OnePlus: ‘నార్డ్‌ 2’ విడుదల అప్పుడేనా..!

జులై మధ్యలో వన్‌ప్లస్‌ నార్డ్‌ సిరీస్‌ నుంచి కొత్త ఫోన్‌ రాబోతోంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లకు సంబంధించి గత కొన్ని వారాలుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వన్‌ప్లస్‌ నార్డ్‌ 2 ధర దాదాపు రూ.25 వేల నుంచి రూ.30 వేల మధ్య ఉండవచ్చంటున్నారు. అయితే వీటిపై వన్‌ప్లస్‌ అధికారికంగా ప్రకటించలేదు. మరి ఆ ఫోన్‌లోని ఫీచర్లేంటో తెలుసుకుందామా.. 

Updated : 08 Jul 2021 10:33 IST

మీడియా టెక్‌ చిప్‌సెట్‌తో.. 5జీ సపోర్ట్‌తో!

ఇంటర్నెట్‌ డెస్క్: జులై మధ్యలో వన్‌ప్లస్‌ నార్డ్‌ సిరీస్‌ నుంచి కొత్త ఫోన్‌ రాబోతోంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ 2 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లకు సంబంధించి గత కొన్ని వారాలుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వన్‌ప్లస్‌ నార్డ్‌ 2 ధర దాదాపు రూ.25 వేల నుంచి రూ.30 వేల మధ్య ఉండవచ్చంటున్నారు. అయితే వీటిపై వన్‌ప్లస్‌ అధికారికంగా ప్రకటించలేదు. మరి ఆ ఫోన్‌లోని ఫీచర్లేంటో తెలుసుకుందామా.. 

మీడియాటెక్‌ చిప్‌సెట్‌తో తొలిఫోన్‌

వన్‌ప్లస్‌ నార్డ్‌ 2 స్మార్ట్‌ఫోన్‌కు ఓ ప్రత్యేకత ఉంది. మీడియాటెక్  చిప్‌సెట్‌ టెక్నాలజీతో వన్‌ప్లస్‌ నుంచి రాబోతున్న తొలి స్మార్ట్‌ఫోన్‌ వన్‌ప్లస్‌ నార్డ్ 2 కావడం విశేషం. ఇప్పటి వరకు వచ్చిన అన్ని ఫోన్లలో క్వాల్‌కోమ్‌ ప్రాసెసర్‌ను వన్‌ప్లస్‌ వినియోగించేది. వన్‌ప్లస్‌ నార్డ్‌ 2 మీడియాటెక్‌ డైమెన్సిటీ 1200 చిప్‌సెట్‌ 5G సపోర్ట్‌తో రానుందని టెక్‌ వర్గాలు పేర్కొన్నాయి.

ఆ ఫోన్‌లానే డిజైన్‌ 

వన్‌ప్లస్‌ నార్డ్‌ 2 అలర్ట్‌ స్లైడర్‌తో రానుంది. ఇంతకుముందు నార్డ్‌ CE 5G ఫోన్‌ అలర్ట్‌ స్లైడర్‌ లేకుండా లాంచ్‌ అయింది. అయితే వినియోగదారుల అభిప్రాయం మేరకు ఇప్పుడు మళ్లీ అలర్ట్ స్లైడర్‌తో వన్‌ప్లస్‌ నార్డ్‌ 2 రానుంది. డిజైన్‌ పరంగా వన్‌ప్లస్‌ 9 స్మార్ట్‌ఫోన్‌లాగే ఉండవచ్చని అంచనా. టెక్‌ వర్గాల ప్రకారం.. వన్‌ప్లస్‌ 9 ఫోన్‌లోని రేర్‌ కెమెరా మాడ్యూల్‌, కార్నర్‌ హోల్‌ పంచ్‌ సెల్ఫీ కెమెరాను నార్డ్‌2లోనూ వినియోగించినట్లు తెలుస్తోంది. వన్‌ప్లస్‌ నార్డ్‌ ట్రిపుల్‌ రేర్‌ కెమెరాలతో రానుంది. 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 8 ఎంపీ వైడ్‌యాంగిల్‌ లెన్స్, 2 ఎంపీ సెన్సార్‌.. అలానే డూయల్‌ సెల్ఫీ కెమెరాల బదులు 32 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా ఒకటే వస్తుందని టెక్‌వర్గాలు వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని