Published : 18 Jan 2022 16:36 IST

Realme 9i: బడ్జెట్‌ ధర.. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ ఫీచర్‌తో రియల్‌మీ కొత్త ఫోన్

ఇంటర్నెట్‌డెస్క్‌: రియల్‌మీ (realme) 9 సిరీస్‌లో తొలి ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రియల్‌మీ 9ఐ (Realme 9i) పేరుతో బడ్జెట్‌ ఫ్రెండ్లీ మోడల్‌గా ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. గతంలో వచ్చిన రియల్‌మీ 8ఐ మోడల్‌కు కొనసాగింపుగా కంపెనీ ఈ కొత్త ఫోన్‌ను పరిచయం చేసింది. ఇందులో వెనుకు మూడు కెమెరాలతో పాటు, సంగీత ప్రియుల కోసం డ్యూయల్‌ స్టీరియో స్పీకర్స్‌ ఉన్నాయి. వీటితోపాటు రియల్‌మీ 9ఐలో ఎలాంటి ఫీచర్లున్నాయో చూద్దాం. 


ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ2.0 ఓఎస్‌తో పనిచేస్తుంది. 90 హెర్జ్‌ రిఫ్రెష్‌రేట్‌, 180 హెర్జ్‌ టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌తో 6.6 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. డ్రాగన్‌ ట్రెయిల్‌ ప్రో గ్లాస్ రక్షణ కూడా ఉంది. స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఎక్స్‌టెండెడ్‌ ర్యామ్‌ ఫీచర్‌ కూడా ఉంది.


ఈ ఫోన్‌లో మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. వెనుక మూడు, ముందు ఒక కెమెరా ఇస్తున్నారు. వెనుకవైపు 50 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు, రెండు 2 ఎంపీ కెమెరాలున్నాయి. ముందుభాగంలో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 33 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. వందశాతం బ్యాటరీ ఛార్జింగ్ 70 నిమిషాల్లో అయిపోతుందని రియల్‌మీ చెబుతోంది.


రియల్‌మీ 9ఐను రెండు వేరియంట్లలో తీసుకొచ్చారు. 4 జీబీ ర్యామ్‌/64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 13,999. 6 జీబీ/128 జీబీ వేరియంట్‌ ధర రూ. 15,999. జనవరి 25 నుంచి రియల్‌మీ, ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్ల నుంచి కొనుగోలు చేయొచ్చు. ప్రిసమ్‌ బ్లాక్‌, ప్రిసమ్‌ బ్లూ రంగుల్లో లభిస్తుంది. 

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని