లోకల్‌గా..

ఏదైనా ట్రెండింగ్‌ ఎలా అవుతుంది? సింపుల్‌.. సోషల్‌ మీడియా వేదికలే! వాట్సాప్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌.. ఇవన్నీ ఇంటర్నేషనల్‌! షేర్‌ఛాట్‌.. పక్కా లోకల్‌! 14 ప్రాంతీయ భాషల్లో హల్‌చల్‌ చేస్తోంది! దేశంలో అత్యంత ఆదరణ పొందిన సోషల్‌ వేదిక కూడా ఇదే! మరి, మాతృభాషలో ఇంతలా ఆకట్టుకుంటున్న షేర్‌ఛాట్‌ ...

Updated : 08 Dec 2022 19:55 IST

 

ఏదైనా ట్రెండింగ్‌ ఎలా అవుతుంది? సింపుల్‌.. సోషల్‌ మీడియా వేదికలే! వాట్సాప్‌, ట్విటర్‌, ఫేస్‌బుక్‌.. ఇవన్నీ ఇంటర్నేషనల్‌! షేర్‌ఛాట్‌.. పక్కా లోకల్‌! 14 ప్రాంతీయ భాషల్లో హల్‌చల్‌ చేస్తోంది! దేశంలో అత్యంత ఆదరణ పొందిన సోషల్‌ వేదిక కూడా ఇదే! మరి, మాతృభాషలో ఇంతలా ఆకట్టుకుంటున్న షేర్‌ఛాట్‌ సంగతులు సంక్షిప్తంగా! 
దిలోని భావాల్ని తెలిపేందుకు భాషే ప్రధానమైంది. నిన్న మొన్నటి వరకూ నెట్టింట్లో ఆంగ్లం ఒక్కటే అధికారిక భాషగా కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడలా కాదు. నెటిజన్లంతా వారి ప్రాంతీయ భాషలకీ మొగ్గు చూపుతున్నారు. అందుకే షేర్‌ఛాట్‌ తక్కువ సమయంలోనే దేశంలో అత్యంత ఆదరణ పొందిన సోషల్‌ వేదిక అయ్యింది.  మొత్తం యూజర్‌ బేస్‌ 3 కోట్లు. ఇప్పటికైతే 42 లక్షల మంది తెలుగు యూజర్లు కంటెంట్‌ని యాక్సెస్‌ చేస్తూ ఇతర సోషల్‌ వేదికలపై పంచుకుంటున్నారు. అమెరికా, దుబాయ్‌, ఆస్ట్రేలియా.. లాంటి ఇతర దేశాల్లోని తెలుగు వారు షేర్‌ఛాట్‌ని వాడుతున్నారు. లోకల్‌గా అయితే రాజమండ్రి, గుంటూరు, విజయవాడ, నల్గొండ, హైదరాబాద్‌ నగరాల్లో ఎక్కువగా యాప్‌ని వాడుతున్నారు. ప్రేమ, రోమాంటిక్‌ కంటెంట్‌కు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. తర్వాత సినిమాలకు సంబంధించిన వాటిని ఎక్కువగా షేర్‌ చేస్తున్నారు.

పోస్ట్‌ చేయండి 
టెక్స్ట్‌ మేటర్‌, వీడియో, ఆడియో, జిఫ్‌లు.. ఇలా ఏవైనా మీదైన శైలిలో క్రియేట్‌ చేసి షేర్‌ చేయొచ్చు. మీలో దాగున్న నైపుణ్యం ఏదైనా చుట్టూ ఉన్నవారితో పంచుకునేందుకు ఇదో చక్కని వేదిక. గృహిణులైనా సరే.. 2, 3 నిమిషాల నిడివితో వంటలకు సంబంధించిన వీడియోలను సృష్టించి పోస్ట్‌ చేయొచ్చు.

క్షణాల్లో ‘ఫాలోయింగ్‌’ 
భాషని ఎంపిక చేసుకుని లాగిన్‌ అయిన మరుక్షణం ‘ఫాలో ఫీడ్‌’లో ఎవ్వరినైనా ఫాలో అవ్వొచ్చు. మీ కాంటాక్ట్‌ల్లోని మిత్రులతో ఛాటింగ్‌ చేయొచ్చు. కొత్త వారితో ఛాట్‌ చేసేందుకు వీలుంది.

ట్రెండింగ్‌ ఏంటి? 
నెటింట్లో హాట్‌ టాపిక్స్‌ ఏంటో తెలుసుకునేందుకు ‘ట్రెండింగ్‌ ఫీడ్‌’ ఉంది. షేర్‌ఛాట్‌లో ట్రెండింగ్‌ అవుతున్న అంశాల్ని మెనూల రూపంలో పొందొచ్చు. హ్యాష్‌ట్యాగ్స్‌తో సందడి చేస్తున్న వాటిని చిటికెలో చూడొచ్చు.

ఖజానే ఉంది 
మీ అభిరుచి మేరకు కావాల్సిన వాటిని బ్రౌజ్‌ చేసి చూసేందుకు ‘సెర్చ్‌’ విభాగం ఉంది. జాబితాగా పలు రంగాలకు సంబంధించిన వాటిని సెలెక్ట్‌ చేసుకోవచ్చు. ఉదాహరణకు ఫ్యాషన్స్‌ సంబంధించిన వాటిని చూసేందుకు ‘ఫ్యాషన్‌ వరల్డ్‌’ ఉంది. టెక్నాలజీ అప్‌డేట్స్‌ కోసం ‘టెక్నాలజీ అండ్‌ సర్వీసెస్‌’ మెనూలోకి వెళ్లొచ్చు.

 

 

 

యూజర్ల ప్రైవసీ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. సుమారు 5 లక్షల మందికి పైనే యూజర్లు ప్రత్యేక కంటెంట్‌ని జనరేట్‌ చేస్తున్నారు. నెలకు 30 లక్షల షేరింగ్‌లు అవుతున్నాయి.  కంటెంట్‌ని క్రియేట్‌ చేయడంలో శిక్షణనిస్తున్నాం. రెండు లేదా మూడు నిమిషాల నిడివిలో ఉన్న వీడియోలే ఎక్కువగా ట్రెండింగ్‌ అవుతున్నాయ్‌.  ఫేక్‌న్యూస్‌కి అడ్డుకట్ట వేస్తున్నాం. మొత్తం కంటెంట్‌ని ఎప్పటికప్పుడు స్కాన్‌ చేసి అభ్యంతరకరమైతే తొలగిస్తాం.
- సునీల్‌ కామత్‌ షేర్‌ఛాట్‌ ప్రతినిధి

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని