Redmi K50i: రెడ్‌మీ కొత్త ఫోన్‌.. జియోతో కలిసి 5జీ ట్రయల్స్‌!

షావోమి కంపెనీ వచ్చే జులై 20న ఒక కొత్త రెడ్‌మీ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. రెడ్‌మీ కే50ఐ (Redmi K50i) పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్‌ 12 రకాల 5జీ బ్యాండ్‌లను సపోర్ట్ చేస్తుందట...

Published : 18 Jul 2022 01:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: షావోమి కంపెనీ వచ్చే జులై 20న ఒక కొత్త రెడ్‌మీ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేయనుంది. రెడ్‌మీ కే50ఐ (Redmi K50i) పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్‌ 12 రకాల 5జీ బ్యాండ్‌లను సపోర్ట్ చేస్తుందట. ఇప్పటికే  5జీ నెట్‌వర్క్‌కు సంబంధించిన అన్ని బ్యాండ్‌లను రిలయన్స్‌ జియో సంస్థతో కలిసి విజయవంతంగా పరీక్షించారు. 12 రకాల 5జీ నెట్‌వర్క్‌లను సపోర్ట్‌ చేస్తున్న తొలి రెడ్‌మీ ఫోన్‌ కూడా ఇదే. 4కే స్ట్రీమింగ్‌, క్లౌడ్‌ గేమింగ్ వంటి టెస్ట్‌లను ఈ ఫోన్‌ పాసయినట్లు రెడ్‌మీ సంస్థ తెలిపింది. దీంతో యూజర్లకు ఎలాంటి అంతరాయం లేకుండా గేమ్‌లను ఆడుకోవడంతోపాటు, 8కే క్వాలిటీ వీడియోలను కూడా బఫరింగ్ లేకుండా చూడగలరు. 

రెడ్‌మీ కే50ఐ ఫీచర్లు

మిడ్‌ రేంజ్‌ శ్రేణిలో రెడ్‌మీ ఈ ఫోన్‌ను తీసుకొస్తుంది. చాలా కాలంగా రెడ్‌మీ కంపెనీ ‘K’ సిరీస్‌లో కొత్త ఫోన్‌ను విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో రెడ్‌మీ కే50ఐ కోసం టెక్‌ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ పోన్‌లో 144 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌, ఫుల్‌హెచ్‌డీ+ రిజల్యూషన్‌తో 6.6 అంగుళాల ఐపీఎస్‌ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారు. వెనుకవైపు 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 8 ఎంపీ అల్ట్రా-వైడ్‌ యాంగిల్‌, 2 ఎంపీ కెమెరాలున్నాయి. వీడియో కాలింగ్‌, సెల్ఫీల కోసం ముందు భాగంలో 16 ఎంపీ కెమెరా అమర్చారు. 5,080 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. ఇది 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 12 ఆధారిత ఎమ్‌ఐయూఐ 13 ఓఎస్‌తో పనిచేస్తుంది. 6 జీబీ ర్యామ్‌/ 128 జీబీ స్టోరేజ్‌, 8 జీబీ/256 జీబీ వేరియంట్లో తీసుకురానుంది. రెడ్‌మీ కే50ఐ ధర ₹ 21 వేల నుంచి ₹ 25 వేల మధ్య ఉంటుందని మార్కెట్‌ వర్గాల అంచనా. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు