AYYA T1: ఐఫోన్‌కు దీటుగా రష్యా కొత్త ఫోన్‌.. పేరేంటంటే?

స్వదేశీ స్మార్ట్‌ఫోన్ ‘అయ్య టీ1 (AYYA T1)’ను తీసుకొస్తున్నట్లు రష్యా వెల్లడించింది.

Updated : 11 May 2022 18:46 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్యను వ్యతిరేకిస్తూ యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, శాంసంగ్‌ కంపెనీలు తమ ఉత్పత్తులను, సర్వీసులను రష్యాలో పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా రష్యా వీటికి దీటుగా ఓ కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. తమ దేశ పౌరుల కోసం స్వదేశీ స్మార్ట్‌ఫోన్ ‘అయ్య టీ1 (AYYA T1)’ను తీసుకొస్తున్నట్లు రష్యా వెల్లడించింది. ఈ స్మార్ట్‌ఫోన్లను స్కేల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన అనుబంధ సంస్థ స్మార్ట్‌ ఇకో సిస్టమ్ కంపెనీ అభివృద్ధి చేస్తోందని తెలిపింది. ఐఫోన్లకు బదులు ‘అయ్య టీ1’ స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించాలని తమ దేశ పౌరులను రష్యా కోరడం గమనార్హం.

ఇది అత్యంత నమ్మదగిన ఫోన్ అని రష్యన్ స్టేట్ డూమా సభ్యులు మరియా బుటినా, డెనిస్ మైదానోవ్ తమ దేశ పౌరులకు సూచించారు. ‘అయ్య టీ1’ స్మార్ట్‌ఫోన్‌లలో యూజర్స్‌పై ఇతరులు నిఘా పెట్టకుండా ఉండడానికి కెమెరాలు, మైక్రోఫోన్‌ను టర్న్‌ ఆఫ్ చేసేలా ప్రత్యేక హార్డ్‌వేర్ బటన్ తీసుకొస్తున్నట్లు సమాచారం. దీని విలువ సుమారు 15-19 వేల రూబెల్స్‌ ఉంటుందని తెలుస్తోంది.

ఫీచర్లు ఇవే..

అయా టీ1 స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్‌ హిలీయో పీ70 ప్రాసెసర్‌ను ఉపయోగించినట్లు సమాచారం. 60 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.5 అంగుళాల డిస్‌ప్లే ఇస్తున్నారు. 4జీబీ ర్యామ్‌, 64జీబీ స్టోరేజీ, 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతో ఇది పనిచేస్తుంది. రెండు ప్రధాన కెమెరాలు 12ఎంపీ, 5ఎంపీ డిజిటల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌తో తీసుకొస్తున్నారు. ఇందులో ఆండ్రాయిడ్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ను ఉపయోగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని