QRCode: క్యూఆర్‌ కోడ్‌ జనరేట్‌ చేయాలా..? వీటితో చాలా ఈజీ

క్యూఆర్‌ కోడ్‌ జనరేట్‌ చేయాలనుకుంటున్నారా..? అయితే, ఈ వెబ్‌సైట్‌ల ద్వారా అత్యంత సులువుగా..

Published : 19 Feb 2022 12:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ప్రస్తుతం ఎక్కడ చూసినా క్యూఆర్‌ కోడ్‌ (QRCode) దర్శనమిస్తోంది. బిజినెస్‌ కార్డులు, ప్రకటనలు, డిజిటల్‌ చెల్లింపులు, ఉత్పత్తులు, పాఠ్యపుస్తకాలు.. ఇలా ప్రతిచోటా అదే. బార్‌కోడ్‌ల మాదిరిగానే ఇదీ కనిపిస్తున్నప్పటికీ మెషీన్‌-రీడబుల్‌తో యూఆర్‌ఎల్‌ వంటి తదితర పూర్తి సమాచారం ఇందులో నిల్వ ఉంటుంది. మీరు కూడా ఏదైనా కారణంతో క్యూఆర్‌ కోడ్‌ జనరేట్‌ చేయాలనుకుంటున్నారా..? అయితే, ఈ వెబ్‌సైట్‌ల ద్వారా అత్యంత సులువుగా క్యూఆర్‌ కోడ్‌లను తయారు చేసుకోవచ్చు.


క్యూఆర్‌ కోడ్ మంకీ

‘క్యూఆర్‌ కోడ్ మంకీ (QRCode Monkey)’ వైబ్‌సైట్‌ ద్వారా పలు రకాల క్యూఆర్‌ కోడ్‌లను పూర్తి ఉచితంగా జనరేట్‌ చేసుకోవచ్చు. ఇది యూఆర్‌ఎల్‌, ఇమెయిల్‌, టెక్స్ట్‌, వైఫై, డిజిటల్‌ కరెన్సీ చెల్లింపుల వంటి వాటి కోసం స్టాటిక్‌ క్యూఆర్‌ కోడ్‌లను సృష్టించగలదు. ఇందుకోసం మీరు తొలుత కంటెంట్‌ను ఎంటర్‌ చేసి కోడ్‌ ఏ రంగులో ఉంచాలనుకుంటున్నారో సెలెక్ట్‌ చేసుకోవాలి. ఆపై లోగో, డిజైన్‌ ఎంచుకొని క్యూఆర్‌ కోడ్‌ కోసం క్లిక్‌ చేయగానే సెకన్లలో జనరేట్‌ చేస్తుంది. దీనిని మీకు కావాల్సిన ఫార్మాట్లలో డౌన్‌ చేసుకోవచ్చు.


క్యూఆర్‌ కోడ్ జనరేటర్‌

వివిధ రకాల క్యూఆర్‌ కోడ్‌లను మీకు నచ్చిన‌ రంగు, ఫ్రేమ్‌, ఆకృతిలో ‘క్యూఆర్‌ కోడ్ జనరేటర్ (QR Code Generator)’ తయారు చేయగలదు. పైగా ల్యాండింగ్ పేజీలను కూడా సృష్టించగలదు. ప్రీమియం వెర్షన్‌ 14 రోజుల ఉచిత ట్రయల్‌తోపాటు వివిధ రకాల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లతో అందుబాటులో ఉంది. మరోవైపు ఇది ఒక డైనమిక్, ఐదు స్టాటిక్ క్యూఆర్‌ కోడ్‌లతో ఉచిత ప్లాన్‌ను అందిస్తోంది. 


క్యూఆర్‌ స్టఫ్‌

పేపాల్, జూమ్‌ మీటింగ్‌, డ్రాప్‌బాక్స్‌తో పాటు 25కు పైగా క్యూఆర్‌ కోడ్‌లను QRStuff.com వైబ్‌సైట్ ద్వారా ఈజీగా జనరేట్‌ చేసుకోవచ్చు. తొలుత డేటా రకాన్ని ఎంచుకోవడం, సమాచారాన్ని నమోదు చేయడం, స్టైల్‌ను సెలెక్ట్‌ చేసుకోవడం వంటి మూడు దశల్లో ఇది క్యూఆర్‌ కోడ్‌ సృష్టిస్తుంది. ప్రీమియం వెర్షన్‌ డైనమిక్ కోడ్‌లు, బల్క్ జనరేషన్, అనలిటిక్స్, వెక్టార్ ఫార్మాట్‌లకు సపోర్ట్‌ చేస్తుంది.


మరిన్ని

అత్యంత ఆదరణ కలిగిన Wix క్యూఆర్‌ కోడ్‌ జనరేటర్ వైబ్‌సైట్‌లో.. జనరేట్‌ చేసిన కోడ్‌లను సీవీజీ, పీఎన్‌జీ, జేపీజీ ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది స్కాన్ పరిమితి ముగింపు లేకుండా స్టాటిక్ కోడ్‌లకు మాత్రమే సపోర్ట్‌ చేస్తుంది. వీటితో పాటే goQR.me వైబ్‌సైట్‌ తొమ్మిది, LogoDesign.net ఆరు రకాల ప్రాథమిక స్టాటిక్ క్యూఆర్‌ కోడ్‌లను ఉచితంగా సృష్టించడానికి అనుమతిస్తుంది. పైగా వీటికి ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు.

అయితే, క్యూఆర్‌ కోడ్‌ జనరేట్‌ చేయడానికి పై వెబ్‌సైట్లు చాలా వరకు ఉచిత ప్లాన్‌లు అందిస్తున్నప్పటికీ.. ప్రీమియం వెర్షన్‌లో నచ్చిన విధంగా వివిధ రకాల, రంగుల్లో డైనమిక్‌ కోడ్‌లను క్రియేట్‌ చేసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని