Qualcomm: వైర్లు లేకుండానే AR ప్రపంచం..!

ఆగ్మెంటెడ్ రియాలిటీకి సంబంధించి అమెరికాకు చెందిన చిప్‌ తయారీ సంస్థ క్వాల్‌కామ్‌ మరో మైలురాయిని అధిగమించింది. స్నాప్‌డ్రాగన్‌ XR2తో నడిచే..

Published : 24 May 2022 14:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR)కి సంబంధించి అమెరికాకు చెందిన చిప్‌ తయారీ సంస్థ క్వాల్‌కామ్‌ (Qualcomm Technologies) మరో మైలురాయిని అధిగమించింది. స్నాప్‌డ్రాగన్‌ XR2తో నడిచే వైర్‌లెస్‌ ఏఆర్‌ స్మార్ట్‌ గ్లాసెస్‌ డిజైన్‌ను కంపెనీ ఆవిష్కరించింది. తద్వారా రానున్న రోజుల్లో స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌లతో పనిచేసే మొబైల్స్‌, పీసీలతో ఈ స్మార్ట్‌ గ్లాసెస్‌ను ఈజీగా కనెక్ట్‌ చేసుకోవచ్చు. ఈ మేరకు ఎటువంటి వైర్లు వాడకుండానే ఆగ్మెంటెడ్ రియాలిటీ ప్రపంచాన్ని వీక్షించవచ్చు.

ఎప్పటికి అందుబాటులోకి..?

సాఫ్ట్‌వేర్‌ విషయాన్ని కాసేపు పక్కనపెడితే.. ఈ స్మార్ట్‌ గ్లాసెస్‌ చూడటానికి చాలా స్లిమ్‌గా కనిపిస్తున్నాయి. వీటిని ధరించినప్పుడు సాంప్రదాయ గ్లాసెస్‌ మాదిరే చాలా తేలికగా ఉంటాయని కంపెనీ పేర్కొంది. డ్యూయల్‌ మైక్రో - OLED బైనాక్యులర్ డిస్‌ప్లే, 90Hz ఫ్రేమ్ రేట్‌, నో-మోషన్‌-బ్లర్‌ ఫీచర్‌తో ఇది మెరుగైన ఏఆర్‌ అనుభవాన్ని అందించగలదు. ఇందులోని Wi-Fi 6/6E, బ్లూటూత్ కనెక్టివిటీ, 6DoF 6 డ్యూయల్ ఫ్రంట్ కెమెరాలు.. మోషన్‌ ట్రాకింగ్‌, కలర్‌ వీడియోను క్యాప్చర్‌ చేయగల అదనపు RGB కెమెరాను ఇందులో వాడినట్లు క్వాల్‌కామ్‌ తెలింది. అయితే, ఈ వైర్‌లెస్‌ ఏఆర్‌ హెడ్‌సెట్‌లను వచ్చే ఏడాది లేదా ఆ తర్వాత అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది.

అయితే, ఈ గ్లాసెస్‌లో 650mAh బ్యాటరీనే వినియోగించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు గొప్ప ఫీచర్లు కలిగిన ఈ గ్లాసెస్‌ను ఛార్జ్‌ చేస్తే ఎన్ని గంటలు పనిచేస్తుందన్నది స్పష్టత లేదు. మరోవైపు రానున్న రోజుల్లో ఏఆర్‌ గ్లాసెస్‌ను తీసుకొస్తామని పలు టెక్‌ కంపెనీలు ప్రకటించాయి. ఇందులో భాగంగానే మైక్రోసాఫ్ట్‌ ఇప్పటికే క్వాల్‌కామ్‌తో AR గ్లాసెస్ చిప్‌ల కోసం భాగస్వామ్యం కలిగి ఉంది. 

ఏంటీ ఏఆర్‌, వీఆర్‌లు..?

వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌) పూర్తిగా ఊహా లోకం. ఇది లేనిది ఉన్నట్ట్టుగా ఒక కొత్త ప్రపంచాన్ని 360 డిగ్రీల కోణంలో చూపిస్తుంది. ఇందుకు మీరు ప్రత్యేకమైన హెడ్‌సెట్‌ వాడాల్సి ఉంటుంది. అదే ఆగ్మెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌) అంటే ఉన్న వాస్తవలోకంలో కొత్త ఆబ్జెక్ట్‌లను చూపిస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందో తెలియాలంటే గూగుల్‌కు చెందిన మోషన్‌ స్టిల్స్‌ యాప్‌ను వాడి తెలుసుకోవచ్చు. అందులో ఉన్న జంతువుల బొమ్మలు, వస్తువులు.. మొబైల్‌ సహాయంతో మీ పరిసరాల్లోనే ఉన్నట్లు తెలుస్తుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని