కాగితపు పక్షితో...

చిన్నప్పుడు పుస్తకంలో కాగితం చింపి పక్షి బొమ్మ చేసి ఆడుకున్న....

Updated : 08 Dec 2022 20:25 IST

కాగితపు పక్షితో...

చిన్నప్పుడు పుస్తకంలో కాగితం చింపి పక్షి బొమ్మ చేసి ఆడుకున్న రోజులూ గుర్తున్నాయా? ఆ రోజుల్ని మళ్లీ జ్ఞప్తికి తెచ్చేలా ప్లే స్టోర్‌లో ఓ ఆప్‌ ఉంది. అదే Paper Wings. దీన్ని మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకొని ఓపెన్‌ చేస్తే... మీ కోసం ఓ కాగితపు పక్షి సిద్ధంగా ఉంటుంది. దానికి ఎగరడమైతే తెలుసు కానీ, అటు, ఇటు కదలడం రాదు. ఈ విషయంలో మీరు దానికి సాయం చేస్తే... అది మీకు కావల్సినంత వినోదాన్ని అందిస్తుంది. పై నుంచి కిందకు పడుతున్న బంగారు నాణాలను పక్షిని గాల్లో ఎగిరిస్తూ పట్టుకోవాలి. ఇందులో 25 రకాల పక్షులున్నాయి. మీరు పట్టుకున్న బంగారు నాణాలతో వాటిని కొనుక్కోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం (https://goo.gl/WhPShq) ఈ లింక్‌లో గేమ్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి... ఆడేయండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని