OnePlus 10 Pro 5G: అదిరిపోయే ఫీచర్లతో వన్‌ప్లస్‌ 10ప్రో 5జీ @66,999

వనప్లస్‌ ప్రీమియం శ్రేణిలో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వన్‌ప్లస్‌ 10 ప్రో 5జీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌లో ఫీచర్లపై ఓ లుక్కేద్దామా..

Updated : 31 Mar 2022 22:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఫ్లాగ్‌షిప్‌ మొబైల్ తయారీ కంపెనీ వన్‌ప్లస్‌ (OnePlus) ప్రీమియం శ్రేణిలో కొత్త మొబైల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వన్‌ప్లస్‌ 10 ప్రో 5జీ (OnePlus 10 Pro 5G) పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్‌లో మెరుగైన కెమెరాలతోపాటు ఆకర్షణీయమైన అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. మరి ఈ ఫోన్‌ ధరెంత? ఎలాంటి ఫీచర్లు ఇస్తున్నారు? ఎప్పటి నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయనేది చూద్దాం.. 

వన్‌ప్లస్‌ 10ప్రో 5జీ (OnePlus 10 Pro 5G) 

ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఆక్సిజన్‌ ఓఎస్‌ 12తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. 120 హెర్జ్ రిఫ్రెష్‌రేట్‌తో 6.7 అంగుళాల క్యూహెచ్‌డీ+ అమోలెడ్‌ ఎల్‌టీపీఓ డిస్‌ప్లే ఇస్తున్నారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌ ఉంది. స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్-1 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు.

వన్‌ప్లస్‌లో సెకండ్ జనరేషన్ హ్యాసల్‌బ్లేడ్ లెన్స్‌ ఉపయోగించారు. ఇందులో మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. వెనుక మూడు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. వెనుకవైపు 48 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 50 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్, 8 ఎంపీ టెలీఫొటో కెమెరాలున్నాయి. వీడియోకాలింగ్‌, సెల్ఫీల కోసం ముందు భాగంలో 32 ఎంపీ కెమెరా అమర్చారు. ప్రొఫెషనల్‌ తరహా వీడియో రికార్డింగ్ కోసం ఈ కెమెరాల్లో ప్రత్యేకంగా మూవీ మోడ్ అనే ఫీచర్‌ ఇస్తున్నారు. దీంతో 4K క్వాలిటీ వీడియోలు రికార్డ్ చేయొచ్చు. 

ఇందులో 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ సూపర్‌ వూక్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కేవలం 15 నిమిషాల్లో 70 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుందని వన్‌ప్లస్‌ చెబుతోంది. రెండు వేరియంట్లలో వన్‌ప్లస్‌ 10ప్రో 5జీ మొబైల్‌ లభిస్తుంది. 8 జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజీ ధర ₹66,999. 12 జీబీ/256 జీబీ ధర ₹71,999. ఏప్రిల్‌ 5 తేదీ నుంచి అమ్మకాలు ప్రారంభంకానున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు