OnePlus: నార్డ్‌ సిరీస్‌లో మరో 5G ఫోన్‌

వన్‌ప్లస్‌ నుంచి మరో కొత్త ఫోన్‌ మార్కెట్‌లోకి విడుదలైంది. గతేడాది విడుదల చేసిన నార్డ్‌ సిరీస్‌కు కొనసాగింపుగా వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 5G ఫోన్‌ను భారత్‌లో విడుద.....

Updated : 11 Jun 2021 16:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వన్‌ప్లస్‌ నుంచి మరో కొత్త ఫోన్‌ మార్కెట్‌లోకి విడుదలైంది. గతేడాది విడుదల చేసిన నార్డ్‌ సిరీస్‌కు కొనసాగింపుగా వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 5G ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. నేటి నుంచి (జూన్‌ 11) ప్రీబుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. అమెజాన్‌, వన్‌ప్లస్‌ వెబ్‌సైట్ల ద్వారా జూన్‌ 16 నుంచి కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 5G మూడు వేరియంట్లలో లభించనుంది. 6జీబీ/ 128జీబీ వేరియంట్‌ ధరను రూ.22,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ/ 128జీబీ వేరియంట్‌ ధరను రూ.24,999గానూ, 12జీబీ/ 256జీబీ వేరియంట్‌ ధరను రూ.27,999గానూ కంపెనీ పేర్కొంది. హెడ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుతో కొనుగోళ్లపై వెయ్యి రూపాయలు డిస్కౌంట్‌ లభిస్తుంది. అలాగే, వన్‌ప్లస్‌ బడ్స్‌ జడ్‌, వన్‌ప్లస్‌ బ్యాండ్‌ కొనుగోళ్లపై రూ.500 వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది.

ఇక స్పెసిఫికేషన్స్‌ విషయానికొస్తే కొత్త నార్డ్‌ CE 5G ఆండ్రాయిడ్‌ 11 ఆక్సిజన్‌ ఓఎస్‌ 11తో పనిచేస్తుంది. 6.43 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ ప్లస్‌ అమోలెడ్‌ డిస్‌ఫ్లేతో వస్తోంది. 90Hz రీఫ్రెష్‌ రేటుతో పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్‌ 750జీ ప్రాసెసర్‌ను అమర్చారు. వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ ఉంది. 64 మెగాపిక్సల్‌ ప్రధాన కెమెరాతో పాటు 8ఎంపీ సెకండరీ కెమెరా, 2ఎంపీ మోనోక్రోమ్‌ సెన్సర్‌ వినియోగించారు. సెల్ఫీల కోసం ముందువైపు 16 ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌471 కెమెరాను వాడారు. 5జీ నెట్‌వర్క్‌కు ఈ ఫోన్‌ సపోర్ట్‌ చేస్తుంది. టైప్‌-సి పోర్ట్‌తో పాటు 3.5ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌ను కూడా అందిస్తున్నారు. 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌ వ్రాప్‌ ఛార్జ్‌ 30టీ ప్లస్‌ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ టెక్నాలజీ ద్వారా 70 శాతం ఫోన్‌ను కేవలం అరగంటలో పూర్తి చేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని