OnePlus: 5 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్‌.. కొత్త టెక్నాలజీతో వన్‌ప్లస్‌ నుంచి మరో కొత్త ఫోన్‌!

చైనా దిగ్గజం వన్‌ప్లస్‌ సరికొత్త ఛార్జింగ్‌ టెక్నాలజీతో మరో కొత్త ఫోన్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది.

Updated : 11 May 2022 18:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనా దిగ్గజం వన్‌ప్లస్‌ సరికొత్త ఛార్జింగ్‌ టెక్నాలజీతో మరో కొత్త ఫోన్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. వన్‌ప్లస్‌ ఏస్‌ (OnePlus Ace) మోడల్‌తో మిడ్‌ రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో విడుదల చేయనుండగా.. అదే ఫోన్‌ను వన్‌ప్లస్‌ 10ఆర్‌ (OnePlus 10R) పేరుతో భారత్‌లో ఆవిష్కరించనుంది.  ఏప్రిల్‌ 28న జరిగే ఈవెంట్‌లో ఈ ఫోన్లను విడుదల చేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. మరి ఈ ఫోన్‌ ప్రత్యేకతలేంటో ఓసారి లుక్కేద్దామా..


స్పెసిఫికేషన్లు (అంచనా)..

వన్‌ప్లస్‌ 10ఆర్‌ (OnePlus 10R) 5జీ మొబైల్‌ 120Hz రిఫ్రెష్‌రేట్‌తో 6.7 అంగుళాల అమోల్డ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్‌ 12 ఆధారితంగా ఈ ఫోన్‌ పనిచేస్తుంది. మీడియాటెక్ డైమోన్సిటీ 8100 ప్రాసెసర్‌ను వాడారు. 150 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పనిచేస్తుంది. దీంతో 5 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్‌ చేయొచ్చు. 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం ఉంది. ఫోన్‌ వెనుకభాగంలో 50ఎంపీ+8ఎంపీ అల్ట్రావైడ్‌ సెన్సార్‌+2ఎంపీ మ్యాక్రో షూటర్‌ కెమెరాలను అమర్చారు. ముందుభాగంలో సెల్ఫీల కోసం 16ఎంపీ కెమెరాను ఇస్తున్నారు. ఈ ఫోన్‌ మూడు వేరియంట్లలో లభించనుంది. 8జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.31,900గా, 12జీబీ+256జీబీ వేరియంట్‌ ధర రూ.35,400గా, 12జీబీ+512జీబీ వేరియంట్‌ ధర రూ.41,400 ఉంటుందని అంచనా. ఈ ఫోన్‌కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు