Updated : 28 Oct 2021 21:33 IST

Redmi Note 11: రెడ్‌మీ హిట్‌ సిరీస్‌ నుంచి మూడు కొత్త ఫోన్లు

ఇంటర్నెట్‌డెస్క్‌: షావోమి సబ్‌బ్రాండ్ రెడ్‌మీ మరో కొత్త మోడల్‌ ఫోన్‌ను విడుదల చేసింది. రెడ్‌మీ నోట్‌ 11 పేరుతో మూడు వేరియంట్లలో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది. అవి రెడ్‌మీ నోట్ 11 5జీ, నోట్‌ 11 ప్రో, నోట్‌ 11 ప్రో+. రెడ్‌మీ అనగానే చాలా మందికి తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్‌ ఉండే ఫోన్లు గుర్తొస్తాయి. గతంలో విడుదలైన రెడ్‌మీ నోట్ 10 సిరీస్‌కి కొనసాగింపుగా తీసుకొచ్చిన నోట్ 11 సిరీస్‌లో ఎలాంటి ఫీచర్లున్నాయి? ధరెంత? ఎప్పటి నుంచి అమ్మకాలు ప్రారంభంకానున్నాయనేది చూద్దాం.


డిస్‌ప్లే

రెడ్‌మీ నోట్‌ 11 5జీ - 90 హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.6 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే

రెడ్‌మీ నోట్‌ 11 ప్రో - 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే 

రెడ్‌మీ నోట్‌ 11 ప్రో+ - 360 హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే 


ప్రాసెసర్‌

రెడ్‌మీ నోట్‌ 11 5జీ - మీడియాటెక్ డైమెన్సిటీ 810 

డ్‌మీ నోట్ 11 ప్రో - మీడియాటెక్ డైమెన్సిటీ 920 

రెడ్‌మీ నోట్‌ 11 ప్రో+ - మీడియాటెక్ డైమెన్సిటీ 920   


కెమెరా

రెడ్‌మీ నోట్‌ 11 5జీ - వెనుక 50 ఎంపీ, 8ఎంపీ కెమెరాలు. ముందు 16 ఎంపీ కెమెరా

రెడ్‌మీ నోట్‌ 11 ప్రో - వెనుక 108 ఎంపీ, 8 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు. ముందు 16 ఎంపీ కెమెరా

రెడ్‌మీ నోట్ 11 ప్రో+ - వెనుక 108 ఎంపీ, 8 ఎంపీ, 2 ఎంపీ కెమెరాలు. ముందు 16 ఎంపీ కెమెరా


బ్యాటరీ

రెడ్‌మీ నోట్‌ 11 5జీ - 33 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ

రెడ్‌మీ నోట్‌ 11 ప్రో - 67 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ 

రెడ్‌మీ నోట్‌ 11 ప్రో+ -  120 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ 


ఇతర ఫీచర్లు

ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ 12.5 ఓఎస్‌తో ఈ ఫోన్లు పనిచేస్తాయి. ఈ ఫోన్‌కి ఐపీ53 రేటింగ్‌ ఉంది. దీని వల్ల ఫోన్‌ నీటిలో తడిచినా పాడవదు. అలానే ఫోన్ వేడెక్కకుండా వీసీ లిక్విడ్ కూలింగి సిస్టమ్‌ అమర్చారు. జేబీఎల్‌ ట్యూన్డ్‌ స్టీరియో స్పీకర్స్‌ ఇస్తున్నారు. వీటికి డాల్బీ ఆట్‌మోస్‌ హై-రిజల్యూషన్‌ ఆడియో సపోర్ట్ ఉంది.  


ధర

రెడ్‌మీ నోట్‌ 11 సిరీస్‌ మోడల్స్‌ను 4 జీబీ ర్యామ్‌/128 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 6 జీబీ/128 జీబీ, 8 జీబీ/128 జీబీ, 8 జీబీ/256 జీబీ వేరియంట్లలో తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోన్లు చైనాలో మాత్రమే విడుదల చేశారు. ఈ ఏడాడి చివర్లో కానీ, వచ్చే ఏడాది ప్రథమార్థంలో కానీ వీటిని భారత మార్కెట్‌లో విడుదల చేయొచ్చని మార్కెట్‌ వర్గాల అంచనా. చైనాలో వీటి ధర 1,199 యెన్‌లు నుంచి 2,199 యెన్‌ల వరకు ఉంది. అంటే భారత మార్కెట్‌లో వీటి ధర సుమారు రూ. 14,000 నుంచి రూ. 25,700 వరకు ఉంటుందని అంచనా.  

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని