గెలాక్సీ ఎఫ్‌ సిరీస్‌లో కొత్త ఫోన్‌.. ఫీచర్లు ఇవే!

ఆన్‌లైన్‌ మార్కెట్ లక్ష్యంగా శాంసంగ్ ఎఫ్‌ సిరీస్‌ ఫోన్లను తీసుకొచ్చింది. ఈ సిరీస్‌లో తొలుత గెలాక్సీ ఎఫ్‌41 మోడల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సిరీస్‌లో గెలాక్సీ ఎఫ్62 మోడల్‌ను తీసుకురానుందట.... 

Published : 05 Feb 2021 22:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆన్‌లైన్‌ మార్కెట్ లక్ష్యంగా శాంసంగ్ ఎఫ్‌ సిరీస్‌ ఫోన్లను తీసుకొచ్చింది. ఈ సిరీస్‌లో తొలుత గెలాక్సీ ఎఫ్‌41 మోడల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే సిరీస్‌లో గెలాక్సీ ఎఫ్62 మోడల్‌ను తీసుకురానుందట. దీనికి సంబంధించిన ఫీచర్స్‌ ప్రస్తుతం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ వివరాలు ఇవే. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యూఐ 3.1తో పనిచేస్తుందట. 6.7-అంగుళాల సూపర్ ఆమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారట. క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్ 765జీ ప్రాసెసర్‌ ఉపయోగించారని సమాచారం. 

ఈ ఫోన్‌లో మొత్తం నాలుగు కెమెరాలు ఇస్తున్నారని టెక్‌ వర్గాలు తెలిపాయి. వెనక 64ఎంపీ ప్రైమరీ కెమెరా, ముందు 32ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటాయట. 7,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారని సమాచారం. 6జీబీ ర్యామ్‌/128జీబీ వేరియంట్లో లభిస్తుందని అంటున్నారు. దీని ధర సుమారు రూ.25,000 వరకు ఉంటుందని మార్కెట్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది. బ్లూ, గ్రీన్‌ రంగులో తీసుకురానున్నారట. యూజర్‌కి ఫ్లాగ్‌షిప్ ఫోన్ అనుభూతిని అందిస్తుందని పలువురు టెక్‌ నిపుణులు ట్వీట్ చేశారు.    

ఇవీ చదవండి..

10 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్‌!

ఫాస్ట్‌ నెట్‌వర్క్‌ ఫీచర్‌తో రియల్‌మీ 5జీ ఫోన్లు.. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని