నామని చెబుతుండటంతో ధర కూడా ఐఫోన్‌తో సమానంగా ఉంటుందా? లేక సామాన్యుడికి అందుబాటు ధరలో ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు