QR@క్రోమ్: థర్డ్‌పార్టీ సర్వీసులు అక్కర్లేదు
గూగుల్ క్రోమ్‌లో సులభమైన పద్ధతిలో క్యూఆర్ కోడ్లను క్రియేట్ చేయొచ్చు. అదెలాగో కాస్త వివరంగా తెలుసుకుందాం!
ఏదైనా షేర్ చేయాలంటే గతంలో ముందు కాపీ చేయడం.. తర్వాత ఎక్కడ కావాలంటే అక్కడ పేస్ట్ చేయడం.. అవి వెబ్ యూఆర్ఎల్ లింక్‌లు అయినా.. అలాంటప్పుడు ఆయా లింక్‌లను తిరిగి ఓపెన్ చేయాలంటే? టైప్ చేసి చూడడం కొంచెం కష్టమే. ఈ సమస్యని అధిగమించేందుకు ఎప్పటి నుంచో క్యూఆర్ కోడ్లు ట్రెండింగ్ అయ్యాయి. కోడ్లను క్రియేట్ చేయడానికి చాలానే థర్డ్‌పార్టీ సర్వీసులూ ఉన్నాయి. కానీ, మీకు తెలుసా? వాటితో పని లేకుండా గూగుల్ క్రోమ్‌లో సులభమైన పద్ధతిలో క్యూఆర్ కోడ్లను క్రియేట్ చేయొచ్చు. అదెలాగో కాస్త వివరంగా తెలుసుకుందాం!
డేటాని పంచుకోవడం..
చూడ్డానికి అర్థం కాకుండా కనిపించే క్యూఆర్ కోడ్‌లో డేటాని షేర్ చేయడం టెకీలకు అలవాటైపోయింది. 4,296 ఆల్ఫాన్యూమరిక్ క్యారెక్టర్లని లేదా 7,089 అంకెల్ని ఓ చిన్న క్యూఆర్‌లో స్టోర్ చేసేస్తున్నారు. మొబైల్ ఫోన్ కెమెరాతో దాన్ని స్కాన్ చేసి డేటాని యాక్సెస్ చేస్తున్నారు. అలాంటి క్యూఆర్ కోడ్లను క్రోమ్లనే క్రియేట్ చేసేందుకు ఓ చిట్కా ఉంది. దాన్ని ఎనేబుల్ చేసేందుకు ప్రత్యేక కమాండ్ని వాడాలి. అదే chrome://flags/#sharing-qr-code-generator. బ్రౌజర్ సెర్చ్ బాక్స్‌లో ఎంటర్ చేసి ఆప్షన్ని ఎనేబుల్ చేయాలి. తిరిగి బ్రౌజర్‌ని రీలాంచ్ చేస్తే క్యూఆర్ కోడ్ ఫీచర్ బ్రౌజర్ ఆప్షన్స్‌లోకి వస్తుంది. ఇక ఎప్పుడైనా ఏదైనా వెబ్ పేజీ యూఆర్ఎల్కి క్యూఆర్ కోడ్‌ని క్రియేట్ చేయాలంటే.. పేజీలో రైట్క్లిక్ చేయాలి. వచ్చిన డ్రాప్‌డౌన్ మెనూలో Create QR code for this page ఆప్షన్ కనిపిస్తుంది. క్లిక్ చేస్తే క్షణాల్లో పేజీకి క్యూఆర్ కోడ్ వచ్చేస్తుంది. ఆ వెంటనే కోడ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఎవరితోనైనా యూఆర్ఎల్ లింక్‌ని పంచుకోవాలంటే క్యూఆర్ని షేర్ చేస్తే చాలు. దాన్ని ఫోన్లోని కెమెరా యాప్‌తో స్కాన్ చేసి లింక్‌ని పొందొచ్చు.
ఫోన్లో అయితే ఇలా..
డెస్క్‌టాప్‌లో మాదిరిగానే ఫోన్‌నూ క్రోమ్ బ్రౌజర్‌తో క్యూఆర్‌లు క్రియేట్ చేసుకోవచ్చు. అందుకు ఫోన్లో ఏదైనా వెబ్ పేజీని ఓపెన్ చేశాక పై భాగంలో కుడివైపు కనిపించే మూడు చుక్కల ఆప్షన్ని సెలెక్ట్ చేయాలి. వచ్చిన డ్రాప్‌డౌన్ మెనూలోని ‘షేర్’ ఆప్షన్ని క్లిక్ చేసి ‘క్యూఆర్ కోడ్’ని ఎంచుకోవచ్చు. దీంతో క్యూఆర్ తెరపై వచ్చేస్తుంది. డౌన్లోడ్ చేసి ఎవరితోనైనా పంచుకోవచ్చు. మరో విధానంతోనూ క్యూఆర్ ఆప్షన్ని ఫోన్లో పొందొచ్చు. అదెలాగంటే.. సెర్చ్‌లో వచ్చిన రిజల్ట్స్‌లో ఏదైనా లింక్‌కి క్యూఆర్ పెట్టాలనుకుంటే.. ఆ లింక్‌ని ఓపెన్ చేయకుండానే.. దానిపై ట్యాప్ చేసి ఉంచితే పాప్అప్ మెనూ వస్తుంది. దాంట్లో ‘షేర్ లింక్’ని తాకితే క్యూఆర్ కోడ్ ఆప్షన్ని చూడొచ్చు.
క్రోమ్ చిట్కా మరోటి..
డీఫాల్ట్‌గా బ్రౌజర్‌ని ఓపెన్ చేస్తే.. గూగుల్ సెర్చ్‌తో కూడిన ఖాళీ హోం పేజీ వస్తుంది. అప్పుడు మీరు దేనిలోకి వెళ్లాలనుకుంటున్నారో అది ఓపెన్ చేస్తుంటారు. కానీ, రోజూ నెట్టింట్లో అడుగుపెట్టగానే చూడాల్సిన సర్వీసులు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు జీమెయిల్ని చెక్ చేయడం.. వార్తాంశాల కోసం మరో వెబ్‌సైట్‌ని చూడడం.. ఇలా రోజూ అలవాటుగా చేస్తున్నట్లయితే.. బ్రౌజర్ ‘స్టార్ట్అప్’లో ఆటోమేటిక్‌గా వీటిని ట్యాబ్‌ల్లో ఓపెన్ అయ్యేలా చేయొచ్చు. అందుకు హోం హోం పేజీలోకి కనిపించే మూడు చుక్కల ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. వచ్చిన డ్రాప్‌డౌన్ మెనూలోకి సెట్టింగ్స్‌లోకి వెళ్తే On startup ఫీచర్ కనిపిస్తుంది. సెలెక్ట్ చేసి Open a specific page or set of pages ఆప్షన్ని ఎంచుకోండి. తర్వాత మీకు ఓపెన్ అవ్వాలనుకునే వెబ్ సర్వీసుల్ని జత చేయండి. అంతే.. మీరు ఎప్పుడు బ్రౌజర్‌ని ఓపెన్ చేసినా ఆయా సర్వీసులు చక చకా ఓపెన్ అవుతాయి.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మానవ రోబో దండు!
రోబో అనగానే ఏం గుర్తుకొస్తుంది? లోహ చట్రంతో కదిలే మర యంత్రమో, కదిలే లోహం బొమ్మో మదిలో కదలాడుతుంది. రబ్బరు కండరాలతో చేసినదైతే మనిషి మాదిరిగానూ కనిపిస్తుంది. చూపు, మాట మనిషిని పోలి ఉంటాయి. -
paul alexander: ఇనుప ఊపిరితిత్తి!
ఓ పొడవైన పెట్టె. శరీరమంతా అందులోనే. తల మాత్రమే బయటకు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 72 ఏళ్లు అందులోనే గడిపితే? అమెరికాకు చెందిన పాల్ అలెగ్జాండర్ అలాగే గడిపారు -
గూగుల్ సెర్చ్ తెలివిగా..
స్మార్ట్ఫోన్లలో గూగుల్ సెర్చ్‌ను వాడనివారుండరంటే అతిశయోక్తి కాదు. కానీ తేలికగా, త్వరగా ఆయా అంశాలను శోధించటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయనే సంగతి తెలుసా? అలాంటి కొన్ని ఉపాయాల గురించి తెలుసుకుందాం. -
భళారే డిజిటల్ విచిత్రం!
ఒకప్పటి కన్నా స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల సామర్థ్యం, వేగం పుంజుకున్న మాట నిజం. కానీ ఆకారంలో పెద్దగా మారింది లేదు. ఒకసారి అంచులు చిన్నగా.. మరోసారి కెమెరా బంప్‌లు పెద్దగా ఉండటం తప్పించి దాదాపు అలాగే కనిపిస్తుంటాయి. -
కృత్రిమ మేధ గుండె కాయ
కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎక్కడ చూసినా ఈ పేరే మార్మోగుతోంది. -
ఇక ఏఐ సినిమా!
పదాల కూర్పు ఆధారంగా చిటికెలో ఫొటోలు, చిత్రాలు, సంగీతం, పాటలను పుట్టిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) మరో అడుగు ముందుకేసింది. ఏకంగా వీడియోలనూ సృష్టించే స్థాయికి చేరుకుంది. విప్లవాత్మక ఛాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్ఏఐ సంస్థ కొత్తగా తీసుకొచ్చిన జనరేటివ్ కృత్రిమ మేధ (జెన్ఏఐ) మోడలే దీనికి నిదర్శనం. -
ఈ విశ్వ కిరణాలు..
విశ్వ కిరణాలు.. కాస్మిక్ రేస్. అంతరిక్షం ఆవలి నుంచి దూసుకొచ్చే ఇవి నిరంతరం అతి వేగంగా.. దాదాపు కాంతి వేగంతో సమానంగా విశ్వమంతటా ప్రయాణిస్తుంటాయి. వీటి మీద మొదటి నుంచీ శాస్త్రవేత్తలకు ఎంతో ఆసక్తి. ఎందుకంటే అంతరిక్షంలో పుట్టుకొచ్చిన చోటు, ఢీకొట్టిన వస్తువులను బట్టి ఇవి విశ్వానికి సంబంధించిన ఎన్నో విషయాలను వివరిస్తాయి. -
ప్రేమ శాస్త్రం!
ప్రేమ ఎందుకు పుడుతుందో, ఎవరి మీద పుడుతుందో తెలియదు. ఒకరికి నచ్చిన వ్యక్తి మరొకరికి నచ్చకపోవచ్చు. ఒకరికి అసలే నచ్చనివారు మరొకరికి ప్రాణం కన్నా మిన్నగా అనిపించ్చొచ్చు. -
ఫోల్డర్ మాయలు
విండోస్ పీసీలో రోజూ ఫోల్డర్లను వాడుతూనే ఉంటాం. కొత్త ఫైళ్లను స్టోర్ చేయటం, డేటాను వరుసగా పెట్టుకోవటం.. ఇలా ఎన్నింటికో వీటిని ఉపయో గిస్తుంటాం. మరి అదృశ్య ఫోల్డర్‌ను సృష్టించుకోగలరా? ఒకేసారి బోలెడన్ని ఫోల్డర్ల పేర్లను మార్చుకోగలరా? ఖాళీ ఫోల్డర్లను గుర్తించగలరా? ఇలాంటి కొన్ని చిత్రమైన ఫోల్డర్ చిట్కాల గురించి తెలుసుకుందాం. -
అమెజాన్ అడుగున బంగారు నేల
అమెజాన్ అనగానే దట్టమైన అడవులే గుర్తుకొస్తాయి. మనుషులు దూరటానికి వీల్లేని అక్కడ ఒకప్పుడు పెద్ద పట్టణమే ఉండేదని ఇటీవల తేలటం అందరినీ ఆశ్చర్యపరచింది -
ఏఐ టెక్కులు!
అసలే కృత్రిమ మేధ (ఏఐ) యుగం. ఆపై ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్ వస్తు ప్రదర్శన. ఇక చెప్పేదేముంది? ఏ పరికరాన్ని చూసినా ఏఐమయమే. హెల్త్ ట్రాకర్ల దగ్గరి నుంచి వాహనాల వరకూ అన్నింటికీ అదే ఆలంబన. -
Cyber Crime: నయా సైడర్!
నేటి సైబర్ యుగంలో నేరాలూ మారిపోతున్నాయి. ఆన్లైన్ మోసాలు కోకొల్లలు. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు చోరీ చేసి మన ప్రమేయమేమీ లేకుండానే నేరగాళ్లు షాపింగ్ చేయటం తెలిసిందే -
కొత్త టెక్ లోకం
డిజిటల్ పరిణామం ఆగేది కాదు. ఇదో నిరంతర ప్రక్రియ. గత ఏడాదిని గతి తిప్పిన ట్రెండ్స్ కొత్త సంవత్సరాన్నీ పరుగులు తీయించనున్నాయి. మెషిన్ ఇంటెలిజెన్స్ జోరందుకోనుంది. వాస్తవ, కాల్పనిక ప్రపంచాల మధ్య హద్దులు చెరగటం ఖాయంగా కనిపిస్తోంటే.. నిరంతర అంతర్జాల పరిణామ ప్రక్రియ మన జీవితాలను గణనీయంగా శాసించేలా రూపుదిద్దుకుంటోంది. -
ఇస్రో ఏఐ వత్సరం 2024
ఇది మనదేశం జాబిల్లిని తాకి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచిన సంవత్సరం.ఇది కృత్రిమ మేధ ప్రయోగశాలలను దాటుకొని నిత్య జీవన వ్యవహారాల్లోకి విరివిగా చొచ్చుకొచ్చిన సంవత్సరం.శాస్త్ర, సాంకేతిక రంగాలు ఒకదాంతో మరోటి పోటీ పడుతూ కొత్త వత్సరంలోకి అడుగిడుతున్న వేళ సాధించిన ఘనతలను సమీక్షించుకోవటం ముదావహం. -
స్థానిక మేధ
కృత్రిమ మేధ (ఏఐ) తీరు మారుతోంది. ఆంగ్లం గడపను దాటుకొని స్థానిక భాషలపై దృష్టి సారిస్తోంది. ఆయా భాషల వైవిధ్యం, యాసలు, సంస్కృతులకు అనుగుణంగా రూపాంతరం చెందుతోంది. -
గాజు బిందువు ఇంద్రజాలం
ఎప్పుడైనా గాజు కన్నీటి చుక్కల గురించి విన్నారా? అవి స్టీలు కన్నా దృఢంగా ఉంటే? బుల్లెట్ దెబ్బనైనా తట్టుకుంటే? సైన్స్ సూత్రాలనూ ధిక్కరిస్తే? అంత విచిత్రమైన గాజు బిందువు లేంటని అనుకుంటున్నారా? అవే ప్రిన్స్ రూపర్ట్స్ డ్రాప్స్. -
వృక్షో రక్షతి రక్షితః
జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఛార్లెస్ డార్విన్ అప్పుడెప్పుడో కన్న కల ఎట్టకేలకు సాకారమైంది. ప్రపంచంలో మనకు తెలిసిన అన్ని మొక్కల జాబితాను రూపొందించాలనే ఆయన ఆశయాన్ని రాయల్ బొటానిక్ గార్డెన్స్ ఇటీవల సాకారం చేసింది. -
వాతావరణతరంగ శోధన
భూమి, అంతరిక్ష వాతావరణం మధ్య జరిగే చర్యల మీద అధ్యయనం చేయటం దీని ఉద్దేశం. -
ఏఐయ్యారే!
సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఛాట్‌జీపీటి సమస్త సమాచార సారాంశాన్ని చిటికెలో ముందుంచుతోంది. -
వర్షం కృత్రిమం
ఉక్కపోస్తే ఫ్యాన్ వేసుకుంటాం. చుట్టుపక్కల గాలిని మనవైపు తిప్పుకొంటాం. ఇంట్లో ఉష్ణోగ్రత పెరిగితే ఏసీ వేసుకుంటాం. వేడి గాలిని చల్లబరచి హాయిని అనుభవిస్తాం -
Phone Hacking: ఫోన్ హ్యాక్ అయ్యిందా?
ప్రభుత్వ ప్రాయోజిత అటాకర్లు ఐఫోన్ల మీద దాడి చేసే అవకాశముందని ఇటీవల యాపిల్ సంస్థ ప్రముఖ ప్రతిపక్ష నేతలు, పాత్రికేయులను హెచ్చరించటం తీవ్ర కలకలం సృష్టించింది. ఒక్క మనదేశానికి చెందినవారికే కాదు.. 150 దేశాల్లోకి వ్యక్తులకూ ఈ నోటిఫికేషన్లు అందాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం యాపిల్‌కు నోటీసులు జారీ చేసి, వివరణ కోరింది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
-
జగన్.. ఈ 7 ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?: చంద్రబాబు సవాల్
-
సూచీల దూకుడు.. 900+ పాయింట్ల లాభంలో సెన్సెక్స్.. కారణమేంటి?
-
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
-
రషీద్ బౌలింగ్‌లో సిక్స్‌లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM