OnePlus Nord 2T 5G: వన్‌ ప్లస్‌ నుంచి కొత్త 5జీ ఫోన్‌.. ఆ తేదీల్లో కొనుగోళ్లపై ఆఫర్స్‌!

OnePlus Nord 2T 5G: నార్డ్‌ సిరీస్‌లో వన్‌ప్లస్‌ Nord 2T 5G పేరిట కొత్త ఫోన్‌ను వన్‌ప్లస్‌ తీసుకొచ్చింది.

Published : 01 Jul 2022 14:17 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒకప్పుడు ప్రీమియం ఫోన్లకు మాత్రమే పరిమితమైన వన్‌ప్లస్‌ (OnePlus) ఈ మధ్య దూకుడు పెంచింది. ఏడాదికో, ఆర్నెళ్లకో ఓ ఫోన్‌ చొప్పున రిలీజ్‌ చేసే ఆ కంపెనీ ఈ మధ్య నెలల వ్యవధిలోనే కొత్త ఫోన్లను తీసుకొస్తోంది. తాజాగా నార్డ్‌ సిరీస్‌లో వన్‌ప్లస్‌ Nord 2T 5G పేరిట కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. గతేడాది తీసుకొచ్చిన Nord 2 5Gకి ఇది అప్‌గ్రేడ్‌ వెర్షన్‌ అనుకోవచ్చు. మరి ఈ ఫోన్‌ ధర, ప్రత్యేకతలు, ఆఫర్ల వివరాల గురించి చూద్దాం..


 

వన్‌ప్లస్‌ Nord 2T 5G రెండు వేరియంట్లలో లభిస్తుంది. 8జీబీ+128జీబీ వేరియంట్‌ ధర రూ.28,999గా కంపెనీ నిర్ణయించింది. 12జీబీ+ 256 జీబీ వేరియంట్‌ ధర రూ.33,999గా పేర్కొన్నారు. జులై 5 నుంచి ఈ ఫోన్‌ అమ్మకాలు మొదలవుతాయి. అమెజాన్‌, వన్‌ప్లస్‌.ఇన్‌, వన్‌ప్లస్‌ స్టోర్‌ యాప్‌, వన్‌ప్లస్‌ ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్లతో పాటు రిటైల్‌ ఔట్‌లెట్లలో ఈ ఫోన్‌ లభ్యం కానుంది. లాంచింగ్‌ ఆఫర్‌ కింద ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌/డెబిట్‌ కార్డుతో కొనుగోళ్లపై రూ.1500 ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ అందిస్తున్నారు. అమెజాన్‌, వన్‌ప్లస్‌.ఇన్‌, వన్‌ప్లస్‌ స్టోర్‌ యాప్‌, వన్‌ప్లస్‌ ఎక్స్‌పీరియన్స్‌ స్టోర్లు, ఆఫ్‌లైన్‌ స్టోర్లలోనూ ఈ తగ్గింపు వర్తిస్తుంది. అయితే జులై 5-11 మధ్య మాత్రమే డిస్కౌంట్‌ లభిస్తుంది. వన్‌ప్లస్‌.ఇన్‌ వెబ్‌సైట్‌, వన్‌ప్లస్‌ స్టోర్‌ యాప్‌లో జులై 14 వరకు ఎక్స్ఛేంజీపై రూ.3వేల వరకు అదనపు డిస్కౌంట్‌ లభిస్తుంది.

ఫీచర్లివే..
వన్‌ప్లస్‌ Nord 2T 5G ఆండ్రాయిడ్‌ 12తో కూడిన ఆక్సిజన్‌ ఓఎస్‌ 12.1తో వస్తోంది. 6.43 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్‌, 90Hz రీఫ్రెష్‌ రేటుతో కూడిన అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు.  కార్నింగ్‌ గొరిల్లా 5 ప్రొటెక్షన్‌ ఉంది. మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 1300 ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్‌లో వెనుక వైపు 50 మెగాపిక్సల్‌ సోనీ IMX766 సెన్సర్‌ను అమర్చారు. ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ ఉంది. దీంతోపాటు 8 ఎంపీ అల్ట్రావైడ్‌, 2 మెగాపిక్సల్‌ మోనో క్రోమ్‌ సెన్సర్‌ ఇస్తున్నారు. ముందువైపు 32 ఎంపీ సోనీ IMX615 సెన్సర్‌ అమర్చారు. యూఎస్‌బీ టైప్‌-సి పోర్ట్‌ ఇస్తున్నారు. ఎన్‌ఎఫ్‌సీ సపోర్ట్‌ కూడా ఉంది. 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌లో 80W సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌ ఇస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని