Ray-Ban Stories: రేబాన్ స్టోరీస్ కొత్త ఫీచర్.. స్మార్ట్‌గ్లాసెస్‌తో ఫేస్బుక్ మెసేంజర్ మెసేజ్‌లు!
ఫేస్బుక్, రేబాన్ సంయుక్తంగా రూపొందించిన రేబాన్ స్టోరీస్ స్మార్ట్‌గ్లాసెస్‌లో మరో ముఖ్యమైన ఫీచర్‌ను యూజర్స్‌కు పరిచయం చేస్తున్నట్లు మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్బుక్ పోస్టు ద్వారా వెల్లడించారు.
ఇంటర్నెట్‌డెస్క్: ఫేస్‌బుక్‌తో కలిసి రేబాన్ కంపెనీ రూపొందించిన రేబాన్ స్టోరీస్ స్మార్ట్గ్లాసెస్కు సంబంధించి మరో ముఖ్యమైన ఫీచర్ యూజర్స్‌కు అందుబాటులోకి వచ్చింది. ఇక మీదట ఈ స్మార్ట్‌గ్లాసెస్ ద్వారా యూజర్స్ ఫేస్బుక్ మెసేంజర్ మెసేజ్‌లను ఇతరులకు పంపడంతోపాటు, రిసీవ్ చేసుకోవచ్చని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఫేస్బుక్ పోస్టు ద్వారా తెలిపారు. ‘‘ యూజర్స్‌కు మెరుగైన సేవలందించడంలో భాగంగా రేబాన్ స్టోరీస్‌లో మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేస్తున్నాం. ఈ ఫీచర్‌తో యూజర్స్ ఫేస్బుక్ మెసేంజర్ నుంచి మెసేజ్‌లు పంపడం, తమకు వచ్చిన మెసేజ్‌లను వినడం, కాల్స్ చేయడంతోపాటు వాయిస్ కమాండ్స్‌తో సౌండ్ కంట్రోల్ చేయొచ్చు. రేబాన్ స్టోరీస్‌కు సంబంధించి మరిన్ని ఫీచర్స్‌ను 2022లో అందుబాటులోకి తీసుకొస్తున్నాం’’ అని జుకర్‌బర్గ్ తన ఫేస్బుక్ పోస్టులో వెల్లడించారు.
రేబాన్ స్టోరీస్ ఫీచర్స్
ఫోన్ కాల్స్ కోసం ఇందులో మూడు మైక్రోఫోన్స్ ఉన్నాయి. గ్లాసెస్ ఫ్రేమ్‌కి రెండువైపులా 5 ఎంపీ కెమెరాలు అమర్చారు. వీటి సాయంతో 30 సెకన్ల నిడివి కలిగిన వీడియోలను రికార్డు చేయొచ్చు. సుమారు 500 ఫొటోలను, 30 సెకన్ల నిడివి ఉన్న 35 వీడియోలను ఈ స్మార్ట్‌గ్లాసెస్‌లో స్టోర్ చేసుకోవచ్చు. అలానే కెమెరాతోపాటు రెండువైపులా ఎల్ఈడీ లైట్లు ఉన్నాయి. ఈ స్మార్ట్గ్లాసెస్ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 200 ఫొటోలు, 30 సెకన్ల నిడివి ఉన్న 30 వీడియోలను తీసుకోవచ్చు. రేబాన్ స్టోరీస్‌లో ఫ్రేమ్‌కి రెండు వైపులా ఓపెన్-ఇయర్ స్పీకర్స్ ఉన్నాయి. వీటి ద్వారా మ్యూజిక్‌ను వినవచ్చు. అలానే ఫ్రేమ్ కుడివైపు టచ్ కంట్రోల్స్ ఉంటాయి. వాటిపై ఒక్కసారి టచ్ చేస్తే మ్యూజిక్ ప్లేబ్యాక్, రెండుసార్లు టచ్ చేయడం ద్వారా సౌండ్ పెంచడం, తగ్గించుకోవడం, మూడుసార్లు టచ్ చేసి కాల్స్ మాట్లాడొచ్చు.
వేరియంట్స్, ధర
ఈ ఏడాది సెప్టెంబరు నెలలో ఫేస్బుక్, రేబాన్ సంయుక్తంగా స్టోరీస్ స్మార్ట్గ్లాసెస్ను మార్కెట్లోకి విడుదలచేశాయి. ఆరు రకాల లెన్స్ వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి. వీటి ధర 299 డాలర్ల నుంచి 379 డాలర్లుగా ఫేస్బుక్ నిర్ణయించింది. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 22,000 నుంచి రూ. 28,000 మధ్య ఉంటుందని అంచనా. బ్లాక్, బ్లూ, బ్రౌన్, గ్రీన్ రంగుల్లో ఇవి లభిస్తాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్, ఇటలీ, బ్రిటన్, అమెరికా మార్కెట్లలో మాత్రమే ఈ స్మార్ట్‌గ్లాసెస్ అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే భారత మార్కెట్లో వీటిని విడుదల చేయనున్నట్లు సమాచారం.
► Read latest Gadgets & Technology News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Web Browser: డిఫాల్ట్ బ్రౌజర్‌ను మార్చుకోవడం ఎలాగో తెలుసా..?
ప్రైవసీని దృష్టిలో పెట్టుకొని చాలా మంది డిఫాల్ట్ ఇంటర్నెట్ బ్రౌజర్‌కు బదులుగా ఇతర యాప్‌లు డౌన్‌లోన్ చేసుకుంటున్నారు. అయినప్పటికీ వాట్సాప్‌లో వచ్చే లింక్ క్లిక్ చేస్తే మాత్రం.. -
ఎరుపు సాగు
పంట దిగుబడి పెరగటానికి రకరకాల ఎరువులు వాడటం కొత్తేమీ కాదు. కానీ ఉచితంగా లభించే కాంతి సాయంతోనూ దిగుబడి పెంచుకోగలిగితే? తేలికైన పరిజ్ఞానంతో దీన్ని సుసాధ్యం చేయొచ్చని ఆస్ట్రేలియా పరిశోధకులు నిరూపిస్తున్నారు. -
Gmail: జీమెయిల్ యాక్సెస్ కోల్పోతే.. ఏం చేయాలి?
జీమెయిల్ యాక్సెస్ (ఐడీ, పాస్వర్డ్) కోల్పోతే ఎలా అని ఆలోచిస్తున్నారా..! ఖాతాను తిరిగి పునరుద్ధరించడానికి.. -
MIUI 13: షావోమి కొత్త ఓఎస్... పది కొత్త ఫీచర్లు ఇవే!
ఆండ్రాయిడ్ మొబైల్స్‌కు సంబంధించి కొత్త ఓఎస్ MIUI 13లో వచ్చే ఫీచర్లు, మార్పులపై ఓ లుక్కేద్దాం.. రండి! -
Samsung Galaxy: ఫిబ్రవరిలో శాంసంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్
శాంసంగ్ అన్ప్యాక్డ్ ఈవెంట్‌కి (Samsung Galaxy Unpacked Event) సన్నద్ధమవుతోంది. -
పొడవైన దారం బ్యాటరీ
ఆ దారాన్ని స్మార్ట్‌వాచీల వంటివాటికి చుట్టుకోవచ్చు. ఛార్జింగ్ చేసుకోవచ్చు. అది మామూలు దారం కాదు. పొడవైన బ్యాటరీ మరి. ఇలాంటి వినూత్నమైన లిథియం అయాన్ బ్యాటరీనే పరిశోధకులు రూపొందించారు. రీఛార్జ్ కాగల ... -
స్మార్ట్ బెంచీ
విరామ సమయంలో ఆఫీసు గదిలోంచి ఆరు బయటకు వచ్చాం. అత్యవసరంగా మెయిల్ పంపించుకోవాల్సి ఉంది. లేదూ ఆటవిడుపు కోసం యూట్యూబ్ చూడాలని అనుకున్నాం. -
Year Ender 2021:₹5 వేలలోపు ధర.. ఈ ఏడాదిటాప్ స్మార్ట్‌వాచ్‌లు ఇవే!
ఈ ఏడాది ₹5 వేల లోపు ధరల్లో విడుదలైన టాప్ 5 స్మార్ట్‌వాచ్‌ల జాబితా మీ కోసం.. -
యూఎస్బీ కేబుల్ తీస్తేల్యాప్టాప్ కిల్!
యూఎస్బీ కేబుల్ తీసేస్తే ల్యాప్‌టాప్ కిల్. అవును మీరు చదివింది నిజమే. ఇది మామూలు కేబుల్ కాదు మరి. ల్యాప్‌టాప్‌లోని సమాచారం దొంగల చేతికి చిక్కకుండా రూపొందించిన ప్రత్యేకమైన యూఎస్బీ కేబుల్. దీన్ని ల్యాప్‌టాప్‌కు తగిలించి ఉంచామనుకోండి. ఎవరైనా దాన్ని దొంగిలించి, -
వెనక తాకితే ఐఫోన్ టార్చ్‌లైట్
తెలిసినవి గోరంత. తెలియనివి కొండంత. ఐఫోన్ చిట్కాల గురించి ఇలాగే చెప్పుకోవాలి. ఎంత తెలుసుకున్నా తెలియని చిట్కాలు ఇంకెన్నో. వీటిల్లో ఒకటి టార్చ్‌లైట్ ఫీచర్. మామూలుగా ఫ్లాష్‌లైట్‌ను ఆన్ చేయాలంటే లాక్ స్క్రీన్ మూలకు ఎడమ వైపున కనిపించే గుర్తును నొక్కుతారు. కంట్రోల్ సెంటర్ ద్వారానూ ఆన్, ఆఫ్ చేస్తారు. -
Power Banks: ₹1000లోపే మంచి బ్యాకప్‌తో ది బెస్ట్ పవర్ బ్యాంక్స్!
మీ స్మార్ట్‌ఫోన్‌లో ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? మంచి పవర్ బ్యాంక్ కొనాలనుకుంటున్నారా? ₹1,000 లోపు లభిస్తున్న బెస్ట్ పవర్ బ్యాంక్స్ ఇవే. అవేంటో చూసేయండి. -
OnePlus Buds: సింగిల్ ఛార్జ్‌తో 38 గంటల బ్యాకప్.. వన్‌ప్లస్ కొత్త ఇయర్‌బడ్స్ ధర, ఫీచర్లివే!
వన్‌ప్లస్ కంపెనీ టీడబ్ల్యూఎస్ శ్రేణితో కొత్త ఇయర్‌బడ్స్‌ను అంతర్జాతీయ మార్కెట్లోవి విడుదల చేసింది. మరి వీటి ధర, ఫీచర్ల వివరాలివే. -
Laptops: అదిరే ఫీచర్లతో ఇన్ఫినిక్స్ ల్యాప్‌టాప్‌లు.. ధరెంతంటే?
ఇన్ఫినిక్స్ ఇన్బుక్ X1 సిరీస్ పేరుతో చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ ఇన్ఫినిక్స్.. భారత విపణిలోకి ల్యాప్‌టాప్‌లను విడుదల చేసింది. ధర.. వాటి ఫీచర్లేంటో తెలుసుకోండి! -
HP Laptops: గేమర్స్ కోసం హెచ్‌పీ కొత్త ల్యాప్‌టాప్.. ధర, ఫీచర్లివే!
గేమర్స్ కోసం హెచ్‌పీ కంపెనీ ఒమెన్ సిరీస్‌లో కొత్త ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. హెచ్‌పీ ఒమెన్ 16 పేరుతో ఈ ల్యాప్‌టాప్‌ను తీసుకొచ్చారు. -
Nothing Ear 1: నథింగ్ కొత్త ఇయర్‌బడ్స్.. ధర, ఫీచర్లివే!
నథింగ్ కంపెనీ కొత్త ఇయర్‌బడ్స్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిని క్రిప్టో కరెన్సీ సాయంతో కూడా కొనుగోలు చేయొచ్చని తెలిపింది. అయితే భారత్‌లో క్రిప్టో కరెన్సీతో కొనుగోలు చేసే సదుపాయం లేదని వెల్లడించింది. -
విండోస్10లో ఆడియో రికార్డింగు ఇలా..
కంప్యూటర్లో ఆడియో రికార్డు చేయాలని అనుకుంటున్నారా? అయితే విండోస్ 10లో వాయిస్ రికార్డరును వాడి చూడండి. దీంతో ఆడియోను రికార్డు చేయటం చాలా తేలిక. మైక్రోఫోన్, శబ్దాన్ని గ్రహించే సాఫ్ట్వేర్ ఉంటే చాలు. -
Poco Laptop: పోకో ల్యాప్టాప్స్ వచ్చేస్తున్నాయ్.. ఫీచర్లివేనా!
పొకో కంపెనీ త్వరలోనే భారత మార్కెట్లో కొత్త ల్యాప్‌టాప్‌ను తీసుకురానుంది. అలానే పొకో బ్రాండ్ కింద స్మార్ట్‌వాచ్, ట్రూవైర్‌లెస్ ఇయరబడ్స్ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. -
రోబోల సందడి
రోబోలు నెమ్మదిగా మనుషుల ఉద్యోగాలను లాగేసుకుంటున్నాయా? అమెరికాలోని గూగుల్ ప్రధాన కార్యాలయంలో రోబోల సందడిని చూస్తుంటే ఇలాంటి సందేహం కలగటం ఖాయం. ఒకటి కాదు, రెండు కాదు.. -
Tablets: అందుబాటు ధరలో అదిరే ఫీచర్స్‌తో ట్యాబ్స్.. ఇదిగో జాబితా!
మొబైల్, పీసీలకు పోటీగా ట్యాబ్‌లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇటీవలి కాలంలో వీటి వినియోగం పెరగడంతో గ్యాడ్జెట్ కంపెనీలు వీటి తయారీపై దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో డిస్ప్లే, బ్యాటరీ, కనెక్టివిటీ పరంగా ఉత్తమమైన ట్యాబ్ మోడల్స్ ఏంటో చూద్దాం. -
జార్విస్.. జుకర్ ప్రత్యేక అసిస్టెంట్
మెటా (ఫేస్బుక్) సృష్టికర్త మార్క్ జుకర్‌బర్గ్ అనగానే ముందుగా టెక్నాలజీయే గుర్తుకొస్తుంది. ఇంట్లో రకరకాల పరికరాలు పని చేయటానికీ ఆయన దీన్నే ఉపయోగించుకుంటారు. ఇప్పుడు ఎకో, సిరి వంటి పరికరాలు అందుబాటులోకి వచ్చాక అంతా కాలు మీద కాలేసుకొని
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్‌సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్