సురక్షితమైన సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోండిలా..!
మనిషి బతకాలంటే హృదయ స్పందన ఎంత ముఖ్యమో.. కంప్యూటర్, లాప్‌ట్యాప్‌లు సాఫీగా రన్ అవ్వాలంటే...
ఇంటర్నెట్ డెస్క్: మనిషి బతకాలంటే హృదయ స్పందన ఎంత ముఖ్యమో.. కంప్యూటర్, లాప్‌ట్యాప్‌లు సాఫీగా రన్ అవ్వాలంటే సాఫ్ట్వేర్ అంతే కీలకం. మరి అలాంటి సాఫ్ట్వేర్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అలానే సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేసుకోవడంలో ఎంతో జాగ్రత్త వహించాలి. అనేక రకాల వెబ్సైట్లు వైరస్‌లతో కూడిన సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌లను అప్లోడ్ చేస్తూ ఉంటాయి. ఉచితంగా వస్తున్నాయి కదా.. అని తొందరపడితే సమాచారం మొత్తం సైబర్ నేరగాళ్లకు చేరిపోతుంది. విండోస్ కోసం ఉచితంగా దొరికే సురక్షితమైన కొన్ని సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం... అయితే వాటిని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాల్సిందే..
క్రోమియం బేస్డ్ బ్రౌజర్‌గా..
విండోస్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్‌ను చాలా వెబ్సైట్లు అందిస్తుంటాయి. అయితే భద్రమైన సోర్స్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటేనే ఉత్తమం. లేకపోతే మాల్వేర్, యాడ్వేర్తోపాటు ఇతర వైరస్లు దాడి చేసే అవకాశం ఉంటుంది. అధికారిక వెబ్సైట్ల హోంపేజీల్లో దొరికే సాఫ్ట్వేర్ అప్లికేషన్స్‌ను క్లిక్ చేస్తే చాలు మాల్వేర్ వచ్చిపడిపోతుంది. అయితే ఒపెరా (Opera) సాఫ్ట్వేర్ వీటికి భిన్నంగా ఎంతో సురక్షితమైనది. క్రోమియం బేస్డ్ బ్రౌజర్ అయిన ఒపెరాను మైక్రోసాఫ్ట్ విండోస్, ఆండ్రాయిడ్, ఐవోఎస్ మాక్ఓఎస్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో వినియోగించవచ్చు. మొబైల్ వెర్షన్స్ ఒపెరా, ఒపెరా టచ్, ఒపెరా మినితోపాటు అనేక బ్రౌజర్లను ఒపెరా విడుదల చేసింది. డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి
చాలా సులువుగా ఎంచుకునే అవకాశం..
విండోస్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసేందుకు నైనైట్ (Ninite) చాలా సులువుగా ఉపయోగపడుతుంది. సాఫ్ట్వేర్ అప్లికేషన్స్‌లో ఉండే ప్రోగ్రామ్‌ల జాబితాను నైనైట్ అందిస్తుంది. అందులో మనకు కావాల్సిన యాప్స్‌కు సంబంధించిన వివరాలను చెక్ చేసుకుని డౌన్లోడ్ బటన్ నొక్కేయడమే. దీంతో ఎంచుకున్న ప్రోగ్రామ్స్ ఫైల్స్ బల్క్‌గా డౌన్లోడ్ అయి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నైనైట్ సాఫ్ట్‌వేర్‌లో సమాచార రక్షణ, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అవనసరమైన టూల్‌బార్స్, జంక్ ఫైల్స్, బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే వాటిని డిక్లేన్ చేసేస్తుంది. ప్రతిసారి నెక్ట్స్‌ను క్లిక్ చేయాల్సిన అవసరం ఉండదని టెక్ నిపుణులు పేర్కొన్నారు. దీంతో మాల్వేర్ సమస్య ఉండదు. ఒరిజినల్ సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటే ఏదైనా అప్డేట్ అవుతుంది. డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి
ప్రతి రోజూ అప్డేట్ అవుతూనే..
అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న సాఫ్ట్వేర్లలో సాఫ్ట్పిడియా(Softpedia) ఒకటి. దాదాపు మూడు వందల కోట్లకుపైగా డౌన్లోడ్లు అయినట్లు టెక్ వర్గాలు పేర్కొన్నాయి. సాఫ్ట్‌వేర్‌తోపాటు వచ్చే అన్ని అప్లికేషన్స్ ప్రతి రోజూ అప్డేట్ అవుతూనే ఉంటాయి. ఇలాంటి సమయంలోనూ మాల్వేర్రహిత సాఫ్ట్వేర్ సేవలను సాఫ్ట్పిడియా అందిస్తుండటం విశేషం. ఈజీ టు యూజ్ ఇంటర్ఫేస్ ఉండటంతో ఏ ప్లాట్ఫామ్పైనైనా సులువుగా బ్రౌజింగ్ చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో అప్డేట్ అయిన వాటిని బ్రౌజ్ చేయడం లేదా కేటగిరీలు, లాస్ట్ అప్డేటెడ్, విలువ ఆధారంగా శోధించే అవకాశం ఉంది. విండోస్తోపాటు మాక్, లైనక్స్, ఆండ్రాయిడ్ యాప్స్‌లోనూ వినియోగించుకోవచ్చు. డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి
విరివిగా వినియోగం..
ప్రస్తుత కాలంలో ఫైల్‌హిప్పో (FileHippo) సాఫ్ట్‌వేర్‌ను విరివిగా వినియోగించడం జరుగుతోంది. వందలాది యాక్టివ్ ప్రోగ్రామ్స్‌ను వివిధ కేటగిరీల్లో అందిస్తుంది ఫైల్‌హిప్పో సాఫ్ట్వేర్. సాఫ్ట్‌వేర్‌ను అప్లోడ్ చేసేటప్పుడు ఇతర అప్లికేషన్స్ గురించి అడుగుతుంది. స్పష్టంగా లేబుల్ చేసి ఉండటం వల్ల సులువుగా స్కిప్ చేసేసి సాఫ్ట్‌వేర్‌ను డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఫైల్‌హిప్పో యూజర్లకు మరొక మంచి అవకాశం కల్పించింది. సాఫ్ట్వేర్ ఓల్డ్ వెర్షన్స్ కూడా ఆఫర్ చేయడం విశేషం. సాధారణంగా భద్రతా కారణాలరీత్యా ఔట్‌డేటెడ్ వెర్షన్స్ ఇన్స్టాల్ చేసుకోవడానికి ఆసక్తి చూపరు. అయితే ఇందులోనూ ఉపయోగకరమైన అంశం ఏంటంటే.. లేటెస్ట్ వెర్షన్‌తో ఏమైనా సమస్యలు తలెత్తితే పాత వెర్షన్‌ను వినియోగించుకునే అవకాశం ఉంది. డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి
డౌన్లోడ్ క్ర్యూ (Download Crew)
పూర్తి సమాచారం అంతా షార్ట్కట్లోనే డౌన్లోడ్ క్ర్యూ (Download Crew) వెబ్సైట్లో తెలియజేయడం విశేషం. డిస్క్రిప్షన్లో ఇచ్చే వివరాలన్నీ యూజర్లు రాసినవే. వెండర్స్ వెబ్సైట్ నుంచి కాపీ అండ్ పేస్ట్ కాకుండా నిక్కచ్చిగా నిజమైన యూజర్ల నుంచి అప్డేషన్స్ తీసుకోవడం విశేషం. వెబ్సైట్ టాప్‌లో కేటగిరీల వారీగా విండోస్, మాక్, లైనక్స్, ఐఫోన్, ఆండ్రాయిడ్ వంటివి కనిపిస్తాయి. ఉదాహరణకు విండోస్‌ను క్లిక్ చేయగానే ఫీచర్డ్ డౌన్లోడ్స్ కనిపిస్తుంది. ఏ రకమైన అప్లికేషన్స్నైనా విడివిడిగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి
సులువుగా.. వేగవంతంగా..
FileHorse సాఫ్ట్‌వేర్‌కు భారీ రిపోజిటరీ లేనప్పటికీ ఉత్తమమైన, ఉపయోగకరమైన ప్రోగ్రామ్‌లను నిల్వ చేయడంపై దృష్టిసారించింది. ప్రతి పేజీకి స్క్రీన్‌షాట్స్ ఉంటాయి. కాబట్టి యూజర్‌కు ఏమి కావాలో, వెర్షన్ గురించి వివరణ, మార్పులు, ఓల్డ్ వెర్షన్స్‌కు లింకులు వంటివి ఎన్నో తెలుసుకోవచ్చు. హోంపేజీలో లేటెస్ట్గా వచ్చిన సాఫ్ట్వేర్లు, ఎక్కువగా డౌన్లోడ్ అయిన సాఫ్ట్వేర్లను తెలియజేస్తుంది. అలాగే బ్రౌజర్స్, యాంటీ స్పేవేర్, ఎంపీ 3 అండ్ ఆడియో వంటి కేటగిరీలవారీగా కనిపిస్తాయి. డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి
ఫైల్‌పుమా (FilePuma)
ప్రాథమిక ఇంటర్ఫేస్ సులువుగా, సరళంగా ఉండేలా ఫైల్‌పుమా దృష్టి పెట్టింది. మీకు ఆసక్తిగా ఉండే సాఫ్ట్వేర్ అప్డేట్స్ను ఈజీగా ఎంచుకోవచ్చు. సాఫ్ట్వేర్లకు సంబంధించి అనేక కేటగిరీలు ఉన్నాయి. ప్రాచుర్యం పొందిన సాఫ్ట్వేర్లన్నీ హోంపేజీలోనే కనిపిస్తుండటం విశేషం. ఓల్డ్ వెర్షన్స్, స్క్రీన్‌షాట్స్ అనేవి ఉన్నాయి. అప్డేట్ డిటెక్టర్ అనే ఫీచర్ ఫైల్‌పుమా ప్రత్యేకం. వ్యక్తిగత కంప్యూటర్లలో సాఫ్ట్వేర్ కోసం ఇన్స్టాల్ అప్డేషన్ను చెక్ చేయడం సులువవుతుంది. అయితే విండోస్ 10కి అందుబాటులో లేకపోవడం గమనార్హం. డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి
ఇతర సైట్లలానే.. కాకపోతే కాస్త స్పెషల్
ఫీచర్ల పరంగా SnapFiles కూడా ఇతర సాఫ్ట్వేర్ డౌన్లోడ్ సైట్ల మాదిరిగా ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేకతలు దీనికి అదనపు ఆకర్షణలు తెచ్చాయి. అందులో ఒకటి ఫ్రీవేర్ పిక్.. దీని ద్వారా కంప్యూటర్లోని ఫైల్స్‌ను, ఫోల్డర్లను వేగంగా కనిపెట్టవచ్చు. అదేవిధంగా హోంపేజీలో మోర్ ఆప్షన్‌ను క్లిక్‌చేస్తే కొన్ని కేటగిరీలు కనిపిస్తాయి. ఇందులోని ర్యాండమ్ పిక్ ఆప్షన్ కూడా ఫైల్స్, ఫోల్డర్లను శోధనకు పనికొస్తుంది. ఆప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోకుండానే రన్ చేసుకోవాలంటే పోర్టబుల్ యాప్స్ ఆప్షన్ ఉపయోగపడుతుంది. డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి
మైక్రోసాఫ్ట్ కోసం..
మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత కంప్యూటర్ రంగంలో ఎన్నో పెనుమార్పులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే విండోస్ 10, మోడ్రన్ యాప్ప్ కోసం ప్రత్యేకంగా మైక్రోసాఫ్ట్ స్టోర్ ఉన్నప్పటికీ అంత ప్రభావవంతంగా లేవని టెక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే ఇందులో కొన్ని ప్రయోజనాలు లేకపోలేదు. స్టోర్ అప్లికేషన్స్ వాటంతటవే అప్డేట్ అవుతుంటాయి. అవి శాండ్బాక్స్డ్ కావడంతో సిస్టమ్‌లోని ఇతరవాటిలోకి చొరబడువు. మైక్రోసాఫ్ట్ స్టోర్‌లో ఇష్టమైన అప్లికేషన్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకుని డౌన్లోడ్ చేసుకోవడం ఉత్తమం. డౌన్లోడ్ కోసం క్లిక్ చేయండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మానవ రోబో దండు!
రోబో అనగానే ఏం గుర్తుకొస్తుంది? లోహ చట్రంతో కదిలే మర యంత్రమో, కదిలే లోహం బొమ్మో మదిలో కదలాడుతుంది. రబ్బరు కండరాలతో చేసినదైతే మనిషి మాదిరిగానూ కనిపిస్తుంది. చూపు, మాట మనిషిని పోలి ఉంటాయి. -
paul alexander: ఇనుప ఊపిరితిత్తి!
ఓ పొడవైన పెట్టె. శరీరమంతా అందులోనే. తల మాత్రమే బయటకు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 72 ఏళ్లు అందులోనే గడిపితే? అమెరికాకు చెందిన పాల్ అలెగ్జాండర్ అలాగే గడిపారు -
గూగుల్ సెర్చ్ తెలివిగా..
స్మార్ట్ఫోన్లలో గూగుల్ సెర్చ్‌ను వాడనివారుండరంటే అతిశయోక్తి కాదు. కానీ తేలికగా, త్వరగా ఆయా అంశాలను శోధించటానికి కొన్ని చిట్కాలు ఉన్నాయనే సంగతి తెలుసా? అలాంటి కొన్ని ఉపాయాల గురించి తెలుసుకుందాం. -
భళారే డిజిటల్ విచిత్రం!
ఒకప్పటి కన్నా స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల సామర్థ్యం, వేగం పుంజుకున్న మాట నిజం. కానీ ఆకారంలో పెద్దగా మారింది లేదు. ఒకసారి అంచులు చిన్నగా.. మరోసారి కెమెరా బంప్‌లు పెద్దగా ఉండటం తప్పించి దాదాపు అలాగే కనిపిస్తుంటాయి. -
కృత్రిమ మేధ గుండె కాయ
కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ.. కృత్రిమ మేధ. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఎక్కడ చూసినా ఈ పేరే మార్మోగుతోంది. -
ఇక ఏఐ సినిమా!
పదాల కూర్పు ఆధారంగా చిటికెలో ఫొటోలు, చిత్రాలు, సంగీతం, పాటలను పుట్టిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) మరో అడుగు ముందుకేసింది. ఏకంగా వీడియోలనూ సృష్టించే స్థాయికి చేరుకుంది. విప్లవాత్మక ఛాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్ఏఐ సంస్థ కొత్తగా తీసుకొచ్చిన జనరేటివ్ కృత్రిమ మేధ (జెన్ఏఐ) మోడలే దీనికి నిదర్శనం. -
ఈ విశ్వ కిరణాలు..
విశ్వ కిరణాలు.. కాస్మిక్ రేస్. అంతరిక్షం ఆవలి నుంచి దూసుకొచ్చే ఇవి నిరంతరం అతి వేగంగా.. దాదాపు కాంతి వేగంతో సమానంగా విశ్వమంతటా ప్రయాణిస్తుంటాయి. వీటి మీద మొదటి నుంచీ శాస్త్రవేత్తలకు ఎంతో ఆసక్తి. ఎందుకంటే అంతరిక్షంలో పుట్టుకొచ్చిన చోటు, ఢీకొట్టిన వస్తువులను బట్టి ఇవి విశ్వానికి సంబంధించిన ఎన్నో విషయాలను వివరిస్తాయి. -
ప్రేమ శాస్త్రం!
ప్రేమ ఎందుకు పుడుతుందో, ఎవరి మీద పుడుతుందో తెలియదు. ఒకరికి నచ్చిన వ్యక్తి మరొకరికి నచ్చకపోవచ్చు. ఒకరికి అసలే నచ్చనివారు మరొకరికి ప్రాణం కన్నా మిన్నగా అనిపించ్చొచ్చు. -
ఫోల్డర్ మాయలు
విండోస్ పీసీలో రోజూ ఫోల్డర్లను వాడుతూనే ఉంటాం. కొత్త ఫైళ్లను స్టోర్ చేయటం, డేటాను వరుసగా పెట్టుకోవటం.. ఇలా ఎన్నింటికో వీటిని ఉపయో గిస్తుంటాం. మరి అదృశ్య ఫోల్డర్‌ను సృష్టించుకోగలరా? ఒకేసారి బోలెడన్ని ఫోల్డర్ల పేర్లను మార్చుకోగలరా? ఖాళీ ఫోల్డర్లను గుర్తించగలరా? ఇలాంటి కొన్ని చిత్రమైన ఫోల్డర్ చిట్కాల గురించి తెలుసుకుందాం. -
అమెజాన్ అడుగున బంగారు నేల
అమెజాన్ అనగానే దట్టమైన అడవులే గుర్తుకొస్తాయి. మనుషులు దూరటానికి వీల్లేని అక్కడ ఒకప్పుడు పెద్ద పట్టణమే ఉండేదని ఇటీవల తేలటం అందరినీ ఆశ్చర్యపరచింది -
ఏఐ టెక్కులు!
అసలే కృత్రిమ మేధ (ఏఐ) యుగం. ఆపై ప్రపంచంలోనే అతి పెద్ద ఎలక్ట్రానిక్ వస్తు ప్రదర్శన. ఇక చెప్పేదేముంది? ఏ పరికరాన్ని చూసినా ఏఐమయమే. హెల్త్ ట్రాకర్ల దగ్గరి నుంచి వాహనాల వరకూ అన్నింటికీ అదే ఆలంబన. -
Cyber Crime: నయా సైడర్!
నేటి సైబర్ యుగంలో నేరాలూ మారిపోతున్నాయి. ఆన్లైన్ మోసాలు కోకొల్లలు. డెబిట్, క్రెడిట్ కార్డు వివరాలు చోరీ చేసి మన ప్రమేయమేమీ లేకుండానే నేరగాళ్లు షాపింగ్ చేయటం తెలిసిందే -
కొత్త టెక్ లోకం
డిజిటల్ పరిణామం ఆగేది కాదు. ఇదో నిరంతర ప్రక్రియ. గత ఏడాదిని గతి తిప్పిన ట్రెండ్స్ కొత్త సంవత్సరాన్నీ పరుగులు తీయించనున్నాయి. మెషిన్ ఇంటెలిజెన్స్ జోరందుకోనుంది. వాస్తవ, కాల్పనిక ప్రపంచాల మధ్య హద్దులు చెరగటం ఖాయంగా కనిపిస్తోంటే.. నిరంతర అంతర్జాల పరిణామ ప్రక్రియ మన జీవితాలను గణనీయంగా శాసించేలా రూపుదిద్దుకుంటోంది. -
ఇస్రో ఏఐ వత్సరం 2024
ఇది మనదేశం జాబిల్లిని తాకి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచిన సంవత్సరం.ఇది కృత్రిమ మేధ ప్రయోగశాలలను దాటుకొని నిత్య జీవన వ్యవహారాల్లోకి విరివిగా చొచ్చుకొచ్చిన సంవత్సరం.శాస్త్ర, సాంకేతిక రంగాలు ఒకదాంతో మరోటి పోటీ పడుతూ కొత్త వత్సరంలోకి అడుగిడుతున్న వేళ సాధించిన ఘనతలను సమీక్షించుకోవటం ముదావహం. -
స్థానిక మేధ
కృత్రిమ మేధ (ఏఐ) తీరు మారుతోంది. ఆంగ్లం గడపను దాటుకొని స్థానిక భాషలపై దృష్టి సారిస్తోంది. ఆయా భాషల వైవిధ్యం, యాసలు, సంస్కృతులకు అనుగుణంగా రూపాంతరం చెందుతోంది. -
గాజు బిందువు ఇంద్రజాలం
ఎప్పుడైనా గాజు కన్నీటి చుక్కల గురించి విన్నారా? అవి స్టీలు కన్నా దృఢంగా ఉంటే? బుల్లెట్ దెబ్బనైనా తట్టుకుంటే? సైన్స్ సూత్రాలనూ ధిక్కరిస్తే? అంత విచిత్రమైన గాజు బిందువు లేంటని అనుకుంటున్నారా? అవే ప్రిన్స్ రూపర్ట్స్ డ్రాప్స్. -
వృక్షో రక్షతి రక్షితః
జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన ఛార్లెస్ డార్విన్ అప్పుడెప్పుడో కన్న కల ఎట్టకేలకు సాకారమైంది. ప్రపంచంలో మనకు తెలిసిన అన్ని మొక్కల జాబితాను రూపొందించాలనే ఆయన ఆశయాన్ని రాయల్ బొటానిక్ గార్డెన్స్ ఇటీవల సాకారం చేసింది. -
వాతావరణతరంగ శోధన
భూమి, అంతరిక్ష వాతావరణం మధ్య జరిగే చర్యల మీద అధ్యయనం చేయటం దీని ఉద్దేశం. -
ఏఐయ్యారే!
సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఛాట్‌జీపీటి సమస్త సమాచార సారాంశాన్ని చిటికెలో ముందుంచుతోంది. -
వర్షం కృత్రిమం
ఉక్కపోస్తే ఫ్యాన్ వేసుకుంటాం. చుట్టుపక్కల గాలిని మనవైపు తిప్పుకొంటాం. ఇంట్లో ఉష్ణోగ్రత పెరిగితే ఏసీ వేసుకుంటాం. వేడి గాలిని చల్లబరచి హాయిని అనుభవిస్తాం -
Phone Hacking: ఫోన్ హ్యాక్ అయ్యిందా?
ప్రభుత్వ ప్రాయోజిత అటాకర్లు ఐఫోన్ల మీద దాడి చేసే అవకాశముందని ఇటీవల యాపిల్ సంస్థ ప్రముఖ ప్రతిపక్ష నేతలు, పాత్రికేయులను హెచ్చరించటం తీవ్ర కలకలం సృష్టించింది. ఒక్క మనదేశానికి చెందినవారికే కాదు.. 150 దేశాల్లోకి వ్యక్తులకూ ఈ నోటిఫికేషన్లు అందాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం యాపిల్‌కు నోటీసులు జారీ చేసి, వివరణ కోరింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
పెద్దిరెడ్డికి ఇసుకే అల్పాహారం.. మైన్స్ మధ్యాహ్న భోజనం: చంద్రబాబు
-
జాన్వీతో రామ్ చరణ్ సినిమా.. ఏడేళ్ల క్రితమే కోరిక బయటపెట్టిన చిరంజీవి
-
దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది ‘రాజకీయ ప్రతీకారమే’ - ఆప్
-
మథుర కాకపోతే పోటీ చేసేదాన్ని కాదు : హేమమాలిని
-
ఆరు నెలల్లో.. రూ.7.5 లక్షల కోట్ల రుణానికి కేంద్రం సిద్ధం