
₹7వేలకే రియల్మీ కొత్త ఫోన్.. ఫీచర్లివీ
ఇంటర్నెట్ డెస్క్: తక్కువ బడ్జెట్లో 4జీ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారి కోసం రియల్మీ సంస్థ మరో మొబైల్‌ను లాంచ్ చేసింది. గతేడాది తీసుకొచ్చిన రియల్మీ సీ11 కొనసాగింపుగా.. సీ11 (2021)ను విడుదల చేసింది. గతంలో ఈ ఫోన్లో డ్యూయల్ కెమెరా ఉండగా.. ఈ సారి సింగిల్ కెమెరాతో తీసుకొచ్చారు. మరి ఈ ఫోన్ ఎలా ఉంది? ధరెంతో ఇప్పుడు తెలుసుకుందాం.
రియల్మీ సీ11 2జీబీ/32జీబీ వేరియంట్లో వస్తోంది. రెండు రంగుల్లో లభిస్తోంది. దీని ధరను ₹6,999గా కంపెనీ నిర్ణయించింది. రియల్మీ.కామ్ వెబ్సైట్లో దీన్ని కొనుగోలు చేయొచ్చు. గతేడాది విడుదల చేసిన మోడల్ ధరను ₹7,499గా కంపెనీ పేర్కొంది.
ఇక ప్రత్యేకతల విషయానికొస్తే ఆండ్రాయిడ్ 11తో రియల్మీ యూఐ 2.0తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 6.5 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లేతో వస్తు్న్న ఈ ఫోన్లో ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను అమర్చారు. వెనుకవైపు 8 ఎంపీ కెమెరా, ముందు వైపు 5 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. ఇంటర్నల్ స్టోరేజీని 256 జీబీ వరకు పెంచే వీలుంది. 5000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్.. ఓటీజీ కేబుల్ ద్వారా రివర్స్ ఛార్జింగ్ సదుపాయానికి కూడా సపోర్ట్ చేస్తుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.