Redmi 10: డ్యూయల్‌ కెమెరాతో రెడ్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్‌.. ధర, ఫీచర్లివే!

రెడ్‌మీ కంపెనీ బడ్జెట్ మోడల్‌లో కొత్త ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. మరి ఈ ఫోన్‌ ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం.

Published : 17 Mar 2022 22:03 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: బడ్జెట్‌ ఫ్రెండ్లీ మోడల్స్‌తో వినియోగదారులకు చేరువైన రెడ్‌మీ సంస్థ తాజాగా మరో కొత్త మొబైల్‌ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రెడ్‌మీ 10 పేరుతో తీసుకొచ్చిన ఈ మొబైల్‌లో డ్యూయల్‌ కెమెరా, అధిక సామర్థ్యం కలిగిన బ్యాటరీ వంటి ఫీచర్లున్నాయి. మరి రెడ్‌మీ 10 ధరెంత? అమ్మకాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి? ఇతర ఫీచర్లపై ఓ లుక్కేద్దాం..

ఆండ్రాయిడ్ 11 ఆధారిత MIUI 13 ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. 6.7 అంగుళాల HD+ డిస్‌ప్లే ఇస్తున్నారు. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 680 ప్రాసెసర్‌ ఉపయోగించారు. వర్చువల్ ర్యామ్‌ సపోర్ట్ ఇస్తున్నారు. ఈ ఫోన్‌లో మూడు కెమెరాలున్నాయి. వెనుకవైపు 50 ఎంపీ ప్రైమరీ సెన్సర్‌ కెమెరాతో పాటు, 2 ఎంపీ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 5 ఎంపీ కెమెరా అమర్చారు. 6,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. రెడ్‌మీ 10 రెండు వేరియంట్లలో లభిస్తుంది. 4 జీబీ ర్యామ్‌/ 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.10,999. 6 జీబీ/128 జీబీ వేరియంట్ ధర రూ.12,999. మార్చి 24 నుంచి MI.Com, MI హోమ్‌, ఫ్లిప్‌కార్ట్‌ వెబ్‌సైట్‌లతోపాటు అన్ని ఆఫ్‌లైన్‌ స్టోర్లలో కొనుగోలు చేయొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని