Jio 5G Phone: జియో 5జీ ఫోన్.. పేరు, ఫీచర్లు ఇవేనా..?

జియో కంపెనీ 5జీ స్మార్ట్‌ఫోన్‌ పేరును ఖరారు చేసినట్లు నెట్టింట చర్చ జరుగుతోంది. మరి, జియో 5జీ ఫోన్‌ పేరు ఏంటి? ఇందులో ఎలాంటి ఫీచర్లు ఉంటాయనే వివరాలు...

Published : 30 Sep 2022 21:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో 5జీ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబరు 1న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో జియో 5జీ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. టెక్‌వర్గాల విశ్వనీయ సమాచారం ప్రకారం జియో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ‘గంగా’ పేరుతో తీసుకొస్తున్నారట! మరోవైపు గంగా అనేది కేవలం ఫోన్ కోడ్‌నేమ్‌ మాత్రమేనని, దీపావళికి ఈ ఫోన్‌ను విడుదల చేస్తారని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఎల్‌వైఎఫ్‌ కంపెనీతో కలిసి జియో 5జీ ఫోన్‌ను తీసుకొస్తోంది. ప్రస్తుతం 4జీలో ఉన్న వినియోగదారులకు 5జీ నెట్‌వర్క్‌ను చేరువచేయడమే లక్ష్యంగా జియో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు ఇప్పటికే స్పష్టంచేసింది. జియో 5జీ స్మార్ట్‌ఫోన్ ధర ₹ 8 వేల నుంచి ₹ 12 వేల మధ్య ఉంటుందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

ఈ ఫోన్‌లో 90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.5 అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ డిస్‌ప్లే ఇస్తున్నారట. స్నాప్‌డ్రాగన్‌ 480 ప్రాసెసర్‌ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఫోన్ వెనుకవైపు 13 ఎంపీ ప్రైమరీ కెమెరాతో పాటు, 2 ఎంపీ కెమెరా ఉంటుందని సమాచారం. వీడియో కాలింగ్, సెల్ఫీల కోసం ముందు 8 ఎంపీ కెమెరా ఇస్తున్నారట. ఆండ్రాయిడ్ 12 ఆధారిత ప్రగతి ఓఎస్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది. వెనుక లేదా సైడ్‌లో ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ ఉంటుందని టెక్‌ వర్గాలు తెలిపాయి. ఆల్వేస్‌ ఆన్‌ గూగుల్‌ అసిస్టెంట్‌, గూగుల్‌ లెన్స్‌, ట్రాన్స్‌లేట్‌ లాంటి గూగుల్‌ యాప్స్‌ ఇన్‌బిల్ట్‌గా ఇస్తున్నారట. అలాగే మై జియో, జియో టీవీ వంటి వాటితోపాటు ఉచితంగా ఇతర జియో యాప్స్‌ కూడా ఉంటాయి. 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 18 వాట్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. 4 జీబీ ర్యామ్‌, 32 జీబీ అంతర్గత స్టోరేజీ వేరియంట్లో తీసుకొస్తున్నారట. డ్యూయల్‌ సిమ్‌, మెమొరీ కార్డు ఆప్షన్‌ ఇస్తున్నట్లు సమాచారం.

Read latest Technology News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts