Published : 12 Nov 2021 02:08 IST

Pubg: భారత్‌లో పబ్‌జీ వచ్చేసింది... సరికొత్తగా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారతీయ గేమర్స్‌కు శుభవార్త. నిషేధానికి గురైన పబ్‌జీ గేమ్‌ తిరిగి ‘పబ్‌జీ: న్యూ స్టేట్‌’ పేరుతో అందుబాటులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా నేడు విడుదలైన ఈ గేమ్‌ను 17 భాషల్లో డిజైన్‌ చేశారట. గూగుల్‌ ప్లేస్టోర్‌లో దీని సైజ్‌ దాదాపు 1.4జీబీ ఉండగా.. ఆండ్రాయిడ్‌ 6 ఆపై వర్షన్లలో మాత్రమే ఈ గేమ్‌ ఆడటానికి వీలున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆధునాతన ఆయుధాలు, వాహనాలతో పాటు.. ఎన్నో కొత్త ఫీచర్లను తీసుకొచ్చినట్లు పబ్‌జీ సృష్టికర్త క్రాఫ్టన్‌ సంస్థ చెబుతోంది.    

భారత్‌లో పబ్‌జీ గేమ్‌కు వచ్చిన పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కోట్ల మంది భారతీయులు ఈ గేమ్‌ను ఆడటానికి ఇష్టపడ్డారు. అయితే, చైనాతో వివాదం నేపథ్యంలో గతేడాది పబ్‌జీని భారత్‌లో నిషేధించిన విషయం తెలిసిందే. దీంతో కొన్నాళ్లపాటు భారత్‌లోని యువత ఆ ఆటకు దూరమైంది. అయితే, భారతీయ యూజర్లను వదులుకోవడం ఇష్టం లేని.. క్రాఫ్టన్‌ సంస్థ ‘బ్యాటిల్‌గ్రౌండ్‌ మొబైల్‌ ఇండియా(బీజీఎంఐ) పేరుతో ప్రత్యేకంగా దేశీయ గేమ్‌ను రూపొందించింది. ఇప్పుడు క్రాఫ్టన్‌.. పబ్‌జీలో మార్పులు చేస్తూ.. సరికొత్త ‘పబ్‌జీ: న్యూ స్టేట్‌’ గేమ్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. 

Read latest Gadgets & Technology News and Telugu News

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని