Oppo Reno 7 5G: ఒప్పో నుంచి రెనో సిరీస్‌లో కొత్త 5జీ ఫోన్లు

ఒప్పో కంపెనీ రెనో 7 సిరీస్‌లో రెండు కొత్త 5జీ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ల ఫీచర్లు, ధర, అమ్మకాలకు సంబంధించిన వివరాలపై ఓ లుక్కేద్దాం.

Published : 04 Feb 2022 23:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒప్పో కంపెనీ రెనో సిరీస్‌లో రెండు కొత్త 5జీ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఒప్పో రెనో 7 5జీ (Oppo Reno 7 5G), ఒప్పో రెనో 7 ప్రో 5జీ (Oppo Reno 7 Pro 5G) పేరుతో వీటిని తీసుకొచ్చింది. మిండ్‌-రేంజ్‌ శ్రేణిలో తీసుకొచ్చిన ఈ ఫోన్లలో ఎలాంటి పీచర్లున్నాయి.. వీటి ధరెంత? ఎప్పటి నుంచి అమ్మకాలు ప్రారంభంకానున్నాయనేది తెలుసుకుందాం.


ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్‌ ఓఎస్‌ 12 ఓఎస్‌తో పనిచేస్తాయి. రెనో 7 5జీలో మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.4 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. రెనో 7 ప్రో 5జీలో మీడియాటెక్ డైమెన్సిటీ 1200 మాక్స్‌ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ అమోలెడ్‌ డిస్‌ప్లేను అమర్చారు. 


వీటిలో నాలుగు కెమెరాలున్నాయి. వెనుక మూడు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. రెండు ఫోన్లలో 32 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. వెనుకవైపు రెనో 7 5జీలో 64 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 8 ఎంపీ వైడ్‌ యాంగిల్‌, 2 ఎంపీ కెమెరాలు ఉన్నాయి. రెనో 7 ప్రో 5జీలో 50 ఎంపీ ప్రైమరీ, 8 ఎంపీ అల్ట్రా-వైడ్‌ యాంగిల్, 2 ఎంపీ కెమెరాలు ఇస్తున్నారు. వీటితోపాటు ఈ ఫోన్ కెమెరాలలో కలర్‌ టెంపరేచర్‌ సెన్సర్లను అమర్చారు.


రెండు ఫోన్లలో 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 65 వాట్‌ సూపర్‌వోక్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. రెనో 7 5జీ 8 జీబీ ర్యామ్‌/256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌లో లభిస్తుంది. దీని ధర రూ.28,999. ఫిబ్రవరి 17 నుంచి అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. రెనో 7 ప్రో 5జ3 12 జీబీ/256 జీబీ వేరియంట్‌ ధర రూ.39,999. ఫిబ్రవరి 8 నుంచి కొనుగోలు చేయొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని