గూగుల్, ఒప్పోకు శాంసంగ్ సాయం..!

భవిష్యత్తు అవసరాల కోసం కొన్ని సార్లు దిగ్గజ కంపెనీలు కలిసి పనిచేస్తుంటాయి. ప్రస్తుతం శాంసంగ్‌, గూగుల్, ఒప్పో కంపెనీలు ఇదే బాటలో నడుస్తున్నాయి. గూగుల్‌తో పాటు ఒప్పో, షావోమి కంపెనీలకు కూడా శాంసంగ్ ఫోల్డింగ్ డిస్‌ప్లేను తయారుచేస్తుందట.... 

Updated : 12 Aug 2022 12:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భవిష్యత్తు అవసరాల కోసం కొన్ని సార్లు దిగ్గజ కంపెనీలు కలిసి పనిచేస్తుంటాయి. ప్రస్తుతం శాంసంగ్‌, గూగుల్, ఒప్పో కంపెనీలు ఇదే బాటలో నడుస్తున్నాయి. గతేడాది గెలాక్సీ జెడ్ ఫోల్డ్‌ 2, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ ఫోల్డింగ్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది శాంసంగ్. ఒప్పో కూడా ఫోల్డింగ్, రోలింగ్ డిస్‌ప్లేతో ఫోన్లను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. గూగుల్ సైతం ఫోల్డింగ్ ఫోన్‌ తయారీలో పెట్టుబడులు పెడుతున్నట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో గూగుల్ ఫోల్డింగ్ ఫోన్ కోసం శాంసంగ్ ప్రత్యేకంగా 7.6-అంగుళాల ఫోల్డింగ్ డిస్‌ప్లే తయారుచేస్తున్నట్లు సమాచారం. ఇది గెలాక్సీ జెడ్ సిరీస్‌ పోల్డింగ్ ఫోన్ డిస్‌ప్లే తరహాలో ఉంటుందని తెలుస్తోంది.  

గూగుల్‌తో పాటు ఒప్పో, షావోమి కంపెనీలకు కూడా శాంసంగ్ ఫోల్డింగ్ డిస్‌ప్లేను తయారుచేస్తుందట. ఒప్పో ఫోల్డింగ్ డిస్‌ప్లే పై నుంచి కింది వరకు పూర్తిగా మడతపెట్టేలా ఉంటుంది. ఇటీవలే దీనికి సంబంధించిన వీడియో టీజర్‌ను ఒప్పో విడుదల చేసింది. ఈ డిస్‌ప్లే అన్‌ఫోల్డ్ చేసినప్పుడు 7.7-అంగుళాలు, ఫోల్డ్ చేసినప్పుడు 1.5-అంగుళాలు ఉంటుంది. షావోమి ఫోల్డింగ్ డిస్‌ప్లేలో లోపలి స్క్రీన్‌ 8.03-అంగుళాలు, వెలుపలి స్క్రీన్‌ 6.38-అంగుళాలు ఉంటుందని సమాచారం. మూడు కంపెనీల ఫోల్డింగ్ ఫోన్లలను ఈ ఏడాడి చివర్లో కానీ, వచ్చే ఏడాది ప్రథమార్ధంలో కానీ విడుదల చేస్తారని తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని