
PUBG: మీమ్స్‌తో ఫ్యాన్స్ ‘చికెన్ డిన్నర్’
ఇంటర్నెట్ డెస్క్: పబ్‌జీ తిరిగి మన దేశానికి వచ్చేస్తోంది. ఇప్పుడు యువత నోట ఎక్కువగా వినిపిస్తున్న మాట ఇది. అంతగా ఆ ఆటకు అలవాటుపడిపోయారు మన కుర్రాళ్లు. ఈ గేమింగ్ యాప్‌పై నిషేధం విధించిన తర్వాత దానికి పోటీగా ఎన్ని గేమ్స్ వచ్చినా ‘పబ్‌జీ సార్.. పబ్‌జీ అంతే..’ అనుకుంటూ రోజూ గుర్తుకు తెచ్చుకున్నారు. అయితే తాజాగా పబ్‌జీని Battlegrounds Mobile India (BGMI) పేరుతో తీసుకొస్తున్నట్లు ఇటీవల సంస్థ ప్రకటించింది. దీంతో అభిమానులకు ‘చికెన్ డిన్నర్’ దొరికినంత ఆనందంగా ఉంది. వెరైటీ వెరైటీ మీమ్స్‌తో సోషల్ మీడియాను నింపేస్తున్నారు.
ఈలోపు ఒకటి రెండు మీమ్స్‌ను సరదాగా వివరిద్దాం అనుకుంటున్నాం. మొన్నీ మధ్య ఓ మ్యాచ్‌లో హార్ధిక్ పాండ్య తోటి ఆటగాడికి నమస్కారం పెట్టిన ఫొటోను ఇప్పుడు పబ్‌జీకి వాడుకుంటున్నారు. ‘బాహుబలి’లో రాజు మన మధ్యలోకి వస్తున్నాడు. పండగ చేసుకోండి అని గ్రామస్థుడు ఒకరు అంటారు ఆ సీన్‌ని కూడా పబ్‌జీ కోసమే వాడేశారు. ‘మాస్టర్’లో విజయ్ ట్రేడ్‌మార్క్ స్టెప్ ఫొటో కూడా పబ్‌జీ కోసం మీమ్ అయిపోయింది. ‘మున్నాభాయ్ ఎంబీబీఎస్’ సంజయ్ దత్ అందరినీ హత్తుకొని మనసారా మాట్లాడే సీన్ గుర్తుందా... మన దగ్గర చిరంజీవి చేశాడు.. ఆ పిక్ కూడా మీమ్ అయిపోయింది. అయితే మళ్లీ పబ్‌జీ ఎందుకొస్తుంది... మా దుంప తెంపడానికా అంటూ కొంతమంది బాధపడే మీమ్స్ కూడా ఇందులో కనిపిస్తున్నాయి. ఇవీ, ఇంకొన్ని మీరూ చూసేసి... నవ్వుకోండి మరి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.