OnePlus Nord CE 2 Lite: అతి తక్కువ ధరలో వన్‌ప్లస్‌ నుంచి మరో కొత్త ఫోన్‌!

చైనీస్‌ టెక్‌ దిగ్గజం వన్‌ ప్లస్‌ (OnePlus) నుంచి మరో కొత్త మోడల్‌ విడుదలకు సిద్ధమైంది.

Updated : 11 May 2022 18:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  చైనీస్‌ టెక్‌ దిగ్గజం వన్‌ ప్లస్‌ (OnePlus) నుంచి మరో కొత్త మోడల్‌ విడుదలకు సిద్ధమైంది. ఈ మేరకు విడుదల తేదీని కంపెనీ ప్రకటించింది. ఏప్రిల్ 28న జరగబోయే ‘మోర్ పవర్ టు యూ’ ఈవెంట్‌లో వన్ ప్లస్ నార్డ్ సీఈ 2 Lite 5G మోడల్స్‌ను ఆవిష్కరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. మరి ఈ ఫోన్‌ ప్రత్యేకతలు? ధరలేంటో చూద్దాం..

స్పెసిఫికేషన్లు ఇవే (అంచనా)..

వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 Lite 5G మొబైల్ 5000 mAh బ్యాటరీతో పాటు 33W సూపర్ వూక్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో అందుబాటులోకి రానున్నట్లు అంచనా. ఇది బ్యాటరీని 0 నుంచి 50 శాతం వరకు కేవలం 30 నిమిషాల్లో ఛార్జ్ చేయగలదని తెలుస్తోంది. ఇందులో క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్ 65 5జీ చిప్‌సెట్‌ను వాడారు. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేను ఇస్తున్నారు. కెమెరా విషయానికోస్తే.. దీని ముందు భాగంలో సెల్ఫీల కోసం 16ఎంపీ హై రిజల్యూషన్‌ ప్రైమరీ కెమెరా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. వెనుకభాగంలో  64ఎంపీ ఓమినీ విజన్‌, 2ఎంపీ మాక్రో లెన్స్‌, 2ఎంపీ మోనో లెన్స్‌ను ఇవ్వనున్నారు. ఇందులో 8 జీబీ ర్యామ్​, 128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీ సామర్థ్యం ఉన్న ఫోన్లను విడుదల చేయనున్నట్లు సమాచారం.

ధరలివే..!(అంచనా)..

వన్​ప్లస్​ నార్డ్​ సీఈ 2 సిరీస్‌ కంటే సీఈ 2 Lite మోడల్‌ ధర తక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో నార్డ్‌ సీఈ 2 ప్రారంభ ధర రూ.23, 999గా ఉండేది. దీని కంటే తక్కువగా సుమారు రూ.20,000 లోపే వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 2 లైట్‌ ఉండనున్నట్లు సమాచారం. భారత్‌లో సీఈ 2 లైట్‌ ప్రారంభ ధర రూ.19,999గా ఉంటుందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని