రియల్‌మీ నార్జో 30 సిరీస్.. విడుదలకు రెడీ
రియల్‌మీ మరోసారి టెక్ ప్రియులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 24న మూడు కొత్త ఉత్పత్తులను భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. వీటిలో రెండు నార్జో 30 సిరీస్ ఫోన్లు, బడ్స్ ఎయిర్2.........
ఇంటర్నెట్ డెస్క్: రియల్‌మీ మరోసారి టెక్ ప్రియులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 24న మూడు కొత్త ఉత్పత్తులను భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. వీటిలో రెండు నార్జో 30 సిరీస్ ఫోన్లు, బడ్స్ ఎయిర్2 ఇయర్‌బడ్స్ ఉన్నాయి. రియల్‌మీ నార్జో 30ఏ, నార్జో 30 ప్రో 5జీ పేరుతో వీటిని తీసుకొస్తున్నారు. ఇందులో నార్జో 30 ప్రో 5జీ ఫోన్‌ను మిడ్ రేంజ్ 5జీ గేమింగ్ మోడల్‌గా, నార్జో 30ఏను బడ్జెట్ గేమింగ్ ఫోన్ కేటగిరీలో గట్టి పోటీ ఇస్తాయని రియల్‌మీ భావిస్తోంది.
నార్జో 30 ప్రో 5జీలో డైమెన్సిసిటీ 800యూ ప్రాసెసర్ ఉపయోగించారు. 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారట. ఇందులో మొత్తం నాలుగు కెమెరాలు ఉంటాయని తెలుస్తోంది. వెనక 48 ఎంపీ కెమెరాతో పాటు రెండు కెమెరాలు, ముందు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందట. ఇక నార్జో 30ఏ మోడల్‌లో కూడా 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారట. 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందని సమాచారం. పూర్తి వివరాలు తెలియాలంటే ఫిబ్రవరి 24 వరకు వేచి చూడాల్సిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
UPSC: ఆ ఇద్దరూ నకిలీ ర్యాంకర్లే.. క్రిమినల్ చర్యలు తీసుకుంటాం: యూపీఎస్సీ
-
India News
భాగస్వామితో శృంగారానికి నిరాకరించడం మానసిక క్రూరత్వమే
-
Ts-top-news News
Eamcet: ఈసారీ ‘స్లైడింగ్’ పెత్తనం కళాశాలలదేనా?
-
Crime News
Crime News: వృద్ధుణ్ని చంపి.. దేహాన్ని ముక్కలు చేసి.. యువజంట కిరాతకం
-
Ts-top-news News
Sangareddy: కట్నం చాల్లేదని పెళ్లి పీటలపై నుంచి పారిపోయిన ప్రేమికుడు
-
Sports News
MS Dhoni: ధోని ఓ ఇంద్రజాలికుడు