OnePlus: వన్‌ప్లస్ కొత్త స్మార్ట్‌వాచ్‌.. ఆ సిరీస్‌లో ఇదే తొలి మోడల్!

వన్‌ప్లస్ కంపెనీ నార్డ్‌ సిరీస్‌లో కొత్త స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ వాచ్‌ ఫీచర్లు, ధర వివరాలివే...

Published : 27 Sep 2022 01:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వన్‌ప్లస్ (OnePlus) బ్రాండ్‌లో నార్డ్ సిరీస్‌ ఎంతో ప్రత్యేకం. అప్పటి వరకు వన్‌ప్లస్‌ అంటే ఫ్లాగ్‌షిప్‌ ఫోన్‌.. ఖరీదెక్కువ అనే భావన ఉండేది. నార్డ్ సిరీస్‌ ఎంట్రీతో మిడ్‌-రేంజ్‌ ధరలో వన్‌ప్లస్‌ ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. తాజాగా వన్‌ప్లస్ ఇదే సిరీస్‌లో కొత్త స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేయనుంది. వన్‌ప్లస్ నార్డ్‌ వాచ్‌ (OnePlus Nord Watch) పేరుతో తీసుకొస్తున్న ఈ స్మార్ట్‌వాచ్‌ను సెప్టెంబరు 28న భారత మార్కెట్లోకి తీసుకురానుంది. మరి, ఈ వాచ్‌ పీచర్లపై ఓ లుక్కేద్దామా..

వన్‌ప్లస్ నార్డ్ వాచ్‌లో 60 హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 1.78 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఇందులో వందకు పైగా వాచ్‌ ఫేస్‌లు, యోగా, క్రికెట్‌ సహా 105 రకాల స్పోర్ట్స్‌, ఫిట్‌నెస్‌ మోడ్స్‌ ఉన్నాయి. వాచ్‌ డయల్‌ను చతురస్రాకారంలో డిజైన్‌ చేశారు. సింగిల్ నావిగేషన్‌ బటన్‌ ఉంది. హార్ట్‌రేట్ మానిటరింగ్‌, ఎస్‌పీఓ2 ట్రాకింగ్‌, స్టెప్‌ మానిటరింగ్‌ ఫీచర్స్‌ ఉన్నాయి. ఈ వాచ్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 10 రోజుల పాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లను సపోర్ట్ చేస్తుంది. ఇప్పటికే వన్‌ప్లస్ ప్రీమియం రేంజ్‌లో స్మార్ట్‌వాచ్‌ను విక్రయిస్తోంది. కొత్తగా తీసుకొచ్చే స్మార్ట్‌వాచ్‌తో వన్‌ప్లస్‌ బుల్లెట్ వైర్‌లైస్‌ ఇయర్‌బడ్స్‌ తరహాలో కంపెనీ వేరబుల్స్‌ మార్కెట్‌ పరిధిని విస్తరించుకోవాలని వన్‌ప్లస్ భావిస్తోంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ స్మార్ట్‌వాచ్‌ ధర ₹ 5,000లోపు ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా. 

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని