Smartphones Launch: రెండు రోజుల వ్యవధిలో ఐదు మోడల్స్‌.. ధర, ఫీచర్లివే!

రెండు రోజుల వ్యవధిలో నాలుగు కంపెనీలు ఐదు కొత్త ఫోన్లలను భాతర మార్కెట్లోకి విడుదల చేశాయి. మరి, ఆ మోడల్స్‌ ఏంటి? వాటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం..

Updated : 16 Sep 2022 22:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత మార్కెట్లో మొబైల్ కంపెనీలు దూకుడు పెంచాయి. కంపెనీల మధ్య నెలకొన్న పోటీ, స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య పెరగుతుండటంతో వరుస ఫోన్లను విడుదల చేస్తున్నాయి. గతంలో కొత్త  మోడల్‌ విడుదలకు మధ్య వారం లేదా రెండు వారాల వ్యవధి ఉండేది. ప్రస్తుతం రోజుల వ్యవధిలోనే కొత్త మోడల్స్‌ మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. తాజాగా రెండు రోజుల వ్యవధిలోనే రియల్‌మీ, వివో, ఒప్పో కంపెనీలు ఐదు కొత్త మోడల్స్‌ను విడుదలచేశాయి. మరి, ఆ మోడల్స్‌ ఏంటి? వాటిలో ఎలాంటి ఫీచర్లున్నాయి? ధర ఎంత? ఎప్పటి నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయనేది చూద్దాం..


రియల్‌మీ జీటీ నియో 3టీ (Realme GT Neo 3T)

జీటీ నియో సిరీస్‌లో సిరీస్‌లో రియల్‌మీ కొత్త మోడల్‌ను తీసుకొచ్చింది. రియల్‌మీ జీటీ నియో 3టీ (Realme GT Neo 3T)గా విడుదలైన ఈ ఫోన్‌లో నియో ఛార్జింగ్ స్పీడ్ సాంకేతికతను ఉపయోగించారు. దీంతో 50 శాతం బ్యాటరీ కేవలం 12 నిమిషాల్లో ఛార్జ్‌ అవుతుంది. ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్‌మీ యూఐ 3.0 ఓఎస్‌తో పనిచేస్తుంది. 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.62 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఈ4 అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 870 ప్రాసెసర్‌ను ఉపయోగించారు.  వెనుక మూడు, ముందు ఒక కెమెరా ఉన్నాయి. వెనుకవైపు 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు, 8 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌, 2 ఎంపీ కెమెరా ఉన్నాయి. ముందుభాగంలో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. అండర్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌, ఫేస్‌ అన్‌లాక్‌ ఫీచర్లు ఉన్నాయి. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80వాట్‌ డాట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.  మూడు వేరియంట్లలో రియల్‌మీ జీటీ నియో 3టీ విడుదలైంది. 6 జీబీ ర్యామ్‌/128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ వేరియంట్‌ ధర ₹ 29,999. 8 జీబీ/128 జీబీ ధర ₹ 31,999. 8 జీబీ/256 జీబీ ధర ₹ 33,999. సెప్టెంబరు 23 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి.


 

టెక్నో ఊసరవెల్లి ఫోన్‌ (Tecno CAMON 19 Pro Mondrian)

టెక్నో కెమెన్‌  19 ప్రో మెన్‌డ్రియన్‌లో వెనుక భాగం ఊసరవెల్లిలా రంగులు మారుతుంది. సాధారణ వాతావరణ పరిస్థితుల్లో వెనుక భాగం తెలుపు రంగులో ఉంటుంది. సూర్యకాంతి పడినప్పుడు నాలుగు రంగుల్లోకి మారుతుంది. ఇందుకోసం ఈ ఫోన్‌లో ఫొటోసిమర్‌ (Photoisomer) సాంకేతికతను ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత హైఓఎస్‌ 8.6తో పనిచేస్తుంది. 120 హెర్జ్‌ రిజల్యూషన్‌తో 6.80 ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. మీడియాటెక్‌ హీలియో జీ96 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. వెనుక 64 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 50 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలున్నాయి. ముందు 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇస్తున్నాయి. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను ఇస్తుంది. 8 జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్‌ ధర ₹ 17,999.  


ఒప్పో ఎఫ్‌21ఎస్‌ ప్రో సిరీస్ (Oppo F21s Pro, Pro 5G)

ఒప్పో ఎఫ్‌ 21 ప్రో సిరీస్‌లో రెండు కొత్త మోడల్స్‌ను పరిచయం చేసింది. అవి, ఒప్పో ఎఫ్21ఎస్‌ ప్రో (Oppo F21s Pro) , ఒప్పో ఎఫ్‌21ఎస్‌ ప్రో 5జీ (Oppo F21s Pro 5G). 5జీ సపోర్ట్‌, డిస్‌ప్లే రిఫ్రెష్‌ రేట్‌, ప్రాసెసర్‌ మినహా ఈ ఫోన్లలో ఒకే విధమైన ఫీచర్లు ఉన్నాయి. 5జీ వేరియంట్‌లో డిస్‌ప్లే రిఫ్రెష్‌ రేట్‌ 60 హెర్జ్‌ కాగా, సాధారణ వేరియంట్‌లో 90 హెర్జ్‌ ఉంది. ఎఫ్‌21ఎస్‌ ప్రో 5జీ వేరియంట్‌లో స్నాప్‌డ్రాగన్‌ 695‌, ఎఫ్‌21ఎస్‌ ప్రోలో స్నాప్‌డ్రాగన్‌ 680 ప్రాసెసర్‌లను ఉపయోగించారు.  

ఫీచర్లు 

రెండు ఫోన్లలో 6.43 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్‌ 12.1 ఓఎస్‌తో పనిచేస్తాయి. వెనుక 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 2 ఎంపీ కెమెరాలు రెండు అమర్చారు. ముందుభాగంలో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్‌ సూపర్‌వూక్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 8 జీబీ/128 జీబీ వేరియంగ్‌ 5జీ మోడల్‌ ధర ₹ 25,999, సాధారణ వేరియంట్‌ ధర ₹ 22,999. 


వివో వీ25 5జీ (Vivo V25 5G)

ఈ ఫోన్‌ ఫ్లోరైట్‌ ఏజీ గ్లాస్‌ డిజైన్‌తో రూపుదిద్దుకుంది. దీనివల్ల ఫోన్‌ వెనుకభాగం సూర్యకాంతి లేదా ఇతర డివైజ్‌ల నుంచి యూవీ కిరణాలు పడినప్పుడు కలర్‌ మారుతుంది. 90 హెర్జ్‌ రిఫ్రెష్‌  రేట్‌తో 6.44 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. మీడియాటెక్‌ డైమెన్సిటీ 900 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్‌ 12 ఓఎస్‌తో పనిచేస్తుంది. వెనుక 64 ఎంపీతోపాటు 8 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలున్నాయి. ముందు 50 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 44 వాట్‌ ఫ్లాష్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఈ ఛార్జర్‌తో 30 నిమిషాల్లో 61 శాతం బ్యాటరీ ఛార్జ్‌ అవుతుంది. 8 జీబీ/ 128 జీబీ వేరియంట్‌ ధర ₹ 27,999, 12 జీబీ/256 జీబీ ధర ₹ 31,999.


రియల్‌మీ నార్జో 50ఐ ప్రైమ్‌ (Realme Narzo 50i Prime)

నార్జో సిరీస్‌లో మరో బడ్జెట్‌ రేంజ్‌ మోడల్‌ను రియల్‌మీ విడుదల చేసింది.  రియల్‌మీ నార్జో 50ఐ ప్రైమ్‌ పేరుతో రెండు వేరియంట్లలో పరిచయం చేసింది. 3 జీబీ/32 జీబీ ధర ₹ 7,999, 4 జీబీ/ 64 జీబీ ధర ₹ 8,999. ఆండ్రాయిడ్11 ఆధారిత రియల్‌మీ యూఐ ఆర్‌ ఓఎస్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. యూనిసాక్‌ టీ612 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. వెనుకవైపు 8ఎంపీ, ముందుభాగంలో 5 ఎంపీ కెమెరాలను అమర్చారు. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని