Realme: 5 నిమిషాల్లో 50శాతం ఛార్జ్‌ అయ్యే ఫోన్‌.. సింగిల్‌ ఛార్జ్‌తో 17 గంటలు పనిచేసే బడ్స్‌

చైనా టెక్‌ దిగ్గజం రియల్‌మీ కొత్త ఉత్పత్తులతో యూజర్ల ముందుకు వచ్చింది. రియల్‌మీ జీటీ నియో 3, ప్యాడ్‌ మినీ, బడ్స్‌ క్యూ2ఎస్‌, స్మార్ట్‌ టీవీ ఎక్స్‌

Updated : 11 May 2022 18:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనా టెక్‌ దిగ్గజం రియల్‌మీ కొత్త ఉత్పత్తులతో యూజర్ల ముందుకు వచ్చింది. రియల్‌మీ జీటీ నియో 3 (Realme GT Neo 3), రియల్‌మీ ప్యాడ్‌ మినీ (Realme Pad Mini), బడ్స్‌ క్యూ2ఎస్‌ (Buds Q2s), రియల్‌మీ స్మార్ట్‌ టీవీ ఎక్స్‌ (Realme Smart TV X) వంటి కొత్త డివైజ్‌లను భారత మార్కెట్లో విడుదల చేసింది. మరి వీటి ప్రత్యేకతలు? ధరెంతో చూద్దాం..


రియల్‌మీ జీటీ నియో 3 స్పెసిఫికేషన్లు..(Realme GT Neo 3)

రియల్‌మీజీటీ సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ను కంపెనీ ఆవిష్కరించింది. రియల్‌మీ జీటీ నియో 3 (Realme GT Neo 3) పేరుతో దీన్ని విడుదల చేసింది. ఈ ఫోన్‌లో మీడియాటెక్‌ డైమెన్‌సిటీ 8100 చిప్‌సెట్‌ను వాడారు. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌రేట్‌తో  6.7 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లేను ఇచ్చారు. రేసింగ్‌ స్ట్రెప్‌ డిజైన్‌లో మొబైల్‌ ఉంటుంది. 5నానో లేయర్‌ ఫిల్మ్స్‌ ఉంటాయి. వెనకవైపు మాటీ ఏజీ గ్లాస్‌ ఉండడంతో మొబైల్‌పై ఫింగర్‌ ప్రింట్స్‌ తక్కువగా పడతాయి. ఈ ఫోన్‌ 4500 బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. ఇది 150 వాట్‌ అల్ట్రాడార్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. దీంతో 5 నిమిషాల్లో 50 శాతం ఛార్జ్‌ అవుతుంది. కెమెరా విషయానికి వస్తే.. వెనుకవైపు 50మెగా పిక్సల్‌ ప్రధాన కెమెరా, ముందువైపు సెల్పీల కోసం 16ఎంపీ కెమెరాను అమర్చారు. 8 జీబీ+128 జీబీ వేరియంట్‌ ధర రూ.29,999గా, 8 జీబీ+256 జీబీ వేరియంట్‌ ధర రూ.31,999గా, 12 జీబీ+256 జీబీ వేరియంట్‌ ధరను రూ.35,999గా కంపెనీ నిర్ణయించింది. మే 4 నుంచి వివిధ స్టోర్‌లలో ఫోన్‌ విక్రయాలు ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది.


రియల్‌మీ ప్యాడ్‌ మినీ (Realme Pad Mini) ఫీచర్లు...

రియల్‌మీ ప్యాడ్‌ మినీ (Realme Pad Mini) పేరుతో కొత్త ట్యాబ్‌ను కంపెనీ తీసుకొచ్చింది. 8.7 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఇస్తున్నారు. యూనిసెక్‌ టీ616 ఆక్టా కోర్‌ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ట్యాబ్‌ వెనుకభాగంలో 8ఎంపీ కెమెరా, ముందుభాగంలో సెల్ఫీల కోసం 5ఎంపీ కెమెరాను అమర్చారు. బ్యాటరీ సామర్థ్యం 6,400 ఎంఏహెచ్‌గా ఉంటుంది. 18వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఇవేకాకుండా డ్యుయల్‌ బ్యాండ్‌ వైఫై సపోర్ట్‌, బ్లూటూత్‌ 5.0, టైప్‌ సీ యూఎస్‌బీ పోర్ట్‌, 3.5ఎంఎం హెడ్‌ఫోన్‌ జాక్‌, డ్యుయల్‌ స్పీకర్లను ఇచ్చారు. 3 జీబీ+32జీబీ వేరియంట్‌ ట్యాబ్‌ ధరను రూ.12,999గా, 4 జీబీ+ 64 జీబీ ధరను రూ.14,999గా కంపెనీ నిర్ణయించింది. మే 2 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయని తెలిపింది. మే 2 నుంచి మే 9 వరకు కొనుగోలు చేసే వారికి ప్రత్యేక ఆఫర్‌ను కూడా ఇస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.


బడ్స్‌ క్యూ2ఎస్‌ (Realme Buds Q2s) ప్రత్యేకతలు..

వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో రియల్‌మీ బడ్స్‌ క్యూ2ఎస్‌ (Realme Buds Q2s) ఎయిర్‌బడ్స్‌ను కంపెనీ విడుదల చేసింది. ఇందులో ఎన్విరాన్‌మెంట్ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ (ఈఎన్‌సీ) ఫీచర్‌ ఉంది. దీంతో యూజర్స్‌ అద్భుతమైన కాలింగ్ క్వాలిటీ పొందుతారు. సింగిల్‌ ఛార్జ్‌తో 17 గంటలపాటు నాన్‌స్టాప్‌గా ఉపయోగించవచ్చు. 10 నిమిషాలు ఛార్జ్‌ చేస్తే 3 గంటలపాటు పాటలు వినే అవకాశం ఉంది. ఇందులో ఆర్‌ 1 చిప్‌ను వాడారు. టచ్‌ కంట్రోల్‌, ఓపెన్‌ అప్‌ ఆటో కనెక్షన్‌, డైనమిక్‌ బేస్‌ బూస్ట్‌ డ్రైవర్‌, మ్యూజిక్‌ కంట్రోలింగ్, ఫోన్ కాల్స్‌ ఆపరేటింగ్‌ సదుపాయం ఉంటుంది. వీటి ధరను రూ. 3,999గా కంపెనీ నిర్ణయించింది. మే 2 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి.


రియల్‌మీ స్మార్ట్‌ టీవీ ఎక్స్‌ (Realme Smart TV X)..

రియల్‌మీ కంపెనీ గృహోపకరణాల శ్రేణిలో మరో కొత్త ఉత్పత్తిని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లేతో రియల్‌మీ స్మార్ట్‌ టీవీ ఎక్స్‌(Realme Smart TV X) టీవీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది 40, 43 అంగుళాల స్క్రీన్‌లో అందుబాటులో ఉంటాయి. ఇందులో మీడియాటెక్‌ చిప్‌ పవర్‌ఫుల్‌ క్వాడ్‌ కోర్‌ పిక్చర్‌ ప్రాసెసర్‌ను వాడారు. మెరుగైన వీడియో క్వాలిటీ కోసం క్రోమా బూస్ట్‌ పిక్చర్ ఇంజిన్ అమర్చారు.

1జీబీ ర్యామ్‌, 8జీబీ స్టోరేజ్‌తో పనిచేస్తుంది. బ్లూటూత్ 5.0, వైఫైతోపాటు హెచ్‌డీఎంఐ, రెండు యూఎస్‌బీ పోర్ట్స్‌, ఏవీ ఇన్‌పుట్‌, ల్యాన్‌ పోర్ట్‌, హెడ్‌ఫోన్‌ జాక్, డిజిటల్‌ ఆడియో అవుట్‌పుట్‌లు ఉన్నాయి. డాల్బీ అట్మాస్‌ సపోర్ట్‌తో క్వాడ్‌ స్టీరియో హెచ్‌డీ ఆడియో 24వాట్ స్పీకర్స్‌ ఇస్తున్నారు. కంపెనీ స్మార్ట్‌ టీవీ ధరను రూ.15,999గా నిర్ణయించింది. ప్రారంభ ధరలో కంపెనీ ప్రత్యేక ఆఫర్లను కూడా ప్రకటించింది. మే 4 నుంచి వివిధ రిటైల్‌, ఆన్‌లైన్‌ స్టోర్‌లలో విక్రయాలు జరుగుతాయని కంపెనీ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని