లెన్స్ వేయండి చాలు..
ఫోన్ కెమెరాతో ఏం చేస్తాం? ఏముందీ.. సెల్ఫీలు, ఫొటోలు తీస్తాం.. వీడియోలు చిత్రీకరిస్తాం! అంతేగా.. అంటారా? అదే గూగుల్ లెన్స్‌తో కెమెరాని వాడితే? ఏం చేయొచ్చు? అబ్భో. చాలానే చేయొచ్ఛు ఇప్పుడు కొత్తగా మరిన్ని అదనపు సౌకర్యాల్ని గూగుల్ ‘లెన్స్’కి జోడించింది. ఏంటవి? ఓ లుక్కేద్దామా?
వాడి చూద్దురూ!
ఫోన్ కెమెరాతో ఏం చేస్తాం? ఏముందీ.. సెల్ఫీలు, ఫొటోలు తీస్తాం.. వీడియోలు చిత్రీకరిస్తాం! అంతేగా.. అంటారా? అదే గూగుల్ లెన్స్‌తో కెమెరాని వాడితే? ఏం చేయొచ్చు? అబ్భో. చాలానే చేయొచ్ఛు ఇప్పుడు కొత్తగా మరిన్ని అదనపు సౌకర్యాల్ని గూగుల్ ‘లెన్స్’కి జోడించింది. ఏంటవి? ఓ లుక్కేద్దామా?
చదివి వినిపిస్తుంది
పొద్దునే వార్తా పత్రికో.. ఖాళీ సమయాల్లో నచ్చిన పుస్తకమో ముందేసుకుని చదువుతాం. కానీ, కొన్ని సార్లు చదివే సమయం దొరకదు. అలాంటప్పుడు పత్రికల్లో వ్యాసాల్నిగానీ.. పుస్తకంలోని పేజీల్ని గానీ చదివి వినిపిస్తే! గూగుల్ లెన్స్ ఈ పనిని క్షణాల్లో చేస్తుంది. అందుకు మీరు చేయాల్సిందల్లా వినాలనుకునే వ్యాసాన్ని లేదా పుస్తకంలో పేజీని స్కాన్ చేసి సెలెక్ట్ చేస్తే చాలు. తెరపై కనిపించే ‘లిజన్’ని నొక్కితే చాలు. చదివి వినిపిస్తుంది. ఉదాహరణకు తెలుగు పత్రికలో ఏదైనా వ్యాసాన్ని విందాం అనుకుంటే ఆ కాపీని స్కాన్ చేయండి. తెలుగుని స్పష్టంగా చదివి వినిపిస్తుంది. వ్యాసాన్ని కాపీ చేసి ఎవరితోనైనా పంచుకోవచ్ఛు.
వెంటనే అనువాదం
భాష అర్థం కాకుంటే అనువాదం తప్పని సరి. అందుకు గూగుల్ లెన్స్ సాయం తీసుకోవచ్ఛు ఆంగ్ల భాష సరిగా అర్థం చేసుకోలేనివారు లెన్స్‌ని వాడుకుని క్షణాల్లో అనువాదం చేసుకోవచ్ఛు అంతేకాదు.. ఏదైనా తెలుగు వ్యాసాన్ని ఆంగ్లంలోకీ అనువాదం చేయొచ్ఛు అనువదించిన వ్యాసాన్ని కాపీ చేసుకుని ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్ఛు.
‘డైనింగ్’లో ఊరించే వంటలు..
ఆకలి మంటతో హోటల్‌కి వెళ్లారు. వెయిటర్ రాగానే సంప్రదాయ పద్ధతిలో అయితే.. ‘మీ హోటల్లో స్పెషల్స్ ఏంటి? ఏవి బాగుంటాయ్? అని మాట కలిపేస్తారు. ఈ పనిని గూగుల్ లెన్స్‌తో స్మార్ట్‌గా చేయొచ్ఛు అందుకు తగినదే ‘డైనింగ్’. మెనూలోని వంటల్ని క్లిక్ మనిపించి వాటికి సంబంధించిన రివ్యూలు, రేటింగ్‌లు తెలుసుకోవచ్ఛు అప్పుడే ఆర్డర్ చేయొచ్ఛు.
ఫోన్ నుంచి పీసీకి..
గూగుల్ లెన్స్ యాప్ ఫోన్లోగా ఉండేది. అలాంటప్పుడు ఫోన్‌తో స్కాన్ చేసుకున్న నోట్స్‌ని సిస్టంలో కాపీ చేసుకోవాలంటే? అందుకేమైనా మార్గం ఉందా? అనే సందేహం రావడం సహజం. క్షణాల్లో చేయొచ్ఛు అందుకు మీరు చేయాల్సిందల్లా.. మీరు ఏ మెయిల్ ఎకౌంట్‌తో ఫోన్లో లాగిన్ అయ్యారో.. అదే జీమెయిల్ ఎకౌంట్‌తో సిస్టంలోని క్రోమ్ బ్రౌజర్‌లోనూ లాగిన్ అవ్వాలి. అప్పుడే ఫోన్లో కాపీ చేసిన టెక్స్ట్‌ని సిస్టంలో పేస్ట్ చేయొచ్ఛు అదెలాగంటే... లెన్స్‌తో ఏదైనా నోట్స్‌ని షూట్ చేస్తే తెరపై ఐదు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిల్లో ‘టెక్స్ట్’ ఐకాన్ని సెలెక్ట్ చేసి నోట్స్‌ని స్కాన్ చేయాలి. ‘సెలెక్ట్ ఆల్’ ఆప్షన్‌తో మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఆ వెంటనే అక్కడ కనిపించే ‘కాపీ టూ కంప్యూటర్’ ఆప్షన్ని సెలెక్ట్ చేస్తే చాలు. మీ సిస్టంలో ఎక్కడైనా పేస్ట్ చేయొచ్ఛు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. వాడుతున్న క్రోమ్ లేటెస్ట్ వెర్షన్ అయ్యుండాలి. అప్పుడే ‘కాపీ టూ కంప్యూటర్’ ఆప్షన్ని వాడుకోగలరు.
రాసుకున్న ‘నోట్స్’తో సహా..
క్లాస్ రూమ్‌లో విద్యార్థులు.. ఆఫీస్ సమావేశాల్లో ఉద్యోగులు.. పెన్ను, పుస్తకం చేతబట్టుకుని ఎప్పుడూ నోట్స్ రాసుకుంటూనే ఉంటారు. అలా రాసుకున్న సమాచారాన్ని ప్రాజెక్టు వర్క్‌ల నిమిత్తమో.. మరేవైనా ఇతర అవసరాలకు డిజిటల్‌గా మార్చుకోవాలంటే? కచ్చితంగా రాసిన నోట్స్‌ని సిస్టం లేదా ఫోన్లో టైప్ చేసి పెట్టుకోవాలి. ఇకపై అంత కష్టం అక్కర్లేదు. ఫోన్ అందుకుని గూగుల్ ‘లెన్స్’ యాప్‌ని ఓపెన్ చేయండి చాలు. ఫోన్ కెమెరా ఆన్ అవుతుంది. దాంతో రాసిన నోట్స్‌ని షూట్ చేస్తే చాలు. పేజీలోని నోట్స్‌ని స్కాన్ చేస్తుంది. ఇక మీరు హ్యాండ్ రైటింగ్‌ని కావాల్సిన మేర సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఫోన్లో ఎక్కడ కావాలన్నా పేస్ట్ చేసుకోవచ్ఛు దీంతో నోట్స్ మొత్తం టైప్ చేసిన డాక్యుమెంట్లా వచ్చేస్తుంది. ఇక మీరు టెక్స్ట్ ఎడిట్ చేసుకోవచ్ఛు ప్రింట్ తీసుకోవచ్ఛు.
కొత్తగా వెతుకులాట
నెట్టింట్లో ఏదైనా వెతకాలంటే ఏదైనా సెర్చ్ ఇంజన్ ఓపెన్ చేయాలి. కీవర్డ్లు టైప్ చేయాలి. అదే ఇంట్లో వాయిస్ అసిస్టెంట్ ఉంటే.. వాటితో మాట్లాడాలి.. కావాల్సిన అంశాన్ని చెప్పి వెతకమనాలి. ఇవేం అక్కర్లేకుండా.. ‘లెన్స్’కి చూపితే చాలు. అదే వెతికేస్తుంది. గూగుల్ సెర్చ్ రిజల్ట్‌లను అందిస్తుంది. ఉదాహరణకు మీరు ఎవరైనా ఇంటికి వెళ్లారు. అక్కడ గోడపై మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న ఓ పెయింటింగ్ ఉంది. అది ఎక్కడ దొరుకుతుంది? ఎవరు గీసారు?.. లాంటి వివరాల్ని తెలుసుకోవాలంటే.. లెన్స్ ఓపెన్ చేసి పెయింటింగ్‌ని షూట్ చేస్తే చాలు. అన్ని వివరాల్ని వెతికి తెచ్చేస్తుంది. ఇలా దేని గురించి అయినా క్షణాల్లో వెతికేయొచ్ఛు.
సరాసరి ‘షాపింగ్’
వెళ్లిన చోటల్లా ఏదో ఒకటి నచ్చుతుంది. ఉదాహరణకు ఫ్రెండు తగిలించుకున్న హ్యాండ్ బ్యాగో.. పెట్టుకున్న వాచ్.. ఇలా ఏదైనా కావచ్ఛు అదెక్కడ కొన్నారు? ఎంత?.. లాంటి వివరాల్ని అడిగి తెలుసుకోవడం మామూలే. తర్వాత వాటిని ఆన్లైన్ అంగళ్లలో జల్లెడ పడతాం. ఇదంతా పాత పద్ధతి. స్మార్ట్‌గా ఆలోచించేవారందరూ ‘లెన్స్’ ఓపెన్ చేసి ‘షాపింగ్’లోకి వెళ్తున్నారు. ఫోన్ కెమెరాతో నచ్చిన దాన్ని ఫొటో కొడితే చాలు. అలాంటివి నెట్టింట్లో ఏ మేరకు దొరుకుతున్నాయో గూగుల్ లెన్సే జల్లెడ పట్టేస్తుంది. సెర్చ్ ఫలితాలు అందిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త సర్ఫేస్ ల్యాప్‌టాప్‌లు
వాణిజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని మైక్రోసాఫ్ట్ సంస్థ ఏఐ ఆధారిత సర్ఫేస్ ప్రొ 10, సర్ఫేస్ ల్యాప్‌టాప్ 6 పరికరాలను పరిచయం చేసింది. ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్‌తో కూడిన ఇవి విండోస్ 11 ప్రొ మీద పనిచేస్తాయి. 5జీ కనెక్టివిటీ కూడా ఉంటుంది. -
జంతువుల రంగుల లోకాన్ని చూపించే కెమెరా
జంతువులు, పక్షులు, తేనెటీగలకు ఈ ప్రపంచం ఏ విధంగా కనిపిస్తుంది? మనం చూసే రంగులు వాటికీ కనిపిస్తాయా? చాలామందికి ఇలాంటి సందేహం వచ్చే ఉంటుంది. -
ఉంగరమే న్యూట్రిషనిస్ట్
సామ్సంగ్ ఇటీవల గెలాక్సీ రింగ్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇది రోజూ తినే ఆహారం విషయంలోనూ సూచనలు ఇవ్వగలదని చెబుతున్నారు. యూజర్ల శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) ఆధారంగా ఎన్ని కేలరీల శక్తినిచ్చే ఆహారం తినాలో సూచిస్తుంది. -
రియల్మీ నుంచి నార్జో 70 ప్రొ 5జీ ఫోన్లు
రియల్మీ సంస్థ నార్జో 70 ప్రొ 5జీ ఫోన్‌ను పరిచయం చేసింది. ఎయిర్ జెశ్చర్స్ శ్రేణిలో ఇదే తొలి ఫోనని కంపెనీ పేర్కొంటోంది. -
ఐఫోన్ కిటుకులు
ఐఫోన్లో ఎన్నో ఫీచర్లు. తెలియనివి ఎన్నెన్నో. తెలిసినా చప్పున గుర్తుకు రాకపోవచ్చు కూడా. కొత్తగా కొన్నవారైనా, తాజా వర్షన్‌కు అప్డేట్ చేసుకున్నవారైనా, చాలాకాలం నుంచి వాడుతున్నవారైనా.. వీటి గురించి తెలుసుకుంటే చిటికెలో పనులు పూర్తిచేసుకోవచ్చు. -
ఫొటో కటౌట్ చిటికెలో
ఫొటోలో వెనక దృశ్యాలను తొలగించి, కటౌట్ చేయటం పెద్ద పని. అడోబ్ ఫొటోషాప్, ఏఐ టూల్స్ వంటి అధునాతన సాధనాలు అవసరం. -
సెల్ సర్వీసు మొరాయిస్తే?
ఎప్పుడైనా సెల్‌ఫోన్ సర్వీసు సరిగా పనిచేయకపోతే ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టి, కాసేపు వేచి చూడాలి. తర్వాత ఫోన్‌ను యథాస్థితికి తేవాలి. దీంతో ఫోన్ సమీపంలోని సెల్ టవర్‌తో కనెక్ట్ అవుతుంది -
పాస్వర్డ్ మేనేజర్ భద్రమేనా?
భద్రత, బ్యాకప్ టూల్స్‌గా పాస్వర్డ్ మేనేజర్స్ ఉపయోగపడతాయి. వీటితో పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవటం, ప్రతీసారీ పాస్‌వర్డ్‌ను టైప్ చేయటం తప్పుతాయి. కానీ చాలామంది వీటిని వాడుకోరు. హ్యాకర్లు పాస్‌వర్డ్‌లను దొంగిలించే ప్రమాదముందని భావించటం దీనికి ఒక కారణం. అందువల్ల ఇవి మంచివేనా? అనే అనుమానం కలుగుతుంటుంది. -
ఐఫోన్‌కు మరింత భద్రత
యాపిల్ సంస్థ ఐఓఎస్ 17.3 బీటాతో ఐఫోన్ల కోసం గొప్ప భద్రత ఫీచర్‌ను పరిచయం చేసింది. దీని పేరు స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్. పేరుకు తగ్గట్టుగానే ఫోన్‌ను ఎవరైనా దొంగిలించినప్పుడు యాపిల్ ఖాతాను కాపాడుకోవటానికిది ఉపయోగపడుతుంది. బహిరంగ ప్రదేశాల్లో ఐఫోన్ దొంగతనాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. -
ఇక మొబైల్ ఫోనే టీవీ
రేడియో, ఫోన్లలోని రిసీవర్ ఆయా ఫ్రీక్వెన్సీలను గ్రహించి ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు ప్రసారం చేస్తాయి కదా. డీ2ఎం పరిజ్ఞానమూ దీన్నే పోలి ఉంటుంది. కాకపోతే ఇది వీడియోలను ప్రసారం చేస్తుంది. ఇంట్లో టీవీ కార్యక్రమాలను రోజూ చూస్తూనే ఉంటాం. మొబైల్ ఫోన్లో యూట్యూబ్‌లోనూ అప్పుడప్పుడు వీటిని వీక్షిస్తుంటాం. -
పాత ప్రింటర్‌ను అమ్ముతున్నారా?
ప్రింటర్‌తో ఎన్నెన్నో డాక్యుమెంట్లు ప్రింట్ చేస్తూనే ఉంటాం. అప్పుడప్పుడూ రహస్య సమాచారంతో కూడిన పత్రాలనూ ప్రింట్ చేస్తుంటాం. ఇవన్నీ వ్యక్తిగత సమాచారం రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. -
నచ్చిన ఫొటోల స్లైడ్‌షో
ఇష్టమైన ఫొటోలను స్లైడ్ షోగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. విండోస్ పీసీ వాడేవారు తమకు తామే దీన్ని సృష్టించుకోవచ్చు. నచ్చిన వాల్పేపర్లు, ఫొటోలను ఒక ఫోల్డర్లో వేయాలి. -
ఫొటో అసలుదేనా?
ఆన్లైన్లో ఎన్నో ఫొటోలు. అన్నీ అసలువే కాకపోవచ్చు. కొన్ని నకిలీ ఫొటోలూ ఉండొచ్చు. కృత్రిమ మేధ సృష్టిస్తున్న ఫొటోలతో ఈ బెడద మరింత ఎక్కువైంది కూడా. -
కీబోర్డు మీద వేళ్ల ప్రయాణం!
కీబోర్డు మీద చకచకా టైప్ చేస్తుంటాం గానీ ఆ సమయంలో చేతి వేళ్లు ఎంత దూరం ప్రయాణించాయో ఎప్పుడైనా లెక్కించారా? చేతి వేళ్లు ప్రయాణించటమేంటని అనుకుంటున్నారా? మరేమీ లేదు. -
వినూత్నం మృదు రోబో
ఎటంటే అటు వంగే మృదువైన రోబోల విషయంలో నార్త్ కరోలీనా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గొప్ప పురోగతిని సాధించారు. ట్విస్టెట్ రింగ్‌బాట్స్‌ను రూపొందించి సంచలనం సృష్టించారు. -
ఫోన్ బ్యాటరీ ఎన్నిసార్లు ఛార్జ్ అవుతుంది?
స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ పూర్తిగా.. అంటే 0 నుంచి 100% వరకు ఎన్నిసార్లు ఛార్జ్ అవుతుంది? ఎవరు లెక్కపెట్టొచ్చారని పెదవి విరవకండి. దీని గురించి తెలిస్తే బ్యాటరీ ఎక్కువ కాలం మన్నేలా కాపాడుకోవచ్చు మరి -
చిటికెలో పీసీ లాక్
పీసీ మీద ముఖ్యమైన పని చేస్తున్నారు. అదేమో అత్యంత రహస్యమైంది. అంతలో ఎవరైనా వస్తే? లేదూ ఎవరైనా వెనక నుంచి చేస్తున్న పనిని చూస్తున్నారని అనుమానం వస్తే? ఇలాంటి సమయంలో చిటికెలో పీసీని లాక్ చేసే సదుపాయం బాగా ఉపయోగపడుతుంది. -
పీసీ వేగానికి
-
ఫోన్ డిటాక్స్
ఆరోగ్యంగా ఉండటానికి ఉపవాసం చేసినట్టుగా స్మార్ట్ఫోన్లకూ అప్పుడప్పుడు విశ్రాంతి ఇవ్వటం మంచిది. ఇది డిజిటల్ డిటాక్స్‌కు బాగా ఉపయోగపడుతుంది. ఫోన్‌కు బానిసలు కాకుండా కాపాడుతుంది. కానీ మనసు మాట వినటం లేదంటారా? అయితే సెటింగ్స్‌లోనే మార్పులు చేసుకొని చూడండి. వీటితో నిర్ణీత సమయం మేరకైనా ఫోన్లకు విశ్రాంతి ఇవ్వచ్చు. -
ఇమేజ్లోంచీ అక్షరాలు కాపీ
ఇమేజ్లోనో, వీడియోలోనో టెక్స్ట్ సందేశం ఆకట్టుకోవచ్చు. దాన్ని టైప్ చేసుకోవాలనీ అనిపించొచ్చు. అంత కష్టం ఎందుకు? కాపీ చేస్తే పోలా. -
కంటెంట్ మాత్రమే ప్రింట్
డిజిటల్ డాక్యుమెంట్లు ప్రామాణికంగా మారిపోతున్న రోజులివి. ఇందుకోసం బ్రౌజర్లో తరచూ ప్రింట్ ఆప్షన్‌తో పీడీఎఫ్‌లను సృష్టించుకుంటూనే ఉంటాం.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్‌ను దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
-
కేజ్రీవాల్ ఫోన్లోని ఎన్నికల వ్యూహాల కోసం.. ఈడీ ప్రయత్నాలు: ఆతిశీ
-
‘ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావు చెప్పినట్లే చేశా!’
-
హెన్రిచ్ క్లాసెన్.. సన్‌రైజర్స్‌కు భలే దొరికాడు
-
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఎన్టీఆర్ నిరూపించారు: చంద్రబాబు