డ్యుయల్ కెమెరాతో శాంసంగ్ బడ్జెట్ ఫోన్

శాంసంగ్ గెలాక్సీ ఎం02 పేరుతో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన గెలాక్సీ ఎం01 మోడల్‌కి కొనసాగింపుగా బడ్జెట్ శ్రేణిలో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇందులో డ్యూయల్‌ కెమెరా, మీడియాటెక్‌ ప్రాసెసర్... 

Updated : 03 Feb 2021 09:29 IST

ఇంటర్నెట్ డెస్క్‌: శాంసంగ్ గెలాక్సీ ఎం02 పేరుతో కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన గెలాక్సీ ఎం01 మోడల్‌కి కొనసాగింపుగా బడ్జెట్ శ్రేణిలో ఈ ఫోన్‌ను తీసుకొచ్చారు. ఇందులో డ్యుయల్‌ కెమెరా, మీడియాటెక్‌ ప్రాసెసర్, హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇస్తున్నారు. పోకో సీ3, రెడ్‌మీ 9, రియల్‌మీ సీ15, మైక్రోమాక్స్‌ ఇన్‌ 1బీలతో గెలాక్సీ ఎం02 పోటీ పడనుంది. ఫిబ్రవరి 9 తేదీ నుంచి అమెజాన్‌, శాంసంగ్ ఆన్‌లైన్‌ స్టోర్లలతో పాటు అన్ని ఆఫ్‌లైన్‌ స్టోర్లలో అమ్మకాలు ప్రారంభంకానున్నాయి.

గెలాక్సీ ఎం02 ఫీచర్లు

ఆండ్రాయిడ్ 10 ఆధారిత వన్‌యూఐ ఓఎస్‌

6.5-అంగుళాల హెచ్‌డీ+ ఇన్ఫినిటీ-వి డిస్‌ప్లే

క్వాల్‌కోమ్ స్నాప్‌డ్రాగన్‌ 450 ప్రాసెసర్‌.

బ్యాక్‌ కెమెరాలు రెండు, ముందు ఒక సెల్ఫీ కెమెరా.

వెనక 13ఎంపీ ప్రైమరీ కెమెరా, 2ఎంపీ మాక్రో కెమెరా.

ముందు భాగంలో 5ఎంపీ కెమెరా. 

5,000 ఎంఏహెచ్ బ్యాటరీ. 

2జీబీ ర్యామ్‌/32జీబీ, 3జీబీ ర్యామ్‌/32జీబీ వేరియంట్లో లభిస్తుంది.

ప్రారంభ ధర రూ. 6,999. బ్లాక్‌, బ్లూ, గ్రే, రెడ్‌ రంగుల్లో ఉంది.

ఇవీ చదవండి..

6K బ్యాటరీ 10K ధరలో పోకో కొత్త ఫోన్‌ 

డేటా ప్రైవసీపై యాపిల్ సీఈవో ఏమన్నారంటే..!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని