5G SmartPhone: 5జీ ఫోన్ కొంటున్నారా..? ఈ మూడు విషయాలు గుర్తుంచుకోండి!
దేశంలో 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. మొబైల్ కంపెనీలు రెండేళ్ల క్రితం నుంచే 5జీ ఫోన్లలను విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 5జీ ఫోన్ కొనేముందు ఏయే అంశాలు పరిగణలోకి తీసుకోవాలో తెలుసుకుందాం...
ఇంటర్నెట్ డెస్క్: సినిమా డౌన్లోడ్ కోసం ఎదురుచూపులు ఉండవు.. వీడియో కాల్స్ పూర్ కనెక్షన్ అని చూపించవు.. మొబైల్ గేమింగ్‌లో బఫరింగ్ ఉండదు. వీటని వేగంగా, అంతరాయం లేకుండా అందించే 5జీ టెలికాం నెట్వర్క్ ఎట్టకేలకు దేశంలో అందుబాటులోకి వచ్చేసింది. 5జీ రాకతో సాంకేతిక రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటుచేసుకుంటాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. ముందుగా ప్రధాన నగరాల్లో, తర్వాత దేశవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు 5జీ సేవలను విస్తరిస్తామని మొబైల్ నెట్వర్క్ సంస్థలు ప్రకటించాయి. ఫోన్ తయారీ కంపెనీలు రెండేళ్ల క్రితం నుంచే 5జీ ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తుండటంతో ఎన్నో రకాల మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిలోంచి మన అవసరాలకు తగిన మోడల్‌ను ఎలా ఎంచుకోవాలి? 5జీ ఫోన్ కొనేముందు ఏయే అంశాలు దృష్టిలో పెట్టుకోవాలనేది చూద్దాం...
చిప్సెట్ కీలకం
ఫోన్ 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేయాలంటే అందులో 5జీ ప్రాసెసర్ ఉండాల్సిందే. మార్కెట్లో విడుదలైన 5జీ ఫోన్లలో మిడ్-రేంజ్, ఫ్లాగ్షిప్ మోడల్స్‌లో 5జీ ప్రాసెసర్‌నే ఉపయోగిస్తున్నాయి. వీటిలో కొన్ని ఫోన్లలో క్వాల్‌కోమ్ ప్రాసెసర్లు ఉపయోగిస్తుంటే, మరికొన్ని ఫోన్లలో మీడియాటెక్ ప్రాసెసర్లను వాడుతున్నారు. స్నాప్‌డ్రాగన్ 695, 765జీ, 865 ఆపై మోడల్స్ 5జీని సపోర్ట్ చేస్తాయి. మీడియాటెక్ డైమెన్సిటీ సిరీస్‌లో 700, 8100, 9,000తోపాటు జీ, హీలియో సిరీస్ ప్రాసెసర్లు 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేస్తాయి. ఫోన్ కొనేముందు 5జీ ప్రాసెసర్ అవునా? కాదా? అనేది తప్పనిసరిగా సరిచూసుకోవాలి.
బ్యాండ్స్ మాటేంటి!
ప్రాసెసర్ తర్వాత 5జీ మొబైల్లో ముఖ్యమైన ఫీచర్ బ్యాండ్స్. మీరు కొంటున్న ఫోన్ ఎన్ని రకాల 5జీ బ్యాండ్స్‌ను సపోర్ట్ చేస్తుందో తెలుసుకోవాలి. కనీసం ఎనిమిది నుంచి 12 రకాల బ్యాండ్స్‌ను సపోర్ట్ చేస్తున్నట్లయితే మీరు ఎంచుకున్న మోడల్ సరైనదే. ఒకవేళ మీరు కొంటున్న ఫోన్ రెండు లేదా మూడు 5జీ బ్యాండ్స్‌ను మాత్రమే సపోర్ట్ చేస్తుంటే, దాన్ని కొనకపోవడమే ఉత్తమం. నెట్వర్క్ ప్రొవైడర్ కంపెనీలు వేర్వేను బ్యాండ్‌విడ్త్‌లతో 5జీ సేవలను అందిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ బ్యాండ్విడ్త్స్లో మార్పులు జరిగే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో కేవలం రెండు లేదా మూడు బ్యాండ్‌విడ్త్‌లను సపోర్ట్ చేసే ఫోన్‌ను కొనుగోలు చేస్తే, దాంతో ఎక్కువకాలం 5జీ సేవలు పొందలేకపోవచ్చు.
అప్డేట్స్ వస్తాయా..?
ఎలాంటి సాంకేతికతకైనా ప్రారంభంలో కొన్ని లోటుపాట్లు ఉంటాయి. వాటిని సరిచేస్తూ ఆయా కంపెనీలు అప్డేట్లను విడుదల చేస్తుంటాయి. 5జీ నెట్‌వర్క్‌కు సైతం ఇది వర్తిస్తుంది. ముందుగా సర్వీస్ ప్రొవైడర్లు విడుదల చేసే 5జీ నెట్‌వర్క్‌కు సంబంధించిన అప్డేట్లను ఓవర్-ది-ఎయిర్ (OTA) పంపుతారు. వీటిని సపోర్ట్ చేసేందుకు మీరు కొనుగోలు చేస్తున్న మొబైల్ కంపెనీ కూడా ఎప్పటికప్పుడు ఓఎస్ అప్డేట్లను విడుదల చేస్తుండాలి. కాబట్టి, మీరు కొంటున్న ఫోన్ కంపెనీ ఓఎస్‌ను తరచుగా అప్డేట్ చేస్తుందా? లేదా? అని చెక్ చేయాలి. ఒకవేళ అప్డేట్స్ సరిగా రాకుంటే ఆ ఫోన్‌ను కొనకపోవడమే మేలు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా వచ్చింది
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా అందుబాటులోకి వచ్చింది. అంటే డెవలపర్ అకౌంట్ లేకపోయినా తాజా ఫీచర్లు, అప్డేట్లను ఎవరైనా ప్రయత్నించొచ్చన్నమాట. ఐఓఎస్ 17.5 స్టేబుల్ వర్షన్ ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం కనిపించటం లేదు. -
బహుబలి కెమెరా
అమెరికాలోని ఎస్ఎల్ఏసీ నేషనల్ యాక్సిలేటర్ లేబరేటరీ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత కెమెరాను రూపొందించారు. -
పిక్సెల్ ఫోన్లలో లుకప్ ఫీచర్
గూగుల్ పిక్సెల్ ఫోన్ వాడేవారికి శుభవార్త. తెలియని నంబర్ల నుంచి కాల్ చేసే వారిని గుర్తించే లుకప్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీన్ని ఇంతకుముందు జపాన్‌లో పరిచయం చేశారు గానీ ఇతర ప్రాంతాల్లో విడుదల చేయలేదు. -
మొబైల్ రోబో
వినూత్న ఫీచర్లతో కూడిన కొత్త టూల్స్‌తో టెక్నాలజీ రంగం శరవేగంగా విస్తరిస్తోంది. అలాంటి టూల్ ఒకటి ఇటీవలే విడుదలైంది. దీని పేరు ఎల్ఓఓఐ. ఇదో చిన్న డెస్క్‌టాప్ రోబో. -
మిమిక్రీ ఇంజిన్!
ప్రముఖ కృత్రిమ మేధ కంపెనీ ఓపెన్ఏఐ తాజాగా వాయిస్ అసిస్టెంట్ రంగంలోకి అడుగుపెట్టింది. ఇందులో భాగంగా వాయిస్ ఇంజిన్ అనే వినూత్న టూల్‌ను పరిచయం చేసింది. -
కొత్త సర్ఫేస్ ల్యాప్‌టాప్‌లు
వాణిజ్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని మైక్రోసాఫ్ట్ సంస్థ ఏఐ ఆధారిత సర్ఫేస్ ప్రొ 10, సర్ఫేస్ ల్యాప్‌టాప్ 6 పరికరాలను పరిచయం చేసింది. ఇంటెల్ కోర్ అల్ట్రా ప్రాసెసర్‌తో కూడిన ఇవి విండోస్ 11 ప్రొ మీద పనిచేస్తాయి. 5జీ కనెక్టివిటీ కూడా ఉంటుంది. -
జంతువుల రంగుల లోకాన్ని చూపించే కెమెరా
జంతువులు, పక్షులు, తేనెటీగలకు ఈ ప్రపంచం ఏ విధంగా కనిపిస్తుంది? మనం చూసే రంగులు వాటికీ కనిపిస్తాయా? చాలామందికి ఇలాంటి సందేహం వచ్చే ఉంటుంది. -
ఉంగరమే న్యూట్రిషనిస్ట్
సామ్సంగ్ ఇటీవల గెలాక్సీ రింగ్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇది రోజూ తినే ఆహారం విషయంలోనూ సూచనలు ఇవ్వగలదని చెబుతున్నారు. యూజర్ల శరీర ఎత్తు బరువుల నిష్పత్తి (బీఎంఐ) ఆధారంగా ఎన్ని కేలరీల శక్తినిచ్చే ఆహారం తినాలో సూచిస్తుంది. -
రియల్మీ నుంచి నార్జో 70 ప్రొ 5జీ ఫోన్లు
రియల్మీ సంస్థ నార్జో 70 ప్రొ 5జీ ఫోన్‌ను పరిచయం చేసింది. ఎయిర్ జెశ్చర్స్ శ్రేణిలో ఇదే తొలి ఫోనని కంపెనీ పేర్కొంటోంది. -
ఐఫోన్ కిటుకులు
ఐఫోన్లో ఎన్నో ఫీచర్లు. తెలియనివి ఎన్నెన్నో. తెలిసినా చప్పున గుర్తుకు రాకపోవచ్చు కూడా. కొత్తగా కొన్నవారైనా, తాజా వర్షన్‌కు అప్డేట్ చేసుకున్నవారైనా, చాలాకాలం నుంచి వాడుతున్నవారైనా.. వీటి గురించి తెలుసుకుంటే చిటికెలో పనులు పూర్తిచేసుకోవచ్చు. -
ఫొటో కటౌట్ చిటికెలో
ఫొటోలో వెనక దృశ్యాలను తొలగించి, కటౌట్ చేయటం పెద్ద పని. అడోబ్ ఫొటోషాప్, ఏఐ టూల్స్ వంటి అధునాతన సాధనాలు అవసరం. -
సెల్ సర్వీసు మొరాయిస్తే?
ఎప్పుడైనా సెల్‌ఫోన్ సర్వీసు సరిగా పనిచేయకపోతే ఫోన్‌ను ఎయిర్‌ప్లేన్ మోడ్‌లో పెట్టి, కాసేపు వేచి చూడాలి. తర్వాత ఫోన్‌ను యథాస్థితికి తేవాలి. దీంతో ఫోన్ సమీపంలోని సెల్ టవర్‌తో కనెక్ట్ అవుతుంది -
పాస్వర్డ్ మేనేజర్ భద్రమేనా?
భద్రత, బ్యాకప్ టూల్స్‌గా పాస్వర్డ్ మేనేజర్స్ ఉపయోగపడతాయి. వీటితో పాస్‌వర్డ్‌లను గుర్తుపెట్టుకోవటం, ప్రతీసారీ పాస్‌వర్డ్‌ను టైప్ చేయటం తప్పుతాయి. కానీ చాలామంది వీటిని వాడుకోరు. హ్యాకర్లు పాస్‌వర్డ్‌లను దొంగిలించే ప్రమాదముందని భావించటం దీనికి ఒక కారణం. అందువల్ల ఇవి మంచివేనా? అనే అనుమానం కలుగుతుంటుంది. -
ఐఫోన్‌కు మరింత భద్రత
యాపిల్ సంస్థ ఐఓఎస్ 17.3 బీటాతో ఐఫోన్ల కోసం గొప్ప భద్రత ఫీచర్‌ను పరిచయం చేసింది. దీని పేరు స్టోలెన్ డివైస్ ప్రొటెక్షన్. పేరుకు తగ్గట్టుగానే ఫోన్‌ను ఎవరైనా దొంగిలించినప్పుడు యాపిల్ ఖాతాను కాపాడుకోవటానికిది ఉపయోగపడుతుంది. బహిరంగ ప్రదేశాల్లో ఐఫోన్ దొంగతనాలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టారు. -
ఇక మొబైల్ ఫోనే టీవీ
రేడియో, ఫోన్లలోని రిసీవర్ ఆయా ఫ్రీక్వెన్సీలను గ్రహించి ఎఫ్ఎం రేడియో కార్యక్రమాలు ప్రసారం చేస్తాయి కదా. డీ2ఎం పరిజ్ఞానమూ దీన్నే పోలి ఉంటుంది. కాకపోతే ఇది వీడియోలను ప్రసారం చేస్తుంది. ఇంట్లో టీవీ కార్యక్రమాలను రోజూ చూస్తూనే ఉంటాం. మొబైల్ ఫోన్లో యూట్యూబ్‌లోనూ అప్పుడప్పుడు వీటిని వీక్షిస్తుంటాం. -
పాత ప్రింటర్‌ను అమ్ముతున్నారా?
ప్రింటర్‌తో ఎన్నెన్నో డాక్యుమెంట్లు ప్రింట్ చేస్తూనే ఉంటాం. అప్పుడప్పుడూ రహస్య సమాచారంతో కూడిన పత్రాలనూ ప్రింట్ చేస్తుంటాం. ఇవన్నీ వ్యక్తిగత సమాచారం రూపంలో నిక్షిప్తమై ఉంటాయి. -
నచ్చిన ఫొటోల స్లైడ్‌షో
ఇష్టమైన ఫొటోలను స్లైడ్ షోగా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. విండోస్ పీసీ వాడేవారు తమకు తామే దీన్ని సృష్టించుకోవచ్చు. నచ్చిన వాల్పేపర్లు, ఫొటోలను ఒక ఫోల్డర్లో వేయాలి. -
ఫొటో అసలుదేనా?
ఆన్లైన్లో ఎన్నో ఫొటోలు. అన్నీ అసలువే కాకపోవచ్చు. కొన్ని నకిలీ ఫొటోలూ ఉండొచ్చు. కృత్రిమ మేధ సృష్టిస్తున్న ఫొటోలతో ఈ బెడద మరింత ఎక్కువైంది కూడా. -
కీబోర్డు మీద వేళ్ల ప్రయాణం!
కీబోర్డు మీద చకచకా టైప్ చేస్తుంటాం గానీ ఆ సమయంలో చేతి వేళ్లు ఎంత దూరం ప్రయాణించాయో ఎప్పుడైనా లెక్కించారా? చేతి వేళ్లు ప్రయాణించటమేంటని అనుకుంటున్నారా? మరేమీ లేదు. -
వినూత్నం మృదు రోబో
ఎటంటే అటు వంగే మృదువైన రోబోల విషయంలో నార్త్ కరోలీనా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గొప్ప పురోగతిని సాధించారు. ట్విస్టెట్ రింగ్‌బాట్స్‌ను రూపొందించి సంచలనం సృష్టించారు. -
ఫోన్ బ్యాటరీ ఎన్నిసార్లు ఛార్జ్ అవుతుంది?
స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ పూర్తిగా.. అంటే 0 నుంచి 100% వరకు ఎన్నిసార్లు ఛార్జ్ అవుతుంది? ఎవరు లెక్కపెట్టొచ్చారని పెదవి విరవకండి. దీని గురించి తెలిస్తే బ్యాటరీ ఎక్కువ కాలం మన్నేలా కాపాడుకోవచ్చు మరి
తాజా వార్తలు (Latest News)
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
2026 నాటికి ఎయిర్‌ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!