రెడ్‌మీ 10: మూడొచ్చాయ్‌.. మురిపించాయ్‌

మొబైల్స్‌ ఫీచర్లు, ధర , అమ్మకానికి వచ్చే తేదీలు తదితర వివరాలు...

Updated : 12 Aug 2022 12:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బడ్జెట్‌ ధరలో  స్మార్ట్‌ ఫోన్లు తీసుకొచ్చే...  రెడ్‌మీ ఈ ఏడాదిలో తొలి సిరీస్‌ను తీసుకొచ్చింది. రెడ్‌మీ 10 సిరీస్‌లో మొత్తంగా మూడు మొబైల్స్‌ భారతీయ మార్కెట్‌లోకి  విడుదల చేసింది. ఈ మూడు మోడల్స్‌లోనూ సూపర్‌ ఆమోలెడ్‌ డిస్‌ప్లే ఇవ్వడం గమనార్హం. ఎంఐ.కామ్‌, అమెజాన్‌, ఎంఐ హోమ్‌లో త్వరలో వీటి అమ్మకాలు మొదలవుతాయి. మరి ఆ మొబైల్స్‌ ఫీచర్లు, ధర , అమ్మకానికి వచ్చే తేదీలు తదితర వివరాలు చదివేయండి.


రెడ్‌మీ నోట్‌ 10 ప్రో మ్యాక్స్‌

రెడ్‌మీ 10 సిరీస్‌లో  ప్రో మ్యాక్స్‌ టాప్‌ మోడల్‌.  ఇందులో వెనుకవైపు 108 ఎంపీ ప్రధాన కెమెరా కాగా, 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 5 ఎంపీ సూపర్‌ మాక్రో లెన్స్‌, 2ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ ఇస్తున్నారు. 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ సూపర్‌ ఆమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది. దీని రిఫ్రెష్‌ రేట్‌ 120 హెడ్జ్‌, ఇది హెచ్‌డీఆర్‌ 10కు సపోర్టు చేస్తుంది. క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 732 జీ ప్రాసెసర్‌, అడ్రినో 618 జీపీయూ ఉంటాయి. 5,020 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 33 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. 2+1 డెడికేటెట్‌ మెమొరీ కార్డు స్లాట్‌ ఉంటుంది. అంటే రెండు సిమ్‌ కార్డులు, ఒక మెమొరీ కార్డు వాడుకోవచ్చు. 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ వెర్షన్‌ ధర  ₹18,999. 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ మోడల్‌ ధర, ₹19,999. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ డివైజ్‌ ధర ₹21,999. ఈ నెల 18 నుంచి ఈ మొబైల్స్‌ అందుబాటులోకి వస్తాయి. 


రెడ్‌మీ నోట్‌ 10 ప్రో 

రెడ్‌మీ నోట్‌ 10 ప్రోలో... కూడా వెనుకవైపు నాలుగు కెమెరాలు ఉంటాయి. 64 ఎంపీ ప్రధాన కెమెరా కాగా, 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 5ఎంపీ సూపర్‌ మాక్రో లెన్స్‌ 2ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ ఇస్తున్నారు. 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. 6.67 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ సూపర్‌ ఆమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది. దీని రిఫ్రెష్‌ రేట్‌ 120 హెడ్జ్‌, ఇది హెచ్‌డీఆర్‌ 10కు సపోర్టు చేస్తుంది. క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 732 జీ ప్రాసెసర్‌, అడ్రినో 618 జీపీయూ ఉంటాయి. 5,020 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 33 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. 2+1 డెడికేటెట్‌ మెమొరీ కార్డు స్లాట్‌ ఉంటుంది. అంటే రెండు సిమ్‌ కార్డులు, ఒక మెమొరీ కార్డు వాడుకోవచ్చు. 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ వెర్షన్‌ ధర  ₹15,999. 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ మోడల్‌ ధర, ₹16,999. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ డివైజ్‌ ధర  ₹18,999. ఈ నెల 1 నుంచి ఈ మొబైల్స్‌ సేల్‌కి వస్తాయి. 


రెడ్‌మీ నోట్‌ 10 

రెడ్‌మీ నోట్‌ 10 వెనుకవైపు నాలుగు కెమెరాలు ఉంటాయి. 48 ఎంపీ ప్రధాన కెమెరా కాగా, 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 2ఎంపీ మాక్రో లెన్స్‌, 2 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ ఇస్తున్నారు. 13 ఎంపీ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. 6.43 అంగుళాల  ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ సూపర్‌ ఆమోలెడ్‌ డిస్‌ప్లే ఉంటుంది. 180 హెడ్జ్‌ టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ ఉంటుంది.  క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 678 జీ ప్రాసెసర్‌ ఉంటుంది.  అడ్రినో 612 జీపీయూ ఉంటుంది. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 33 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది.  2+1 డెడికేటెట్‌ మెమొరీ కార్డు స్లాట్‌ ఉంటుంది. అంటే రెండు సిమ్‌ కార్డులు, ఒక మెమొరీ కార్డు వాడుకోవచ్చు. 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ వెర్షన్‌ ధర  ₹11,999. 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ మోడల్‌ ధర, ₹13,999. ఈ నెల 16 నుంచి ఈ మొబైల్స్‌ సేల్‌కి వస్తాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని