OnePlus Buds: సింగిల్‌ ఛార్జ్‌తో 38 గంటల బ్యాకప్‌.. వన్‌ప్లస్ కొత్త ఇయర్‌బడ్స్‌ ధర, ఫీచర్లివే! 

వన్‌ప్లస్ కంపెనీ టీడబ్ల్యూఎస్‌ శ్రేణితో కొత్త ఇయర్‌బడ్స్‌ను అంతర్జాతీయ మార్కెట్లోవి విడుదల చేసింది. మరి వీటి ధర, ఫీచర్ల వివరాలివే. 

Published : 17 Dec 2021 17:45 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వన్‌ప్లస్ కంపెనీ కొత్త ఇయర్‌బడ్స్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. వన్‌ప్లస్‌ బడ్స్‌ జెడ్‌2 పేరుతో వీటిని పరిచయం చేసింది. కంపెనీ ట్రూ వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్ (టీడబ్లూఎస్‌) శ్రేణిలో ఇది మూడో మోడల్‌. గతంలో విడుదల చేసిన వన్‌ప్లస్ బడ్స్‌ జెడ్ మోడల్‌కు కొనసాగింపుగా కంపెనీ జెడ్‌2ను తీసుకొచ్చింది. డిజైన్‌ పరంగా ఇందులో పెద్ద మార్పులు చేయనప్పటికీ, యూజర్‌కు మెరుగైన సౌండ్‌ అనుభూతిని అందించేందుకు బడ్స్‌ జెడ్‌2లో సరికొత్త ఫీచర్స్‌ను పరిచయం చేసినట్లు వన్‌ప్లస్ తెలిపింది. మరి ఈ కొత్త టీడబ్ల్యూఎస్‌లో ఎలాంటి ఫీచ్లర్లున్నాయి? వీటి ధరెంత అనేది ఒక్కసారి చూద్దాం. 

వన్‌ప్లస్‌ బడ్స్‌ జెడ్‌2 ఫీచర్లివే

వీటిలో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్‌ ఫీచర్‌ ఇస్తున్నారు. అంతేకాకుండా ఈ బడ్స్‌ 40 డెసిబుల్స్ వరకు నాయిస్‌ క్యాన్సిలేషన్‌ను ఇస్తాయి. దీనివల్ల యూజర్‌ మ్యూజిక్‌ వినేప్పుడు, కాల్స్‌ మాట్లాడేప్పుడు కచ్చితమైన సౌండ్‌ను వినగలుగుతారని వన్‌ప్లస్‌ చెబుతోంది. ఇందులో హెవీ బాస్‌ కోసం 11ఎమ్‌ఎమ్‌ డ్రైవర్స్ ఉపయోగించారు. అలానే మెరుగైన కాలింగ్ అనుభూతి కోసం బడ్స్‌ జెడ్‌2లో మూడు మైక్‌లు ఇస్తున్నారు. ఇయర్‌బడ్స్‌లో 40 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. ఛార్జింగ్‌ కేస్‌లో 520 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. వీటిని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 38 గంటలపాటు నిరంతరాయంగా పనిచేస్తాయి. అలానే ఇయర్‌బడ్స్‌ను 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే 5 గంటలపాటు పనిచేసేందుకు అవసరమయ్యే ఛార్జింగ్‌ అందుతుందని వన్‌ప్లస్‌ చెబుతోంది. నీటిలో తడిచినా పాడవకుండా ఉండేందుకు ఐపీ55 ప్రొటెక్షన్ ఉంది. 

ప్రస్తుతం ఈ ఇయర్‌బడ్స్‌ అంతర్జాతీయ మార్కెట్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు సమాచారం. అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధర 99 డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 7,500. అయితే భాతర్‌లో విడుదలయ్యేనాటికి వీటి ధర మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్‌వర్గాలు చెబుతున్నాయి. 

Read latest Tech & Gadgets News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు