Realme Narzo 50A Prime | Moto G52: బడ్జెట్‌ ధరలో రియల్‌మీ, మోటో నుంచి కొత్త ఫోన్లు!

బడ్జెట్‌ ధరలో రియల్‌మీ, మోటోరోలా కంపెనీలు కొత్త ఫోన్లతో యూజర్ల ముందుకు వచ్చాయి. రియల్‌మీ నార్జో 50ఏ ప్రైమ్‌ (Realme Narzo 50A Prime), మోటో జీ52 (Moto G52) పేరుతో భారత మార్కెట్లో విడుదల చేశాయి.

Updated : 11 May 2022 18:38 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాన్యుడిని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్‌ ధరలో రియల్‌మీ, మోటోరోలా కంపెనీలు కొత్త ఫోన్లతో యూజర్ల ముందుకు వచ్చాయి. రియల్‌మీ నార్జో 50ఏ ప్రైమ్‌ (Realme Narzo 50A Prime), మోటో జీ52 (Moto G52) పేరుతో వీటిని భారత మార్కెట్లో విడుదల చేశాయి. మరి రెండు ఫోన్ల ఫీచర్లేంటి? ధరెంతో చూద్దాం..


రియల్‌మీ నార్జో 50ఏ స్పెసిఫికేషన్లు..

రియల్‌మీ నార్జో 50ఏ ఫోన్‌లో 6.6 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ ఆర్‌ ఓఎస్‌తో పనిచేస్తుంది. ఆక్టాకోర్‌ యూనిసెక్‌ టీ612 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. కెమెరా విషయానికి వస్తే.. ఫోన్‌ వెనుకభాగంలో 50ఎంపీ ఏఐ ట్రిపుల్‌ కెమెరా ఇచ్చారు. ముందు భాగంలో సెల్ఫీల కోసం 8ఎంపీ కెమెరాను అమర్చారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 4 జీబీ ర్యామ్‌/64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 11,499. 4 జీబీ ర్యామ్‌/128 జీబీ వేరియంట్‌ ధర రూ. 12,499గా కంపెనీ నిర్ణయించింది. ఏప్రిల్‌ 28 నుంచి వివిధ ఆన్‌లైన్‌, రిటైల్‌ స్టోర్‌లలో విక్రయాలు ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది.


మోటో జీ52 స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకతలు..

మోటోరోలా కంపెనీ కూడా సరసమైన ధరలో మోటో జీ52 (Moto G52)ను భారత మార్కెట్లో  విడుదల చేసింది. రూ.15వేల లోపు బడ్జెట్‌లో ఈ మొబైల్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో 90Hz రిఫ్రెష్‌రేట్‌తో 6.6 అంగుళాల  pOLED డిస్‌ప్లేను ఇచ్చారు.  క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌ను ఉపయోగించారు.
ఫోన్‌ వెనుకభాగంలో 50ఎంపీ+8ఎంపీ ఆల్ట్రావైడ్‌ కెమెరాను ఇచ్చారు. ముందుభాగంలో 16ఎంపీ కెమెరాను అమర్చారు. 5,000ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం ఉంటుంది. 33 వాట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ చేస్తుంది.

ఇందులో మెరుగైన సౌండ్‌ కోసం ప్రత్యేకంగా డాల్‌బీ అట్మాస్‌ స్పీకర్స్‌ను వినియోగించారు. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499గా, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,499గా కంపెనీ నిర్ణయించింది. రెండు (గ్రే,  వైట్‌) కలర్లలో లభించనుంది. మే 3 నుంచి ఆన్‌లైన్‌, రిటైల్‌ స్టోర్‌లలో విక్రయాలు ప్రారంభమవుతాయని కంపెనీ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని