Smart Mobiles: శాంసంగ్‌ సరికొత్త ట్యాబ్స్‌, వీవో 5జీ మొబైల్‌ వచ్చేశాయ్‌.. ధర, ఫీచర్లివే..!

శాంసంగ్‌ నుంచి ఫ్లాగ్‌షిప్ రేంజ్‌లో సరికొత్త ట్యాబ్‌ సిరీస్‌, వీవో 5జీ మొబైల్‌ ఇవాళ విడుదలయ్యాయి. వీటి ధరను..  

Updated : 21 Feb 2022 19:40 IST

ప్రముఖ కంపెనీ శాంసంగ్‌ నుంచి ఫ్లాగ్‌షిప్ రేంజ్‌లో సరికొత్త ట్యాబ్‌ సిరీస్‌.. మిడ్‌ రేంజ్‌లో వీవో 5జీ మొబైల్‌.. బడ్జెట్‌ ధరలో డీజో నెక్‌బ్యాండ్‌ ఇవాళ భారత మార్కెట్‌లో విడుదలయ్యాయి. మరి వీటి ఫీచర్లేంటి, ధరెంతో తెలుసుకుందాం.. రండి..

ఇది సెల్ఫీ స్పెషల్‌

వీవో కంపెనీ V23 సిరీస్‌లో ‘వీవో వీ23ఈ (Vivo V23e)’ పేరిట కొత్త 5జీ మొబైల్‌ను ఇవాళ లాంచ్‌ చేసింది. 44MP ఫ్రంట్ కెమెరా, ట్రిపుల్‌ రియల్‌ కెమెరా సెటప్‌ (50MP ప్రధాన, 8MP అల్ట్రావైడ్‌, 2MP మాక్రో షూటర్‌)‌, ఆండ్రాయిడ్‌ 12 ఓఎస్‌, వాటర్‌డ్రాప్‌-స్టైల్‌ 6.44 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే, మీడియాటెక్‌ డైమెన్సిటీ 810 ప్రాసెసర్‌తో ఇది లభిస్తుంది. 8జీబీ ర్యామ్‌/ 128 జీబీ స్టోరేజీతో పాటు 44W ఫాస్ట్ ఛార్జింగ్‌, 4,050mAh బ్యాటరీకి మద్దతిస్తుంది. ఫోన్ అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో వచ్చే ఈ కొత్త మొబైల్‌.. మిడ్‌నైట్ బ్లూ, సన్‌షైన్‌ గోల్డ్‌ రంగుల్లో అందుబాటులో ఉంది.

వీవో ఇండియాతో పాటు ప్రముఖ రిటైల్‌ స్టోర్‌లలో ఈ కొత్త మొబైల్‌ అమ్మకాలు ప్రారంభమయ్యాయని కంపెనీ తెలిపింది. ప్రారంభ ధర రూ.25,990గా ఉండగా, లాంచ్‌ ఆఫర్‌ కింద ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డును ఉపయోగించి గరిష్ఠంగా 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు.


గేమ్ మోడ్‌లో డీజో నెక్‌బ్యాండ్

డిజో కంపెనీ తన కొత్త నెక్‌బ్యాండ్ ఇయర్‌ఫోన్‌లను భారత్‌లో విడుదల  చేసింది. ‘డిజో వైర్‌లెస్ పవర్ (Dizo Wireless Power)’గా వీటికి నామకరణం చేసింది. సెంట్రిక్ ఆడియో డ్రైవర్‌లు, బ్లూటూత్ ఫాస్ట్ పెయిర్ టెక్నాలజీతో ఇది లభిస్తుంది. శ్రవణ అనుభావాన్ని మరింత మెరుగుపరచడానికి Bass Boost+ అల్గారిథమ్,  88mm సూపర్ లేటెన్సీ గేమ్ మోడ్‌తో దీనిని తీసుకొచ్చారు. 150mAh బ్యాటరీ కారణంగా ఒక్కసారి ఛార్జ్ చేస్తే 18 గంటల ప్లేబ్యాక్ సంగీతాన్ని ఈ నెక్‌బ్యాండ్ అందించగలదని డిజో పేర్కొంది.

ఈ నెక్‌బ్యాండ్‌ అసలు ధర రూ.1,399 ఉండగా, పరిచయ ఆఫర్‌ కింద రూ.999కే లభించనుంది. వైలెట్ బ్లూ, హంటర్ గ్రీన్, క్లాసిక్‌, బ్లాక్ కలర్‌లలో.. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఎంపిక చేసిన రిటైల్ స్టోర్‌లలో డీజో నెక్‌బ్యాండ్‌ను కొనుగోలు చేయకోవచ్చు.


ఒక్కొక్కటిగా ముందుకు..

ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్‌ తన అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్ ‌(ఫిబ్రవరి 9న)లో ఆవిష్కరించిన కొత్త ఉత్పత్తులను ఒక్కొక్కటిగా మన వద్దకు తీసుకొచ్చేస్తోంది. ఇప్పటికే గెలాక్సీ ఎస్‌22 సిరీస్‌లో మూడు మొబైల్‌ వేరియంట్లను భారత్‌లో విడుదల చేసిన కంపెనీ.. తాజాగా ఫ్లాగ్‌షిప్ రేంజ్‌లో ‘గెలాక్సీ ట్యాబ్‌ ఎస్‌ 8’ పేరిట మరో మూడు ట్యాబ్‌లను ఇవాళ లాంచ్‌ చేసింది. వీటిలో గెలాక్సీ ట్యాబ్‌ ఎస్‌8తో పాటు ఎస్‌8+, ఎస్‌8 అల్ట్రా ట్యాబ్లెట్‌లు ఉన్నాయి. ఈ మూడు కూడా స్నాప్‌డ్రాగన్‌ 8 జనరేషన్‌-1 చిప్‌, వన్‌ 4.1 యూఐ ఆండ్రాయిడ్‌ 12 ఓఎస్‌, S-పెన్‌ బండిల్‌తో వస్తున్నాయి.

ప్రత్యేకతలు

శాంసంగ్‌ గెలాక్సీ ట్యాబ్‌ ఎస్‌8 అల్ట్రా (Galaxy Tab S8 Ultra).. 14.6 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో లభిస్తుంది. ముందువైపు రెండు 12MP షూటర్‌లతో పాటు వెనుకల 13MP ప్రధాన, 6MP అల్ట్రా-వైడ్ సూపర్‌ కెమెరాలు ఉన్నాయి. ఇన్‌-స్క్రీన్‌ ఫింగర్‌ ప్రింట్‌ బయోమెట్రిక్‌, 45W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌, 11,200mAh బ్యాటరీ మరిన్ని ప్రత్యేకతలు.  12జీబీ/256 జీబీ స్టోరేజ్‌తో లభించే ఈ మోడల్‌ గ్రాఫైట్‌ రంగులో అందుబాటులో ఉంది.

గెలాక్సీ ట్యాబ్‌ ఎస్‌ 8+ వేరియంట్‌ 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌, 12.4 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తుంది. ముందుభాగంలో ఒకే 12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉంది. వెనుకల ఎస్‌8 అల్ట్రా వలె డ్యూయల్ కెమెరాలతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్, 10,090mAh బ్యాటరీకి మద్దతిస్తుంది. మరోవైపు సైడ్ ఫింగర్ ప్రింట్ రీడర్‌తో కూడినది ట్యాబ్‌ ఎస్ ‌8. ఇది 11 అంగుళాల వాటర్-డౌన్ డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ రెండు వేరియంట్లు 8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌తో అందుబాటులో ఉన్నాయి. 

ధర ఎంతంటే..? 

శాంసంగ్‌ గెలాక్సీ ట్యాబ్‌ ఎస్‌8 వైఫై వేరియంట్‌ ధర రూ.58,999 ఉండగా, 5జీ వేరియంట్‌ ధర రూ.70,999గా ఉంది. అలాగే ట్యాబ్‌ ఎస్‌8+ వైఫై వేరియంట్‌ ధరను కంపెనీ రూ.74,999గా నిర్ణయించిగా, 5జీ వేరియంట్ రూ.87,999కు అందుబాటులో ఉంది. ఇక ట్యాబ్‌ ఎస్‌8 అల్ట్రా వైఫై వేరియంట్‌ ధర రూ.1,08,999ను నిర్ణయించగా, 5జీ ట్యాబ్‌ రూ. 1,22,999కి కొనుగోలు చేయవచ్చు. 

లాంచ్ ఆఫర్‌లు

గెలాక్సీ ట్యాబ్‌ ఎస్‌ 8 సిరీస్‌ ప్రీ-బుకింగ్‌పై రూ.22,999 విలువైన కీబోర్డ్ కవర్‌ బండిల్‌ను ఉచితంగా పొందవచ్చు. Samsung.com వైబ్‌సైట్‌లో ఫిబ్రవరి 22 - మార్చి 10 మధ్య ప్రీ-ఆర్డర్ అందుబాటులో ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కార్డులను ఉపయోగించి ఎస్‌8 అల్ట్రా కొనుగోలుపై  రూ. 10,000, ట్యాబ్‌ ఎస్‌8+పై రూ.8,000, ట్యాబ్ ఎస్‌8పై రూ. 7,000 క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. వీటిపై నో కాస్ట్ ఈఎంఐ కూడా అందుబాటులో ఉన్నాయి.

-ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని