Redmi 10A: బడ్జెట్ ధరలో రెడ్‌మీ నుంచి మరో కొత్త ఫోన్‌!

సామాన్యుడిని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్‌ ధరలో రెడ్‌మీ10ఏ స్మార్ట్‌ఫోన్లను కంపెనీ విడుదల చేసింది. మరి ఈ ఫోన్ ప్రత్యేకతలు? ధరెంతంటే?

Updated : 11 May 2022 18:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైనా స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం రెడ్‌మీ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌తో యూజర్ల ముందుకు వచ్చింది. తాజాగా రెడ్‌ మీ 10ఏ మోడల్‌ ఫోన్లను భారత మార్కెట్లలో కంపెనీ విడుదల చేసింది. సామాన్యుడిని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్‌ ధరలో ఈ ఫోన్లను తీసుకొచ్చింది. మరి ఈ ఫోన్ ప్రత్యేకతలు? ధరెంతో చూద్దాం.. 


స్పెసిఫికేషన్లు.. 

రెడ్‌మీ 10ఏ సిరీస్‌ ఫోన్లలో 6.53 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇచ్చారు. ఇది ఆండ్రాయిడ్‌ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఓఎస్‌తో పనిచేస్తుంది. ఇందులో మీడియాటెక్‌ హీలియో జీ25 ప్రాసెసర్‌ను వాడారు. కెమెరా విషయానికొస్తే.. ఫోన్‌ వెనుకభాగంలో 13ఎంపీ ప్రధాన కెమెరాను, ముందుభాగంలో 5ఎంపీ సెల్ఫీ కెమెరాను అమర్చారు. బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 10వాట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో పనిచేస్తుంది. ఇవేకాకుండా 4G కనెక్టివిటీ ఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్ 5.0, మైక్రో-యూఎస్‌బీ పోర్ట్, 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి.

ధరెంతంటే? 

రెడ్‌మీ 10ఏ ధర భారత్‌లో పదివేలలోపే ఉంది. 3జీబీ+32జీబీ వేరియంట్‌ ఫోన్‌ ధర రూ.8,499గా, 4జీబీ+64జీబీ వేరియంట్‌ ధర రూ.9,499గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్ బ్లాక్, బ్లూ, గ్రే కలర్‌లో అందుబాటులో ఉంది. భారత్‌లోని వివిధ రిటైల్‌ స్టోర్‌లలో ఏప్రిల్‌ 26 నుంచి విక్రయాలు జరగనున్నాయని కంపెనీ వెల్లడించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని