Realme 10 Series: రియల్‌మీ కొత్త ఫోన్‌.. ధర, ఫీచర్లివే!

రియల్‌మీ రెండు వేరియంట్లలో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. గతంలో విడుదలైన రియల్‌మీ 9 సిరీస్‌కు కొనసాగింపుగా ఈ ఫోన్‌ను తీసుకొస్తుంది. ఆ ఫోన్ వివరాలివే. 

Published : 04 Nov 2022 01:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రియల్‌మీ 10 సిరీస్‌ (Realme 10 Series)లో కొత్త ఫోన్‌ను తీసుకొస్తుంది.  రియల్‌మీ 10 ప్రో, రియల్‌మీ 10 ప్రో+ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్లను  నవంబరు 9న మార్కెట్లోకి విడుదల చేయనుంది. రియల్‌మీ నెక్స్ట్‌ జనరేషన్‌ మోడల్‌గా చెబుతున్న ఈ ఫోన్లు ఆండ్రాయిడ్‌ 12 ఓఎస్‌తో పనిచేస్తాయి. వీటిలో ఇంకా ఏమేం ఫీచర్లు ఉంటాయో చూద్దాం.

రియల్‌మీ 10ప్రోలో మీడియాటెక్‌ హీలియో జీ99 ప్రాసెసర్‌ ఉపయోగించారు. 8జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్‌, 6 జీబీ ర్యామ్‌/ 128 జీబీ, 4 జీబీ/64 జీబీ వేరియంట్లో లభిస్తుంది. వర్చువల్‌ ర్యామ్‌ ఫీచర్‌ కూడా ఉంటుంది. ఈ ఫోన్‌లో వెనుకవైపు 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, ముందుభాగంలో 16 ఎంపీ కెమెరాలు ఉంటాయని సమాచారం. ఈ వేరియంట్‌లో 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుందట. ఇది 33 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. రియల్‌మీ 10 ప్రో+లో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారు. మీడియాటెక్‌ డైమెన్సిటీ 1080 ప్రాసెసర్‌ ఉపయోగించారట. ఇందులో 4,890 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుందని సమాచారం. ఇది 65 వాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందట. ఈ వేరియంట్‌ కెమెరా వివరాలు తెలియాల్సివుంది. ఈ ఫోన్ల ధర రూ. 15 వేల నుంచి రూ. 25 వేల మధ్య ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని